ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు
రొదచేస్తున్న ఓ వడి గాలీ! నువ్వు కూడా హుష్!
ధారాపాతంగా కురుస్తున్న వర్షమా! నువ్వూ హుష్!
రేపు పొద్దుపొడిచేదాకా బిడ్డని నిద్రపోనీండి.
మీరందరూ నెమ్మది! ఇకనుండి జీవితమంతా
అతను మూటగట్టుకునేది దుఃఖమే;
నవ్వులుండాల్సిన చోట కన్నీరుంటుంది
కనీసం నిద్రలోనైనా అతనికి శాంతి నివ్వండి.
హుష్ అంటుంటే?! జబ్బుతో బలహీనంగా ఉన్నాడు
అతని ఏడుపులో కొంతపాలు వాళ్ళమ్మతో పోనీండి.
అదిగో వడిగాలీ, హుష్! నీ రొద కొంచెం ఆపు!
ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు.