అనువాదలహరి

అడవిలో కాలిబాట…. రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి

డెబ్భయి ఏళ్ళయి ఉంటుంది
వానా, వాతావరణమూ మరొకసారి జతగలిసి
అడవిలోని ఆ కాలిబాటని కనపడకుండా చేశాయి.
వాళ్ళు చెట్లు నాటకముందు…
ఒకప్పుడు అడవిలో ఆ త్రోవ ఉండేదని
ఇప్పుడు ఎవరూ ఊహించలేరు.
అదిగో ఆ ఆరుబయట బంజరులో పొదల క్రింద
ఉమ్మెత్త చెట్లు బలిసినచోట ఆ త్రోవ ఉండేది.

జాగ్రత్తగా గమనించే వాళ్ళకే కనిపిస్తుందది. 
పావురం ఎక్కడ పొదుగుతుందో  
నీటికుక్క ఎక్కడ పొర్లుతుందో
అక్కడ అడవిలో ఒక కాలిబాట ఉండేదని.

అయినప్పటికీ, ఒక వేసవి సాయంత్రం
బాగా పొద్దుపోయేక అడవిలో ప్రవేశిస్తే
నీరుబిల్లులు తనతోడుకి సంకేతం పంపే …
చేపలు చక్రాల్లా తిరిగే మడుగులమీద
(అక్కడ అడవిలో మనుషులంటే వాటికి ఎలాంటి భయం లేదు
ఎందుకంటే, అంత తక్కువమందిని అవి చూసి ఉంటాయి)
రాతిరి గాలి చల్లబడే వేళ…
ఆ అడవిలో మూసుకుపోయిన త్రోవ
అవి బాగా ఎరిగి ఉన్నట్టు
హిమపాతపు ఏకాంతంలో
నెమ్మదిగా నడుచుకుంటూ పోయే
గుర్రపు అడుగుల చప్పుడు మీకు వినిపిస్తుంది
మంచుకురిసేవేళ గౌను రెపరెపలు వినిపిస్తాయి. 
కానీ, అక్కడ అడవిలో కాలిబాట ఏదీ లేదు.
.

రుడ్యార్డ్ కిప్లింగ్

30 December 1865 – 18 January 1936

ఇంగ్లీషు కవి

.

The Way Through the Woods

.

They shut the road through the woods

Seventy years ago.

Weather and rain have undone it again,

And now you would never know

There was once a road through the woods

Before they planted the trees.

It is underneath the coppice and heath,

And the thin anemones.

Only the keeper sees

That, where the ring-dove broods,

And the badgers roll at ease,

There was once a road through the woods.

Yet, if you enter the woods

Of a summer evening late,

When the night-air cools on the trout-ringed pools

Where the otter whistles his mate.

(They fear not men in the woods,

Because they see so few)

You will hear the beat of a horse’s feet,

And the swish of a skirt in the dew,

Steadily cantering through

The misty solitudes,

As though they perfectly knew

The old lost road through the woods . . . .

But there is no road through the woods.

.

Rudyard Kipling

30 December 1865 – 18 January 1936

English Poet

%d bloggers like this: