అనువాదలహరి

ఇదీ స్త్రీ ప్రపంచం… ఈవన్ బోలండ్, ఐరిష్ కవయిత్రి

మన జీవన విధానం
ఏమీ మారలేదు
మొదటి సారి చక్రం
కత్తికి పదునుపెట్టిననాటినుండి

బహుశా దీపం వత్తి
ఎక్కువ ప్రజ్వలిస్తుందేమో
చక్రాలు నిలకడగా ఉంటాయేమో
మనం మాత్రం అలాగే ఉన్నాము.

మన జీవితాలని కొలుచుకుంటాం
సంఘటనల కొండగుర్తులద్వారా
మరిచిపోయినవీ
కళ్ళెదుట కనిపించేవీ
మిగిలిపోయిన రొట్టెముక్కా,

జమాఖర్చుల పద్దులూ,
వాషింగ్ పౌడరికి ఎంత ఇచ్చేము
వాడు ఎంత కట్టేదూ
ఇంకా ఆరెయ్యాల్సిన తడిగుడ్డలెన్ని…

చారిత్రక వ్యక్తుల్లా
మన అసంపూర్ణ కార్యాలనుబట్టి
మనల్ని అంచనా వేస్తుంటారు

మనం ఎన్నడూ కాలేము:
నక్షత్ర దర్శకులుగానో
గారడీ చేసెవాళ్ళలాగనో
మనకి ఎప్పుడూ
ఏదో ఒక సంజాయిషీ ఉంటూనే ఉంటుంది

దొరికిన చరిత్రక ఆధారాలబట్టి
మనం నేరం జరిగినచోట
ప్రత్యక్ష సాక్షులం కాము

ఒకప్పుడు రాజు గారి తల
దారుణంగా తెగినప్పుడు
మనం ఎక్కడో
పిండి విసురుకునేవాళ్ళం

లేకపోతే పులుసులోకి కావలసిందేదో
కొనుక్కుంటూ ఉండేవాళ్ళం.
ఇప్పటికీ అంతే!

మన ఇళ్ళు
పిల్లల్ని శలభాలుగా మార్చి
ఆకలిమంటలకి గురిచెయ్యడం
చరిత్ర కాదు.

మన వేదనా గీతాన్ని
ఎవరూ ఏ కాగితం మీదా
ఇప్పటికీ స్వరబద్ధం చెయ్యరు.

అపుడపుడు ఉత్సాహం నింపడానికి
కనిపిస్తాయి అదిగో ఫలానా చోట
ఒక మహిళ అపురూపమైన
కీర్తి చంద్రికలు గడించింది… అని

కాని ఆమెకు దక్కుతున్నది
ఒక చిన్నపాటి రివట గాలి.
కానీ ఇక్కడ మరో ఆమెకి
నోరు పచ్చిపుండయిపోతుంది.

అలాగని ఆమె నోటితో ఏమీ
నిప్పులూదే గారడిలు చెయ్యలేదు.
పాపం చలికి దొరికిపోయిన
మా పక్కింటామె ఇంటికి  వస్తోంది. అంతే!
.
ఈవన్ బోలాండ్

24 September 1944

ఐరిష్ కవయిత్రి

.

It’s a Woman’s World

Our way of life

has hardly changed

since a wheel first

whetted a knife.

Maybe flame

burns more greedily

and wheels are steadier,

but we’re the same:

we milestone

our lives

with oversights,

living by the lights

of the loaf left

by the cash register,

the washing powder

paid for and wrapped,

the wash left wet:

like most historic peoples

we are defined

by what we forget

and what we never will be:

star-gazers,

fire-eaters.

It’s our alibi

for all time:

as far as history goes

we were never

on the scene of the crime.

When the king’s head

gored its basket,

grim harvest,

we were gristing bread

or getting the recipe

for a good soup.

It’s still the same:

our windows

moth our children

to the flame

of hearth not history.

And still no page

scores the low music

of our outrage.

Appearances reassure:

that woman there,

craned to

the starry mystery,

is merely getting a breath

of evening air.

While this one here,

her mouth a burning plume –

she’s no fire-eater,

just my frosty neighbour

coming home.

.

Eavan Boland

24 September 1944

Irish Poet

%d bloggers like this: