అనువాదలహరి

శకటాల సంగీతం… తూ ఫూ, చీనీ కవి

శకటాలు ముందుకి కదులుతూ కిర్రు మంటున్నాయి
గుర్రాలు మంద్రంగా శకిలిస్తూ మురుస్తున్నాయి
నిర్బంధ సైనికుల నడుములకి ధనుర్బాణాలు వేలాడుతున్నాయి.
వాళ్ళ తలిదండ్రులూ, భార్యాపిల్లలూ వీడ్కోలివ్వడానికి పరిగెడుతున్నారు,
ఎంత దుమ్ము రేగుతోందంటే, గ్జ్యాన్యాంగ్ వంతెన కనిపించడం లేదు.
వాళ్ళు బట్టలు చించుకుని, కాళ్లు నేలకు బాదుతూ, ఏడుస్తూ త్రోవకి అడ్డుపడుతున్నారు
వాళ్ళ రోదనలు మింటికెగసి మబ్బుల్ని తాకుతున్నాయి.
దారినపోయే దానయ్య ఒకడు సైనికుణ్ణడిగాడు “ఎందుకేడుస్తున్నా”రని
సైనికుడు అన్నాడు: ఈ నిర్బంధపు సైనిక సేవ తరచు జరుగేదే.
పదిహేనేళ్ళకు చాలా మందిని ఉత్తరానికి నదిని రక్షించడానికి పంపుతారు.
పడమరనయితే, నల్లభై ఏళ్ళొచ్చినా దుక్కి దున్నాల్సిందే
మేము వెళ్ళినపుడు మా పెద్దలు తలకట్టు కట్టి పంపుతారు.
తిరిగొచ్చినపుడు మా తలకట్లు తెల్లగా ఉంటే మళ్ళీ యుద్ధభూమికి పంపుతారు.
సరిహద్దులదగ్గర కారిన రక్తమైతే చెప్పక్కరలేదు… సముద్రమే
ఈ యుద్ధోన్మాది చక్రవర్తికి సామ్రాజ్య విస్తరణ కలలకి అంతులేదు.
ఈ కొండలకి తూర్పున రెండువందల పరగణాలలో చూడలేదూ
ప్రతి పల్లెలో, శివారులో గచ్చతీగ, ముళ్ళకంపలూ మొలవడం?
నాగలిపట్టి, పాఱవెయ్యగల సత్తా ఉన్న ఆడవాళ్ళు ఉన్నా
అక్కడక్కడ పంట పండించినా, వ్యవసాయంలో ఒక పద్ధతి లేదు.
అంతకుమించి, భయంకరమైన యుద్ధాలు చేసే మాలాంటి సైనికులని
కుక్కలూ కోళ్ళ కంటే హీనంగా చూసి నాలుగుపక్కలా తరిమెస్తుంటారు.
పెద్దవాళ్ళంటే అడగగలరు గాని,
సైనికుడు కాదని ఎలా ఎదురుచెప్పగలడు?
ఈ చలికాలంలో కూడా
ఈ కనుమకి పడమర సైనికులు కవాతు చేస్తూనే ఉంటారు.
న్యాయాధికారికి ఎప్పుడూ పన్నులమీదే గురి.
కాని, మేము ఎక్కడనుండి తెచ్చి చెల్లించగలం?
ఈ రోజుల్లో మగపిల్లల్ని కనడమే పొరపాటు,
ఆడపిల్లల్ని కనడమే ఉత్తమం;
కనీసం, పిల్లల్ని పక్క ఊర్లో ఇచ్చుకోవచ్చు.
మాగపిల్లల్ని గడ్డిలో సమాధి చేసుకోవడమే.
క్వింఘాయ్ సరిహద్దులో మీరు చూడలేదా, ఏనాటివో
ఎవరివో తెలియని పోగులకొద్దీ ఎముకలు బయటపడ్డాయట?
పాత ప్రేతాలు ఏదుస్తుంటే, కొత్తవి అన్యాయమని అరుస్తున్నాయి.
ఈ అరుస్తున్న గొంతుల నోరు మూయించడానికి చీకట్లో వర్షం కురుస్తోంది.”
.
దు ఫూ (తూ ఫూ)
8వ శతాబ్దం
చీనీ కవి

Tu Fu

.

Song of the Wagons

.

The wagons rumble and roll,
The horses whinny and neigh,
The conscripts each have bows and arrows at their waists.
Their parents, wives and children run to see them off,
So much dust’s stirred up, it hides the Xianyang bridge.
They pull clothes, stamp their feet and, weeping, bar the way,
The weeping voices rise straight up and strike the clouds.
A passer-by at the roadside asks a conscript why,
The conscript answers only that drafting happens often.
“At fifteen, many were sent north to guard the river,
Even at forty, they had to till fields in the west.
When we went away, the elders bound our heads,
Returning with heads white, we’re sent back off to the frontier.
At the border posts, shed blood becomes a sea,
The martial emperor’s dream of expansion has no end.
Have you not seen the two hundred districts east of the mountains,
Where thorns and brambles grow in countless villages and hamlets?
Although there are strong women to grasp the hoe and the plough,
They grow some crops, but there’s no order in the fields.
What’s more, we soldiers of Qin withstand the bitterest fighting,
We’re always driven onwards just like dogs and chickens.
Although an elder can ask me this,
How can a soldier dare to complain?
Even in this winter time,
Soldiers from west of the pass keep moving.
The magistrate is eager for taxes,
But how can we afford to pay?
We know now having boys is bad,
While having girls is for the best;
Our girls can still be married to the neighbours,
Our sons are merely buried amid the grass.
Have you not seen on the border of Qinghai,
The ancient bleached bones no man’s gathered in?
The new ghosts are angered by injustice, the old ghosts weep,
Moistening rain falls from dark heaven on the voices’ screeching.”

.

Du Fu

Chinese Poet

Du Fu (also known as Tu Fu) wrote in the High Tang period. His work is very diverse, but his most characteristic poems are autobiographical and historical, recording the effects of war on his own life.

Poem Courtesy:

http://www.chinese-poems.com/d16.html

This poem dates from around 750 or 751 CE. The Xianyang bridge was southwest or north of Chang’an; in either case, the conscripts are being sent to fight on the western border. The soldiers guarding the river were guarding the Yellow River; those tilling fields in the west worked at garrisons with their own farms, to make them self-sufficient. The martial emperor was emperor Wu of the Han dynasty, here standing in for the current emperor, Xuanzong. Qin and west of the pass both refer to the Chang’an area. Qinghai is on the border with Tibet.

%d bloggers like this: