అనువాదలహరి

జవాబు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

నేను మట్టిలోకి తిరిగి చేరుకున్నప్పుడు
ఆనందంతో తుళ్ళిసలాడిన నా శరీరం
ఒకప్పుడు విర్రవీగిన దాని
ఎరుపు తెలుపు వన్నెలని వదులుకున్నప్పుడు
పురుషులెవరైనా పక్కనుండి పోతూ
పేలవమైన, తెచ్చిపెట్టున జాలితో మాటాడితే
నా మట్టి గొంతు ఎరువుతెచ్చుకుని మరీ
వాళ్ళకి గట్టిగా సమాధానం చెబుతుంది:

“ఓయ్! చాలు, కట్టిపెట్టు. నేను సంతృప్తిగానే ఉన్నా.
అవసరం లేని నీ జాలిమాటలు వెనక్కు తీసుకో!
ఆనందం నాలో ఒక జ్వాల
అది ఒక్క సారి దహించేది కాదు, నిలకడైనది.
అలవోకగా వంగే రెల్లులా సుకుమారమైనది
దాన్ని వంచే తుఫానుని ప్రేమిస్తుంది….
నువ్వు సుఖంలో పొందే ఆనందం కన్నా
నేను దుఃఖంలో ఎంతో ఆనందాన్ననుభవించేను.”
.
సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి

Sara Teasdale
Sara Teasdale

.

The Answer

.

When I go back to earth

And all my joyous body

Puts off the red and white

That once had been so proud,

If men should pass above

With false and feeble pity,

My dust will find a voice

To answer them aloud:

“Be still, I am content,

Take back your poor compassion!—

Joy was a flame in me

Too steady to destroy.

Lithe as a bending reed

Loving the storm that sways her—

I found more joy in sorrow

Than you could find in joy.”

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American Poet

The New Poetry: An Anthology.  1917.

 Harriet Monroe, ed. (1860–1936).

For A New Metaphor… Vadrevu Chinaveerabhadrudu

There’s Fall in the air. It’s time the viridity returns

to the bark, to the stalk, and to the spirit lying deep

Within the living cells. The melodies playing before eyes

till now, retreat in endless cycles like winding on a spool.

Winter comes to an end. A whirlwind of withered leaves.

A pale anemic flux. Trees standing like the porcelain jars

arrayed by the wayside. And the Pethodia flowers seeming like

flower vases amidst old, stained brassware.

What do you pray folding your hands before

every receding season? Why do you watch so keenly

every sensuous visual? After all, isn’t your angst behind sieving Time

With fervor only to find a new metaphor for your poem?

.

Vadrevu Chinaveerabhadrudu

Telugu

India

Vadrevu Chinaveerabhadrudu

 

 

కొత్త మెటఫర్ కోసం

.

ఆకురాలేకాలం మొదలయింది. పసరుదనమిప్పుడు

బెరడులోకి, కాండంలోకి,  నీలోపలెక్కడో పదిలపరచుకున్న

జీవకణాల్లోకి తిరోహితమయ్యే వేళ. ఇంతదాకా కళ్ళముందు

వినిపించిన రాగమిప్పుడు వెనుదిరిగి చుట్టచుట్టుకుంటున్నది.

 

ముగిసిపోయిన హేమంతం. శీర్ణపత్రదుమారం. రంగు

వెలసిన పేల వెలుతురు. రోడ్డుపక్కన పేర్చిన పింగాణి

జాడీల్లాగా నగరంలో చెట్లు. మరకలుపడ్డ పాత  ఇత్తడి

సామాను మధ్య పూల వాజుల్లాగా పెతోడియా  పుష్పాలు.

 

కరిగిపోతున్న ప్రతి ఋతువుముందూ చేతులుజోడించి

నువ్వు యాచిస్తున్నదేమిటి? ప్రతి దృగ్గోచరాన్నీ  తరచి

తరచి చూస్తున్నావెందుకు?  తపించి తపించి కాలాన్ని

వడగట్టేదంతా, కవితకొక  కొత్త మెటఫర్ కోసమే కదా!

.

వాడ్రేవు చినవీర భద్రుడు

Accused Forever…. Neeraja Amaravadi, Telugu, Indian

That the death sentence

Shall be abolished in all cases except

Serious terrorist activities

Heartened even a yet-to-be-born.

Rider: There are exceptions

And dealt with on case to case basis.

If you are sure that foetus is a girl child

Execution shall be forthwith.

For the crime of giving birth to a girl

A mother cannot be absolved of her guilt.

If the desired be a young girl, adolescent or old lady

Death is imminent if they don’t cooperate.

If somebody marries her heartthrob

Heads must roll as prestige was at stake.

All are equal in dispensing this death penalty

No exceptions could be made on account of being a minor.

For reasons of national security

Even if it were a toddler

She is ineligible for mercy petition.

These prim girls are the most dreaded terrorists

Not falling under the purview of law or law commissions.

The neo Gandhians who plead

Abolishing death penalty in phased manner

Even for the hard-core terrorists

Give humanitarian sentence

To nip the foetal and natal girls

Secretly and silently.

One may condone and commute

Death sentences to international terrorists.

But these mothers who

Make milk out of their blood

Are criminals not fit for even appeal.

The Indian society is moving towards

Abolition of capital punishment, they say.

But, for bloody acts of hard-core terrorism

The female foetus can’t escape premature end.

.

Neeraja Amaravaadi.

Telugu

Indian

(Poem Courtesy: Matruka October 2015)

  

Neeraja Amaravaadi
Neeraja Amaravaadi

 Dr. Neeraja hails from Warangal. She is an MA tripass  in Telugu, English and Sanskrit with a Ph.D in Telugu, in addition. For some time she worked as a lecturer in Shanti Degree College for Women, Narayanaguda and also had a short stint at Vikas Concept School. Her collection of short stories  “Chiru Kanuka” … based on her experience in interacting with children coming from various socio-economic backgrounds at the Concept school is on the anvil.  She is a prolific writer and most of her poems, short stories were published in regular print and online magazines.

She is in USA since 2012.

.

ఎప్పటికీ ముద్దాయినే

.

ఉగ్రనేరాలకు తప్ప

ఇతరకేసులలో

మరణశిక్ష రద్దు అన్న వార్తతో

పుట్టని బిడ్డకి సైతం హర్షం కలిగింది.

 

గమనిక:  చాలా కేసులకి

మినహాయింపులు ఉన్నాయిట

పుట్టేది ఆడబిడ్డ అని తెలిస్తే

తక్షణమే ఉరిశిక్ష అమలు

ఆడపిల్లకి జన్మనిచ్చిన నేరానికి

ఆ తల్లి మరణశిక్షనుండి  తప్పించుకోలేదట.

ఇష్టపడ్డ బాలిక / యువతి/ పండు ముసలి

ఎవరైనా సహకరించకపోతే  హత్యే

 

మనసుకి నచ్చినవాడిని మనువాడితే

పరువుకోసం తల తెగుతుందట.

ఈ మరణశిక్షల అమలులో అందరూ సమానమే

మైనరు అయినా కనికరం లేదు.

 

జాతీయభద్రతదృష్ట్యా

నెలల పసికందైనా

క్షమాబిక్షకు అనర్హురాలు.

 

చట్టాలకు, లా కమిషన్ ల పరిథికి రాని

మహోగ్రవాదులు బంగారు తల్లులు.

 

కరుడుగట్టిన నేరస్తులకు కూడా

దశలవారీగా  మరణశిక్షను

రద్దు చేయాలని  యోచిస్తున్న గాంధేయ వాదులు

కనుగుడ్డు తెరవని

పసిమొగ్గలనుపురిటిలోనే

రహస్యంగా చిదిమేయాలని

మానవతా తీర్పునిస్తున్నారు.

 

 అంతర్జాతీయ ఉగ్రవాదులకైనా

క్షమాభిక్షపెట్టవచ్చు కాని

రక్తాన్ని స్తన్యంగా  మార్చే అమ్మలు

అప్పీలుకుకూడా తావులేని ముద్దాయిలు.

మరణశిక్ష రద్దు దిశగా

భారత సమాజం అడుగులు వేస్తోందట

కానీ అత్యంత కరుడుగట్టిన నేరస్తులంటూ

ఆడకణానికి విఛ్చిత్తే తప్పదట.

 

.

నీరజ అమరవాది

కవయిత్రి పరిచయం

పుట్టింది వరంగల్లు.  బాల్యం , విద్యాభ్యాసం అంతా హైదరాబాదు:  పదవతరగతి వరకునారాయణగూడా మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల.  ఇంటర్:  రావు బహదూర్ వెంకట్రామిరెడ్డి మహిళా కళాశాల. డిగ్రీ  ఆంధ్ర మహిళా కళాశాల .( తెలుగు సాహిత్యం ముఖ్యాంశంగా ) 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో  ఎమ్.ఎ ( తెలుగు ) , ఎమ్ ఫిల్ ,  ప్రతిభ – ఇమాజినేషన్ అంశం పై పి.హెచ్.డి.  ఎమ్.ఎ (ఇంగ్లీషు) ఉస్మానియా యూనివర్సిలో; ఎమ్.ఎ (సంస్కృతం ) తెలుగు యూనివర్సిటీలో.

నారాయణగూడా శాంతి డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా  కొంతకాలం. బాలల మనస్తత్వం, ప్రవర్తనల పై ఆసక్తి తో మాంటిస్సోరీ డిప్లొమా[A.M.I] చేశాను. వాళ్ళ అమ్మాయికి సరదాగా చెప్పిన కథలను తేనె చినుకులు పేరిట బాలసాహిత్య పరిషత్తు  వారు 2012 లో  ప్రచురించారు .  Vikas Concept  School  లో ఉపాధ్యాయురాలిగా రకరకాల వయసు, నేపధ్యం గల పిల్లల ప్రవర్తనని దగ్గరగా పరిశీలించిన అనుభవంతో వ్రాసిన కొన్ని కథలు, “చిరుకానుక పేరిట త్వరలో తీసుకు రాబోతున్నారు.  ఆమె వ్రాసిన ఇతర కథలు, కవితలూ ప్రముఖ పత్రికలూ, వెబ్ మేగజీన్లలో  ప్రచురితమయ్యాయి.

భర్త ఉద్యోగరీత్యా ఆమె 2012 నుండి అమెరికాలో ఉంటున్నారు.

మహాత్ముడు… యూనిస్ టీట్యెన్స్ , అమెరికను కవయిత్రి

అతని గొప్పదనాన్ని నే నెన్నడూ తెలుసుకోలేకపోయాను.
ఒక్కొసారి తను నా పక్కనే, అడుగులో అడుగు వేసుకుంటూ,
నెమ్మదిగా ఎలా నడిచే వాడంటే
చాలా సాదాసీదాగా, నా ఆలోచనల్లాగే
రెక్కలురానట్టు. అప్పుడు నాతా బాతాఖానీ కొట్టేవాడు,
తనకి నచ్చేది కూడా.
గరుత్మంతుడంతకాదుగాని, తన వెడల్పు రెక్కలు ముడుచుకుని
నాతో నడవడానికి ఇష్టపడేవాడు,
అది అతను కావాలని కోరుకున్నదే.
కానీ, నా మిత్రుడు
చాలా సామాన్యుడిలాగే ఉండేవాడు.
నేను మరిచేపోయాను.

కాని ఒక్కసారి రోదసీ కుహరాల్లోంచి
ఒక పెద్ద పిలుపు విన వచ్చింది.
సమున్నతమైన మానవ అస్తిత్వ శిఖరాలనుండి స్పష్టంగా.
అంతవరకు నాతో మసలిన నా మిత్రుడు దాన్ని విన్నాడు.
విని, ఆ శిఖరాగ్రాలతో లీనమై సంభాషిస్తూ
నా పక్కనుండి లేచి, పైకి ఎగిసిపోయాడు.
అప్పుడు నాకు గుర్తొచ్చింది.
నేను ఆకాశంలోకి దృష్టి సారిస్తాను అతనికోసం.
నేను అప్పుడు చూశాను
ఆకసపు నేపథ్యంలో… దూరంగా
అతని రెక్కలమీద సూర్యుని బంగారు వన్నె తళుకులు.
.
యూనిస్ టీట్యెన్స్
అమెరికను కవయిత్రి, నవలాకారిణి, సంపాదకురాలు

 

Eunice Tietjens

The Great Man

 .

I cannot always feel his greatness.

Sometimes he walks beside me, step by step,

And paces slowly in the ways—

The simple, wingless ways

That my thoughts tread. He gossips with me then,

And finds it good;

Not as an eagle might, his great wings folded, be content

To walk a little, knowing it his choice,

But as a simple man,

My friend.

And I forget.

Then suddenly a call floats down

From the clear airy spaces,

The great keen, lonely heights of being.

And he who was my comrade hears the call

And rises from my side, and soars,

Deep-chanting, to the heights.

Then I remember.

And my upward gaze goes with him, and I see

Far off against the sky

The glint of golden sunlight on his wings.

.

Eunice Tietjens

July 29, 1884 – September 6, 1944

American Poet, Novelist, Author, and editor.

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/372.html

చిత్రం! … లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

శ్వాసించలేనివీ, వేటినీ చూడలేనివీ
అలాంటి వాటికే ఎందుకు మరణం ఉండదో?
ఒక పిసరంత నేలకీ, స్పందనలేని రాతికీ,
ఒక ధూళి కణానికీ, కేవలం మట్టిపెల్లకీ
శాశ్వతత్వం అనుగ్రహించబడింది.
ఒక రైలుదారి పక్క గులకరాయికి మృతిలేదు…
భగవంతుని అపురూపవరం లభించింది దానికి.

మన పూర్వీకులు కోసిన గడ్డి
ఇపుడు వాళ్ళ సమాధులపై మొలుస్తోంది.
పారీ పారనట్టి అతి చిన్న వాగులు
ఎప్పుడూ ఇలా వచ్చి అలా పోతూనే ఉంటాయి.
ఇసకలా జడమై బలహీనమైనవాటిని
చంపి ప్రాణంతీయగల మృత్యువు లేదు.
మనిషొక్కడే గొప్పవాడూ, బలవంతుడూ
మేధోపజీవీ…. అందుకే అతనికి మరణం.
.

లూయీ అంటర్ మేయర్

October 1, 1885 – December 18, 1977

అమెరికను కవీ, విమర్శకుడు.

 .

Louis Untermeyer

.

Irony

.

Why are the things that have no death

The ones with neither sight nor breath!

Eternity is thrust upon

A bit of earth, a senseless stone.

A grain of dust, a casual clod

Receives the greatest gift of God.

A pebble in the roadway lies—

                        It never dies.

The grass our fathers cut away

Is growing on their graves to-day;

The tiniest brooks that scarcely flow

Eternally will come and go.

There is no kind of death to kill

The sands that lie so meek and still….

But Man is great and strong and wise—

                        And so he dies.

.

Louis Untermeyer

October 1, 1885 – December 18, 1977

American Poet and Critic

The New Poetry: An Anthology.  1917.

 Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/379.html

The Prop… Indus Martin, Telugu, Indian

Ever since hutments cropped up around,

Like a lone central column,

The singular prop for our lives 

Has been that serrated sickle.

To snap the umbilical cord

That noosed around my neck

In the hands of my granny

What came handy was… that gory scalpel

To prevent post parturition paralysis

To the just yeaned dappled buffalo

By trimming the hoofs of the new-born

My brother suddenly recalled that Nail-clipper.    

This black crescent moon

Was the harvester of ten acres

Standing a prop to my father bow-bent to reap

Sharpening it occasionally on his stretched hands

This pale semi-annular ring of rain

Was the butcher’s knife

That chopped the long-legged hen to pieces

To relieve the eaves of hutments

Sneezing from the cold caught in relentless rains.

For my mother working at tobacco barns

It worked for the pepper spray

When the son of a bitch… the owner

Demanded her modesty…

Making him run naked doffing his apparel.

No sooner the teacher had called it a day

For the children scurrying home

Before the bell fell silent

It was the hanger tucked in the hole of a wall

Which shouldered the burden of school bags.

It did not strike me as a child ninny

Why my mother who got up before dawn

Made me pray in its direction,

But I now realized

God is but reassurance;

From the bag hanging on to the ragged sickle

Peeps through… the book of multiplication table.

 Indus MartinIndus Martin

Born in Kajipalem, near Nijampatnam, in Guntur District of Andhra Pradesh Mr Martin was a student of AC College, Guntur.  He did Masters in English Literature, Psychology and Education. He now Works Kendriya Vidyalaya Sangathan  under HRD Ministry and was for some time Embassy Attaché Officer, Ministry of External Affairs.

.

దన్ను

 .
మా చుట్టిల్లు పుట్టిన యాలనుండి
ఒంటి నిట్టాడ్లా మా బతుకుల్ని
ఒంటిగనే మోత్తా వుంది
కొక్కుల కొడవలి

వదలనని నామెడను
పెనేసుకున్న మాయమ్మ పేగును
ముటుక్కుమనిపిచ్చేదానికి జేజి చేతిలో అదే 
ఎర్రటి స్కాల్పెల్

ఈనిన మచ్చల బర్రెకు వాతంకాకుండా 
తువ్వాయి పుట్టుగోర్లు తినబెట్టేదానికి
అన్నాయ్ గోడికి గుర్తొచ్చిందీ 
అదే నెయిల్ క్లిప్పర్

ఈ నల్లటి నెలవంక తల్లే 
వంచిన మా బాబు నడుముకు ఊతమై 
చాపిన చేతులకు సానబెట్టి 
పదెకరాలు కోపిచ్చిన
హార్వెస్టర్

ముసురు దెబ్బకు చీదుకుంటున్న
ఇంటి సూరుకు 
పడిసెం దిగ్గారా 
బెరస పెట్ట తునకలు నరికిన
బుచర్ నైఫ్ గూడా 
రంగెలిసిపోయిన ఈ వరద గుడే

బేర్నీలకెల్లిన ఊళ్ళో  
బులపాటం తీర్చమన్న 
బొగత నాకొడుకును
గుడ్డలూడ దౌడు పెట్టించిన
అమ్మకు తెలిసిన అప్పటి 
పెప్పర్ స్ప్రే అదే

పొంతులుగోరు బడి యిడిసీ యిడవంగనే
గెంట కంటే ముందే ఇంటికి చేరే 
సదవర్ల భుజం బొరువు మార్చుకునే 
గోడనెర్రిలో ఇరికిన 
హేగర్ అదే

పిల్లనాయాలుగా వున్నప్పుడు మతికెక్కలేదుగానీ
ఏకుంజావునే లెగిసిన అమ్మ 
ఆ దిక్కుకే నాచేత ఎందుకు మొక్కిపిచ్చేదో
ఇప్పుడు బోధపడింది

దేవుడంటే ఒక దిక్కు

కొక్కుల కొడవలి కొనకి ఏల్లాడుతున్న

సంచిలోని ఎక్కాల బొక్కు

.

Indus Martin

Telugu

Indian
 

నేను మేఘాలని చూసేను… హెర్వీ వైట్, అమెరికను

నేను కొండల మధ్య మేఘాలని చూసేను
కారు మొయిలు పింఛాలు జలధారలు కురిపిస్తూ… 
దిగువనున్న అడవుల నీలిమ
లోయకే పరిమితమైపోయింది
పక్వానికొచ్చిన పళ్ళ బరువుతో, గింజపట్టిన వెన్నులతో
చెట్లు సంతృప్తిగా తడిసి ఆనందిస్తున్నాయి.  

నేను ఆ మైదానంలో సమాధులు చూశాను
తొలితరం వాళ్ళు, నేలను పొదువుకుని
అది చేసాగుకి లొంగేదాకా శ్రమించి
శీతావాతాతపాల్ని ఎదిరించినవాళ్ళు;
వాళ్ళ సంతానం, అదృష్టం కలిసివచ్చి
ఇపుడు పెద్దలుకట్టిన భవంతుల్లో వసిస్తునారు

నేను కొన్ని మరుగుపడ్డ పాటల్ని విన్నాను
దారంట పోతూ చాలా పదిలపరచుకున్నాను
అవి చాలవరకు చవుకబారు పునరుక్తులే,
ఏ చిల్లర వర్తకుడైనా కొనేవే. కానీ
ఆ మొయిళ్ళనీ, సమాధుల్నీ, అరిగిపోయిన పాటనీ
నా మనసులో చిరకాలం నిలుపుకుంటాను
.
హెర్వీ వైట్

(1866–1944)

అమెరికను కవి

.

.

I Saw the Clouds

 .

I saw the clouds among the hills

Trailing their plumes of rainy gray.

The purple of the woods behind

Fell down to where the valley lay

In sweet satiety of rain,

With ripened fruit, and full filled grain.

I saw the graves, upon the plain,

Of pioneers, who took the land,

And tamed the stubborn elements

Till they were gentle to the hand.

Their children, now in fortune’s ways,

Dwell in their father’s palaces.

I saw some old forgotten lays;

And treasured volumes I passed by.

They were but repetitions cheap

For any hucksterer to buy.

The clouds, the graves, the worn old song,

I bear them in my heart along.

.

Hervey White

(1866–1944)

American novelist, poet, and community-builder.

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/405.html

నిర్వాణము… జాన్ హాల్ వీలాక్, అమెరికను కవి

నిదురపో… నేను ఎత్తైన స్వర్గ కవాటాలదగ్గర ఉన్నాను

దిగువన మీ జాలీ కిటికీలపై మెరుస్తూ

ఎదో గొణుగుతూ పరిభ్రమించే నక్షత్రాల మీద

ప్రతి తారకా ఏదో కొంత గొప్పదనం ప్రతిబింబిస్తుంది

అది నాకు తెలుసు.

నేను నిన్ను ఎన్నడో మరిచిపోయాను;

వెండిమువ్వలు చేసే చిరుసవ్వడి సంగీతంలా

మాయమైపోయాను, సన్ననై, పలచబడి వినిపించని గీతంలా.

నిదురపో… నేను ఎత్తైన స్వర్గ కవాటాలదగ్గర ఉన్నాను

నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించేను.

.

జాన్ హాల్ వీలాక్ 

September 9, 1886 – March 22, 1978

అమెరికను కవి

.

Nirvana

 .

Sleep on—I lie at heaven’s high oriels,

  Over the stars that murmur as they go

  Lighting your lattice-window far below.

And every star some of the glory spells

  Whereof I know.

I have forgotten you, long long ago;

  Like the sweet, silver singing of thin bells

Vanished, or music fading faint and low.

  Sleep on—I lie at heaven’s high oriels,

Who loved you so.

.

John Hall Wheelock

September 9, 1886 – March 22, 1978

American Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/402.html

పవన వీణ … ఫ్రాన్సిస్ షా, అమెరికను కవయిత్రి

మా ఇల్లు చాలా ఎత్తుగా ఉంటుంది—
అక్కడ
పగలూ
రాత్రీ
పవనవీణ మోగుతూనే ఉంటుంది
నగర దీపకాంతి మాత్రం
దూరంగా… ఎక్కడో.

మరి గాలి మోయించే వీణ ఎక్కడున్నట్టు?
ఎత్తుగా ఎక్కడో రోదసిలోనా?
లేక, సముద్రం మీదనా?

అదిగో దూరాన ఉన్న నగరిలోని తిన్నని పొడవాటి
వీధుల్లో సరళంగా ప్రసరించే వెలుగురేకలే
దాని సంగీతపు స్వరతంత్రులు

ఈ పవన వీణ
చిరుగాలికి వినిపిస్తుంది:
నగరపు కన్నీటి వెతలూ…
సన్నగా మంద్రంగా, పసిపాపల ఏడుపులూ,
రాజీపడలేని ఆత్మల మనోవేదనలూ
నడుస్తున్న కాల గీతికలూ…
.
ఫ్రాన్సిస్ షా
అమెరికను కవయిత్రి

.

The Harp of the Wind

 .

My house stands high—

Where the harp of the wind

Plays all day,

Plays all night;

And the city light

Is far away.

Where hangs the harp that the winds play?—

High in the air—

Over the sea?

The long straight streets of the far-away town,

Where the lines of light go sweeping down,

Are the strings of its minstrelsy.

And the harp of the wind

Gives to the wind

A song of the city’s tears;

Thin and faint, the cry of a child,

Plaint of the soul unreconciled,

A song of the passing years.

.

Frances  (Wells ) Shaw

1872 – 1937

American Poetess

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/334.html

జీవితం ముగిసిపోయినపుడు… ఇరోం షర్మిలా, మణిపురి కవయిత్రి

జీవితం ముగిసిపోయినపుడు

ప్రాణహీనమైన నా శరీరాన్ని

దయచేసి మీరు ఎత్తి తీసుకుపోయి

ఫాదర్ కౌ బ్రూ పరున్న నేల మీద ఉంచండి.

 

ఈ నిర్జీవ శరీరాన్ని

మంటలలో బుగ్గిగా మార్చడం,

మధ్యలో లేచినపుడు కర్రతో కొట్టడం,

తలుచుకుంటే నాకు వెగటుపుడుతుంది  

 

పైనున్న తొక్క ఎలాగూ ఎండిపోతుంది

దాన్ని నేలలోనే కుళ్ళనివ్వండి

ఏ గనిలోనో ఖనిజంగా మారి

భావితరాలకి ఉపయుక్తమవనీయండి 

 

నా జన్మభూమి కాంగ్లీ నుండి నేను 

శాంతి సుగంధాన్నై నలుదిక్కులా వ్యాపిస్తాను

సమీప భవిష్యత్తులో 

అది ప్రపంచమంతా వ్యాపిస్తుంది   

 

.

ఇరోం  షర్మిలా

14 March 1972

మణిపురి కవయిత్రి

When Life Comes To An End

.

When life comes to an end

You, please transport

My lifeless body

Place it on the soil of Father Koubru.

To reduce my dead body

To cinders amidst the flames

Chopping it with axe and spade

Fills my mind with revulsion.

The outer cover is sure to dry out

Let it rot under the ground

Let it be of some use to future generations

Let it transform into ore in the mine.

I’ll spread the fragrance of peace

From Kanglei, my birth place

In the ages to come

It will spread all over the world.

.

Irom  Chanu Sharmila

born 14 March 1972

Civil rights activist, political activist, and Poet from the Indian state of Manipur

On 2 November 2000, she began a hunger strike which is still ongoing. Having refused food and water for more than 500 weeks, she has been called “the world’s longest hunger striker”. On International Women’s Day, 2014 she was voted the top woman icon of India by MSN Poll

 

%d bloggers like this: