అనువాదలహరి

బడిపిల్లడు… విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి

ఎండాకాలంలో ఉదయాన్నే లేవడం నాకిష్టం
ఎందుకంటే ప్రతి చెట్టుమీంచీ పిట్టలు పాడుతుంటాయి;
దూరంగా వేటగాడు తన బూరా ఊదుతుంటే,
ఇక్కడ స్కైలార్క్ నాతో శృతి కలుపుతుంది
అబ్బ ఎంత బాగుంటుందో వాటితో సావాసం.

కానీ, ఉదయాన్నే బడికెళ్ళమంటేనే
అబ్బ, ఉన్న ఉత్సాహమంతా నీరుగారిపోతుంది.
పిల్లలందరూ రోజంతటినీ
తీక్షణమైన ముసలి చూపుల పరివేక్షణలో
ఉస్సురని నిట్టూరుస్తూ, విసుగ్గా గడపాలి.

ఒక్కోసారి నేను నిస్సత్తువతో వాలి కూచుంటాను
బడి ఎప్పుడు పూర్తవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తాను
పుస్తకాలు చదవడంలోనూ ఆనందం దొరకదు
అలాగని పాథం వింటూనూగడపలేను
అర్థం అయిందోలేదో చూడకుండా చెప్పిందే చెపుతారు.

ప్రకృతిలో ఆనందంతో పరవశించి పాడే పక్షి
పంజరంలో కూచుని ఎలా మధురంగా పాడగలదు?
అలాగే బడిపిల్లాడు, భయాలు చికాకు తెప్పిస్తుంటే
తన లేత రెక్కలు ముడుచుకు కూచుని
తనలో ప్రవహించే బాల్యోత్సాహాన్ని ఎలా మరువగలడు?

తల్లుల్లారా! తండ్రుల్లారా!
చిగురువేస్తున్నపుడే లేతమొక్కలకు ఆకులు రెలిచి
మొగ్గలు త్రుంచి, పూలు ఎగిరిపోనిచ్చి
బాధలూ కష్టాలతో మోడు చేసి
వాటి ఆనందాన్ని హరిస్తుంటే

వేసవి ఎలా ఆనందంగా అడుగిడగలదు?
దాహంతీర్చే పళ్ళు ఎక్కడనించి లభిస్తాయి?
కష్టాలు నశింపజేసినవాటిని ఏరుకునేదెట్లా?
రాబోయే హేమంతపు తాకిడినుండి
కరిగిపోయే కాలాన్ని రక్షించేమార్గం ఏది?
.
విలియం బ్లేక్

(28 November 1757 – 12 August 1827) 

ఇంగ్లీషు కవి

william_blake_by_thomas_phillips
       William_Blake_                      Thomas_Phillips

The School Boy

.

I love to rise in a summer morn,

When the birds sing on every tree;

The distant huntsman winds his horn,

And the skylark sings with me:

O what sweet company!

 

But to go to school in a summer morn, –

O it drives all joy away!

Under a cruel eye outworn,

The little ones spend the day

In sighing and dismay.

 

Ah then at times I drooping sit,

And spend many an anxious hour;

Nor in my book can I take delight,

Nor sit in learning’s bower,

Worn through with the dreary shower.

 

How can the bird that is born for joy

Sit in a cage and sing?

How can a child, when fears annoy,

But droop his tender wing,

And forget his youthful spring!

 

O father and mother if buds are nipped,

And blossoms blown away;

And if the tender plants are stripped

Of their joy in the springing day,

By sorrow and care’s dismay, –

 

How shall the summer arise in joy,

Or the summer fruits appear?

Or how shall we gather what griefs destroy,

Or bless the mellowing year,

When the blasts of winter appear?

.

William Blake

(28 November 1757 – 12 August 1827)

English Poet

 

Poem Courtesy: http://www.poetryloverspage.com/poets/blake/schoolboy.html

%d bloggers like this: