అనువాదలహరి

The Grieving Sea… Aranya Krishna, Telugu, Indian

The salty sea is but my embarrassing tears

I harbored from public view;

When I lean back

On the pacific shore

The long dried up moisture

Of the eyes touches my hands

Behind the bleary screens…. the Sea,

Sundering itself into several currents

Disturbed by the afflictions of the past.

Breaks its head on the rocky shore

And pulls me by my legs

Enveloping with its pale frothy blood.

My heart bleeds once more

Like a fish thrown ashore biting the hook.

The Sea reverberates from its bed

My lone helpless scream of agonizing past.

Like a conch devoid of its snail

I resound the bewailing sea

.

Aranya Krishna

Telugu

Indian

Aranya Krishna Photo Courtesy: BOOKS ADDA
Aranya Krishna
Photo Courtesy:
BOOKS ADDA

గాయపడ్డ సముద్రం

సముద్రం

నేను సిగ్గుపడి దాచుకున్న కన్నీరు

తీరం ప్రశాంతతమీద

వెనక్కివాలి కూర్చున్న నా చేతులకి

ఎప్పుడో ఇంకిపోయిన

కళ్ళ తడి తగులుతుంది

మసక తెరల వెనుక సముద్రం

ఉద్విగ్న విషాదగతమై

ఆత్రంగా బండరాళ్ళకేసి తలను బాదుకుంటూ

అలలు అలలుగా చీరుకుపోయి

తెల్లనెత్తుటి నురగలతో నన్నుతాకి

కాళ్ళుపట్టి లాగుతుంది

ఎర తగిలి ఒడ్డున ఎగిరిపడ్డ చేప నోటిలా

హృదయం రక్తసిక్తమౌతుంది మళ్ళీ

ఒకానొక సుదీర్ఘ కల్లోల గతాన

నా ఏకాకితనపు కేకను

సముద్రం నాభినుండి హోరు పెడుతుంది

నిర్జీవమైన నత్త జారిపోయిన శంఖాన్నై

భోరున సముద్రాన్ని ప్రతిధ్వనిస్తాను.

.

అరణ్యకృష్ణ

%d bloggers like this: