అనువాదలహరి

సానెట్ 4… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం

ఈ సానెట్లు వివాహానికి విముఖంగా ఉన్న ఒక యువకుడిని ఉద్దేశించి వ్రాసినట్టు పండితుల అభిప్రాయం.

 

 

ఔదార్యములేని సొగసుకాడా! నీ సౌందర్యపు
వారసత్వాన్ని నీ మీదే ఎందుకు ఖర్చు చేసుకుంటావు?
ప్రకృతి ఇవ్వడానికితప్ప దాచుకునే ఉపాయనాలు ఈయదు,
అది నిష్కపటి; అందుకే అన్నీ ఉచితంగానే ఇస్తుంది.
అలాటపుడు, ఓ సౌందర్యలోభీ, ప్రకృతి ఉదారతతో
ప్రసాదించిన బహుమానాన్ని ఎందుకు నిష్ఫలం చేస్తావు?
ఓ వ్యర్థ కుసీదకా, సంపదలలోకెల్ల స్రేష్ఠమైన
సంపదని ఉపయోగించుకుని బ్రతకలేకపోతున్నావు?
నీతో నువ్వే వ్యవహరం జరుపుకుంటూ
నిన్ను నువ్వెందుకు ఆత్మవంచన చేసుకుంటావు?
రేపు ప్రకృతి నీకు చరమగీతి పాడినపుడు,
చేసిన ఖర్చుకి ఏ సంతృప్తికరమైన ఋజువు మిగులుస్తావు?
నీతోపాటే నీ సౌందర్యశేషమూ సమాధిపాలు అవుతుంది
అదే మిగిల్చి ఉంటే, నీ స్మృతిని కొనసాగించి ఉండేది.
.
(వివరణ: కుసీదకుడు: వడ్డీ వ్యాపారి )

 షేక్స్పియర్

 William ShakespeareShakespeare

.

Sonnet IV

.

Unthrifty loveliness, why dost thou spend
Upon thy self thy beauty’s legacy?
Nature’s bequest gives nothing, but doth lend,
And being frank she lends to those are free:
Then, beauteous niggard, why dost thou abuse
The bounteous largess given thee to give?
Profitless usurer, why dost thou use
So great a sum of sums, yet canst not live?
For having traffic with thy self alone,
Thou of thy self thy sweet self dost deceive:
Then how when nature calls thee to be gone,
What acceptable audit canst thou leave?
   Thy unused beauty must be tombed with thee,
   Which, used, lives th’ executor to be.

.

Shakespeare

%d bloggers like this: