అనువాదలహరి

జన్మ హక్కు… జేనెట్ లూయీ, వెల్ష్ కవయిత్రి

నగరాలకి దూరంగా

మారే మనుషులకి దూరంగా

పల్లెల్లో పుట్టిన

మనలో కొందరికి

ఒక జన్మ హక్కు ఉంది

అదెవ్వరూ అమ్మగలిగేది కాదు

అదొక రహస్య ఆనందం, అది

ఎవరూ మాటల్లో చెప్పగలిగేదీ కాదు. 

ఎందుకంటే మనమందరం

మహోన్నతమైన విషయాలకి బంధువులం:  

అడవి బాతుల విహారాలకీ

తెల్లని గుడ్లగూబల రెక్కలకీ ;

గండుమీనులకీ, సాలమన్ లకీ

గిత్తలకీ, గుర్రాలకీ

క్రౌంచపక్షుల అరుపులకీ

సువాసనలు వెదజల్లే మూలికలకీ. 

చెట్ల ఔన్నత్యమూ

సెలయేళ్ళ త్వరితగతీ

మంచు చేసే ఇంద్రజాలం

మన కలల్ని రూపుదిద్దేయి

ఈ నగ్న గిరులపై నడకని 

ఎవరు హక్కుగా భావించి నడుస్తారో …

వారిలో, వీటి ఆత్మసౌందర్యం

కొంచెపు ఊహల్ని తోపించదు.

.

.

జేనెట్ లూయీ

1 November 1900 – 15 April 1979)

ఐరిష్ కవయిత్రి

The Birth right

 We who were born

 In country places,

 Far from cities

 And shifting faces,

 We have a birth right

 No man can sell,

 And a secret joy

 No man can tell.

 For we are kindred

 To lordly things,

 The wild duck’s flight

 And the white owl’s wings;

 To pike and salmon,

 To bull and horse,

 The curlew’s cry

 And the smell of gorse.

 Pride of trees,

 Swiftness of streams,

 Magic of frost

 Have shaped our dreams:

 No baser vision

 Their spirit fills

 Who walk by right

 On the naked hills.

.

Eiluned Lewis

1 November 1900 – 15 April 1979)

Irish Poetess

%d bloggers like this: