అనువాదలహరి

చెట్లు (606) … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

చెట్లు ఒకటొకటి ఒరుసుకు ఊగుతున్నాయి
జడకుచ్చుల్లా; సూర్యుడిని అనుసరిస్తూ
లేస్తున్న అల్ప ప్రాణుల్లో
సంగీతం నిదురలేస్తున్నట్టుంది.

వీనుల విందు చేస్తున్న
సుదూర ప్రభాతస్తుతి గీతాలు
దూరాన ఉండబట్టే, మధురంగా ఉన్నా
మనసుతీరా వినిపించడం లేదు.

సూర్యుడు దోబూచులాడుతున్నాడు, ముందు పూర్తిగా
తర్వాత సగం, పిమ్మట అసలు కనిపించకుండా
తనకి ఇష్టమైనప్పుడే కనిపించాలనుకుంటున్నట్టు;
అతని దగ్గర ఎంత వనసంపద ఉందంటే

అది అతన్ని పూర్తిగా మూసెయ్యగలదు.
శాశ్వతంగా కనిపించనీకుండా
కాకపోతే అలా ఫలవృక్షాలను ఎదగనీడం
అతనికి ఒక సరదా క్రీడ.

ఒక పిట్ట దడిమీద నిర్లక్ష్యంగా కూచుంది
ఒకటి కొమ్మల బాటల్లో కబుర్లాడుతోంది
అప్పుడే ఒక రాతిని చుట్టివస్తున్న పాము
వెండిలా మెరుస్తున్న చెట్లను చూసి విస్తుపోయింది

రక్షకపత్రాలు ఛేదించుకుని కొమ్మలమీద
పూలు విరగబూచి నిగనిగ మెరుస్తున్నాయి 
డీలాపడ్ద జండాలు గాలికి రెపరెపలాడినట్టు
కొంగుకిరాసిన అత్తరులా, సువాసన గుప్పుమంది. 

ఇంకా చాలా ఉంది— నా శక్యం కాదు వర్ణించడం
చూసేవాళ్లకి అది ఎంట హీనంగా కనిపిస్తుందంటే
అసలైన వేసవి ప్రకృతిదృశ్యం ముందు
వాన్ డైక్* వేసిన చిత్రం దిగదుడుపైనట్టు.
.
ఎమిలీ డికిన్సన్

December 10, 1830 – May 15, 1886

అమెరికను కవయిత్రి

[Note: Anthony Van Dyck (22 March 1599 – 9 December 1641) was a famous Flemish Baroque artist  who became a leading court painter in England. He was more noted for the paintings of King Charles I. He was also an innovator in water colors and etching.]

.

 Trees (606)

The Trees like Tassels—hit—and swung

There seemed to rise a Tune

From Miniature Creatures

Accompanying the Sun

Far Psalteries of Summer

Enamoring the Ear

They never yet did satisfy

Remotest—when most fair

The Sun shone whole at intervals

Then Half—then utter hid

As if Himself were optional

And had Estates of Cloud

Sufficient to enfold Him

Eternally from view

Except it were a whim of His

To let the Orchards grow

A Bird sat careless on the fence

One gossipped in the Lane

On silver matters charmed a Snake

Just winding round a Stone

Bright Flowers slit a Calyx

And soared upon a Stem

Like Hindered Flags—Sweet hoisted

With Spices—in the Hem

‘Twas more—I cannot mention

How mean—to those that see

Vandyke’s Delineation

Of Nature’s—Summer Day!

.

Emily Dickinson

December 10, 1830 – May 15, 1886

American Poet

%d bloggers like this: