అనువాదలహరి

ఏని షోర్ , జానీ డూన్… పాట్రిక్ ఓర్, అమెరికను కవి

(బహుశా ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా వ్రాసిన కవిత అయి ఉండ వచ్చు. దురదృష్టవశాత్తూ నాకు ఈ కవి గురించిగాని, ఈ సంఘటనగురించిగాని సమాచారం దొరకలేదు.

ఈ కవితలో నాకు కనిపించిన విషయం ఏమిటంటే, పెద్దపెద్ద నేరాలు చేసే వాళ్లు తప్పించుకుంటూ, అమాయకుల్ని బలిపశువులను చేస్తుంటారు. వాళ్లు అమాయకులచుట్టూ పన్నే ఉచ్చు ఎంత పకడ్బందీగా ఉంటుందంటే, న్యాయస్థానాలు (నిజమైన న్యాయస్థానాలు) కూడా ఎదురుగా ఉన్న ఋజువులను దాటి తీర్పు ఇవ్వలేవు. అమాయకంగా ఒక జీవితకాలం జైళ్ళలో మగ్గినవారిగురించీ (Alexander Dumas’s The Count of Monte Christo అలాంటి ఒక కథ), అంతకంటే అన్యాయంగా మరణశిక్ష విధించబడి నిండుజీవితాన్ని పోగొట్టుకున్న నిర్భాగ్యులగురించి మనం అప్పుడప్పుడు చదువుతూనే ఉంటాం. ఇందులో చెప్పిన విషయం గురించి పూర్వాపరాలు తెలియకపోవడం వల్ల వ్యాఖ్యానించలేకపోయినా,కవి ఒక సంఘటనపై తన అభిప్రాయాన్ని నమోదు చేశాడన్నది మాత్రం స్పష్టం.)
.
నిన్న రాత్రి, ఏని షోర్ నాత్యం చేస్తూ
పాడింది ‘సౌత్ ఎండ్’ హాల్లో,
దీపాల వెలుగులో ఆమె చవక బారుగా కనిపించింది
బుగ్గలకి రంగేసుకుని, కళ్ళకి మెరుగులద్దుకునీ
హాలు పేరుకి దీటైన పాట పాడుతూ…

ఏనీ పాటని నేను త్వరలోనే మరిచిపోతాను
దాని గురించి మరొకసారి తలుచుకోను కూడా…
హేయమైన సంగీతం,యువత గట్టిగా అరిచే బూతుమాటలూ
బాధతో నలిగిపోయే అమాయకత్వమూ కలగలిసిన
అంత కీచు అరుపుల్లోనూ మారుమోగిన
ఒక్క విషయానికి మినహాయించి…

జానీ డూన్ కి మరణశిక్షవేసిందట న్యాయస్థానం
తను నిర్భయంగా చేసిన దారుణమైన హత్యకి;
అలాంటి వాళ్ళు చేసిన నేరాలకి తగిన శిక్షవిధించాలంటే
మరణశిక్ష ఏమాత్రమూ సరిపోదంటున్నారు.
తన గురించి జాలి పడనక్కరలేదు.

జానీ డూన్ మీద నేను జాలిపడటం లేదు.
ఇప్పుడతన్ని నేను సులభంగా మరిచిపోతాను.
నేను మరిచిపోలేనిదొక్కటే: అతనిలో కనిపించిన
చిన్నపిల్లలను దండించినపుడు వాళ్ల ముఖంలో
కనిపించే అమాయకపు వెరపు లాంటి వెరపు;
అతను చేతులు అటూ ఇటూ తిప్పుతూ మూగగా చూస్తున్నాడు
అవి తనకి తెలియకుండా ఏమి తప్పు చేశాయా అని.
.
పాట్రిక్ ఓర్
అమెరికను కవి

.

Annie Shore and Johnnie Doon

.

Annie Shore, ’twas, sang last night     

Down in South End saloon;      

A tawdry creature in the light,  

Painted cheeks, eyes over bright,        

Singing a dance-hall tune.         

I’d be forgetting Annie’s singing—    

I’d not have thought again—    

But for the thing that cried and fluttered       

Through all the shrill refrain:    

Youth crying above foul words, cheap music,        

And innocence in pain.   

They sentenced Johnnie Doon today  

For murder, stark and grim;      

Death’s none too dear a price, they say,        

For such-like men as him to pay;        

No need to pity him!       

And Johnnie Doon I’d not be pitying—       

I could forget him now—         

But for the childish look of trouble     

That fell across his brow,

For the twisting hands he looked at dumbly 

As if they’d sinned, he knew not how.

.

Patrick Orr

American Poet

(Regrettably no details of the poet are available)

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/272.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: