అనువాదలహరి

బానిస… జేమ్స్ ఓపెన్ హీమ్ , అమెరికను కవి

వాళ్ళు బానిసని స్వేచ్ఛగా వదిలేసేరు, సంకెళ్లు త్రెంచి

కానీ అతను పూర్వం ఎంత బానిసో,

ఇప్పుడూ అంతే.

ఇప్పటికీ అతనికి సంకెళ్లు ఉన్నాయి

ఇప్పటికీ అతను అశ్రద్ధకీ, సోమరితనానికీ బానిసే

ఇప్పటికీ ఇంకా అతనికి భయాలూ, మూఢనమ్మకాలూ,

అజ్ఞానమూ, అనుమానమూ, అనాగరికతలనుండి బయటపడలేదు

అతని బానిసత్వం అతని సంకెళ్లలో లేదు

అతనిలోనే ఉంది

వాళ్ళు స్వతంత్రుడిని మాత్రమే సంకెలలనుండి విముక్తుణ్ణి చెయ్యగలరు

కానీ నిజానికి ఆ అవసరం లేదు…

స్వతంత్రుడు ఎప్పుడూ తనని తాను విముక్తుణ్ణి చేసుకుంటాడు.

.

జేమ్స్ ఓపెన్ హీమ్

24th May 1882–  4th Aug 1932

అమెరికను కవి

James Oppenheim
                

 James Oppenheim

.

The Slave

 .

They set the slave free, striking off his chains….    

Then he was as much of a slave as ever.       

He was still chained to servility,

He was still manacled to indolence and sloth,         

He was still bound by fear and superstition, 

By ignorance, suspicion, and savagery …    

His slavery was not in the chains,       

But in himself …  

They can only set free men free …     

And there is no need of that:     

Free men set themselves free.

.

James Oppenheim

24th May 1882–  4th Aug 1932

American Poet, Novelist and Editor

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936)

http://www.bartleby.com/265/268.html. 

.

%d bloggers like this: