అనువాదలహరి

పరిశీలన… స్విన్ బర్న్, ఇంగ్లీషు కవి

I

పాపాయి పాదాలు, గవ్వల్లా గులాబివన్నెలో ఉన్నాయి,
మనకి మోహము కలిగి, దైవముచితమని అనుగ్రహిస్తే,
ఒక దేవత పెదాలు ముద్దాడాలనుకున్నపుడు
మనకు ముందుగా కనిపించేవి పాపాయి పాదాలే.

సూర్యుడివైపు తిరిగే గులాబిరంగు వనధిపుష్పాల్లా
అవి ఆకాశంవైపు ప్రతి లిప్తా సాగుతూ, లేస్తాయి
ఆ పది కోమలమైన మొగ్గలూ కలుస్తూ వేరవుతుంటాయి.

విరిసి ముకుళించే ఏ కుసుమ కోరకమూ
అందులో సగపాటి నెత్తావినైనా విరజిమ్మలేదు
పాపాయి పాదాల్లా
జీవితపు కొత్తదారులలో వెలుగు వెదజల్లలేవు.

II

పాపాయి చేతులు, ముడుచుకున్న మొగ్గలు
పక్కన ఏ చిగురూ కనిపించకపోయినా;
ముట్టుకుంటే చాలు తెరుచుకుంటాయి ముంగురుల్లా
మళ్ళీ చుట్టుకునే పాపాయి చేతులు.

రణభేరీ వినిపించగానే యోధుల చేతులు
కత్తులు బిగించి పట్టుకున్నట్టు
అవి ముడుచుకుని, పటకాల్లా పట్టుబిగిస్తాయి.

వాటికి, అత్యంత సుందరమైన ప్రదేశాలలో వేకువ
ముత్యాలదండలేసిన గులాబిమొగ్గలు సైతం దీటు రావు;
సృష్టిలో ఎంతటి మనోహరమైన కుసుమమైనా
పాపాయి చేతులముందు దిగదుడుపే.

III

పాపాయి కన్నులు భాషిస్తాయి, పలుకు రాకముందే,
పెదాలు మాటలూ, నిట్టూర్పులూ నేర్వకముందునుండే,
వాటి దృష్టిని ఆకట్టుకోగల అన్ని వస్తువులనీ
అనుగ్రహిస్తాయి పాపాయి కన్నులు.

పాపాయి నవ్వుతూ పడుకుంటే,
నిద్ర వస్తూ పోతూ దోబూచులాడుతుంటే,
ప్రేమకి అందులో స్వర్గమే సాక్షాత్కరిస్తుంది.

వాళ్ళ ఒక్క చూపు చాలు పాపాలూ, కష్టాలూ పటాపంచలు;
వాళ్ళ మాటలు మేధావుల్ని సైతం నోరుమూయిస్తాయి.
పాపాయి కన్నుల్లో కనువిందు చేసే
దైవం తారాడుతున్నట్టు అనిపిస్తుంది.
.

స్విన్ బర్న్

5 April 1837 – 10 April 1909

ఇంగ్లీషు కవి

Image Courtesy: http://upload.wikimedia.org Sketch of Swinburne at age 23 by Dante Gabriel Rossetti
Image Courtesy: http://upload.wikimedia.org Sketch of Swinburne at age 23 by Dante Gabriel Rossetti

.

Étude Réaliste

(Realistic Study)

 .

I

A baby’s feet, like sea-shells pink,

      Might tempt, should heaven see meet,

An angel’s lips to kiss, we think,

      A baby’s feet.

Like rose-hued sea-flowers toward the heat

      They stretch and spread and wink

Their ten soft buds that part and meet.

No flower-bells that expand and shrink

      Gleam half so heavenly sweet

As shine on life’s untrodden brink

      A Baby’s feet.

II

A baby’s hands, like rosebuds furled

      Whence yet no leaf expands,

Ope if you touch, though close upcurled,

      A baby’s hands.

Then, fast as warriors grip their brands

      When battle’s bolt is hurled,

They close, clenched hard like tightening bands.

No rosebuds yet by dawn impearled

      Match, even in loveliest lands,

The sweetest flowers in the entire world—

      A baby’s hands.

III

A baby’s eyes, ere speech begin,

      Ere lips learn words or sighs,

Bless all things bright enough to win

      A baby’s eyes.

Love, while the sweet thing laughs and lies,

      And sleep flows out and in,

Sees perfect in them Paradise.

Their glance might cast out pain and sin,

      Their speech make dumb the wise,

By mute glad godhead felt within

      A baby’s eyes.

.

(Note: This is only a part of the poem)

.

Algernon Charles Swinburne

5 April 1837 – 10 April 1909

English Poet, Playwright, Novelist and Critic

Poem Courtesy:

http://www.bartleby.com/246/773.html

A Victorian Anthology, 1837–1895.

Ed: Edmund Clarence Stedman, (1833–1908).

 

%d bloggers like this: