అనువాదలహరి

శోక గీతి… రుత్ గత్రీ హార్డింగ్, అమెరికను కవయిత్రి

పచ్చిక బాగా మొలిచిన త్రోవ ఒకటి

వాలుగా, వంపులు తిరుగుతూ లోయలోనుండి

కొండ శిఖరానికి చేరుకుంటోంది

అక్కడ నీ ప్రియతముడు నిద్రిస్తున్నాడు…

కానీ నా వాడు, ఎక్కడున్నాడో దేముని కెరుక,

వంద నిలువులలోతులో పడి ఉన్నాడు.

ఒక సమాధి ఎలా ఉండాలో అలా …

శోకసంద్రమైన కడలికి దూరంగా

తారకల లే వెలుగులు కప్పిన సమాధి చెంత

నువ్వు మోకరిల్లడం చూశాను!

కానీ నా కలల్లోనూ, తారల వెలుగుల్లోనూ

ఎగసిపడె కెరటాలు నన్ను పిలుస్తుంటాయి.

పాపం! నీ మౌనశోకానికి త్రోవ చాలా ఎగుడు…

కానీ నే తిరిగే మార్గాలు మరీ దుర్గమం, ఏలన

ఏ త్రోవా ఈ గాలీ, నురగల పరిధి దాటదు

ఇంటికి దూరంగా ఎక్కడో ఉన్న తన దగ్గరకి

ఏన్నడూ ఏ త్రోవా నను తీసుకు పోదు 

.

రుత్ గత్రీ హార్డింగ్

ఆగష్టు 20, 1882 – 1971

అమెరికను కవయిత్రి

 .

Threnody

.

There’s a grass-grown road  from the valley—

A winding road and steep—

That leads to the quiet hill-top,

Where lies your love asleep…

While mine is lying, God knows where,

A hundred fathoms deep.

I saw you kneel at a grave side—

How still a grave can be,

Wrapped in the tender starlight,

Far from the moaning sea!

But through all dreams and starlight,

The breakers call to me.

Oh, steep is your way to silence—

But steeper the ways I roam,

For never a road can take me

Beyond the wind and foam,

And never a road can reach him

Who lies so far from home.

.

Ruth Guthrie Harding

(20th Aug 1882 – 1971 )

American Poetess

Poem Courtesy:

The Home Book of Verse, American and English, 1580 – 1920.

Selected and Arranged by Burton Egbert Stevenson, Henry Holt & Company  1922 New York. Page 1080

%d bloggers like this: