Mohanatulasi is a System Analyst with SAP and lives in Chicago, USA. Apart from reading/ writing poetry, she loves photography and painting. She is running a column “మోహన రాగం ” in a web magazine and is an active blogger with her blog Vennela Vaana: (http://vennela-vaana.blogspot.com) since January 2008. Her Collection of Poetry is on the anvil.
రాత్రి వాక్యాలకు కొనసాగింపు
.
రాత్రి వాక్యాలకు కొనసాగింపు మరో రాత్రి రెక్కల్లోనో వెన్నెలనీడల్లోనో,విరజాజి పూల తీగల్లోనో ప్రియురాలి సోగ కళ్ళల్లోనో వెతకాలి వెలుగురేఖలు అంటకమునుపే!
రాత్రి వాక్యాలకు కొనసాగింపు మసక మబ్బుల్లోనో, గుబులు గాధల్లోనో ఆకాశం హద్దనిపించని ఘడియల్లోనో, వెనక్కి తిరగమనే పాదం అంచుల్లోనో వెతకాలి పొగమంచు కరగకముందే!
రాత్రి వాక్యాలకు కొనసాగింపు చేతివేలి చివర తీసుకున్న వీడ్కోలులోనో, చెవి అంచుల్లో తారాడే స్పర్శలోనో, కడలి హోరులోనో…కలల జాబితాలోనో వెతకాలి ఈరేయి జ్ఞాపకమవ్వక మునుపే!