ఓ మృత్యువా, ఆమె ఇపుడున్న చీకటిలోంచి నువ్వు నా దగ్గరకి వచ్చేటపుడు నువ్వు సమాధి వాసన వేస్తూ రాకు తలపై వాడిన గులాబులు ధరించకు.
ఓ మృత్యువా, శూన్య నిస్వనముతో రాకు అడుగులు సడిచేయకుండా, మురికిచేతులతో రాకు. చూడు! నీ నిర్మానుష్య, అగోచరమైన ఆవాసముకంటే ఇప్పుడు నేనేం తక్కువ ఒంటరితనం అనుభవించడం లేదు.
కానీ, ఆమెని తాకిన ప్రతి వస్తువుకీ అంటుకునే సుగంధం లాంటి సుగంధం, పరీవ్యాప్తమైన ఆమె సహజ పరిమళంతో రా ఆమె మృదు,శీఘ్రతర కరస్పర్శ అరువు తెచ్చుకో
ఆమె కురులవెలిగే లేత పసిడి రంగునద్దుకుని ఓ మృత్యువా, నను చేర రా. నీ అడుగులు తేలికగాపడి ఆమె వచ్చిందేమోనని నేను భ్రమించాలి, భ్రమించి నా మృత్యుశయ్యపై ఒత్తిగిలాలి.
నా ప్రేమిక కవోష్ణ శ్వాసక్రింద ఉన్నట్టు కలగంటూ గడ్డకడుతున్న నా నవనాడులూ వేడెక్క వచ్చు; ఆమె స్వరం అనుకరిస్తూ నన్ను పేరుపెట్టి పిలు అపుడు ఓ మృత్యువా, నేను నిన్ను అనుగమిస్తాను. . హెన్రీ కైలర్ బన్నర్
August 3, 1855 – May 11, 1896
అమెరికను కవి, నవలా రచయిత
.
Henry Cuyler Bunner
.
Strong As Death
.
O Death, when thou shalt come to me
From out thy dark, where she is now,
Come not with graveyard smell on these,
Or withered roses on thy brow.
Come not, O Death, with hollow tone,
And soundless step, and clammy hand0
Lo, I am now no less alone
Than in thy desolate, doubtful land;
But with that sweet subtle scent
That ever clung about her (such
As with all things she brushed was blent);
And with her quick and tender touch.
With dim gold that lit her hair,
Crown thyself, Death; let fall thy tread
So light that I may dream of her there,
And turn upon my dying bed.
And though my chilling veins shall flame
My love, as though beneath her breath;
And in her voice but call my name,
And I will follow thee, O Death.
.
Henry Cuyler Bunner
August 3, 1855 – May 11, 1896
American Poet and Novelist
Poem Courtesy:
The Home Book of Verse, American and English, 1580 – 1920.
Selected and Arranged by Burton Egbert Stevenson, Henry Holt & Company 1922 New York. Page 1081.