అనువాదలహరి

బానిస… జేమ్స్ ఓపెన్ హీమ్ , అమెరికను కవి

వాళ్ళు బానిసని స్వేచ్ఛగా వదిలేసేరు, సంకెళ్లు త్రెంచి

కానీ అతను పూర్వం ఎంత బానిసో,

ఇప్పుడూ అంతే.

ఇప్పటికీ అతనికి సంకెళ్లు ఉన్నాయి

ఇప్పటికీ అతను అశ్రద్ధకీ, సోమరితనానికీ బానిసే

ఇప్పటికీ ఇంకా అతనికి భయాలూ, మూఢనమ్మకాలూ,

అజ్ఞానమూ, అనుమానమూ, అనాగరికతలనుండి బయటపడలేదు

అతని బానిసత్వం అతని సంకెళ్లలో లేదు

అతనిలోనే ఉంది

వాళ్ళు స్వతంత్రుడిని మాత్రమే సంకెలలనుండి విముక్తుణ్ణి చెయ్యగలరు

కానీ నిజానికి ఆ అవసరం లేదు…

స్వతంత్రుడు ఎప్పుడూ తనని తాను విముక్తుణ్ణి చేసుకుంటాడు.

.

జేమ్స్ ఓపెన్ హీమ్

24th May 1882–  4th Aug 1932

అమెరికను కవి

James Oppenheim
                

 James Oppenheim

.

The Slave

 .

They set the slave free, striking off his chains….    

Then he was as much of a slave as ever.       

He was still chained to servility,

He was still manacled to indolence and sloth,         

He was still bound by fear and superstition, 

By ignorance, suspicion, and savagery …    

His slavery was not in the chains,       

But in himself …  

They can only set free men free …     

And there is no need of that:     

Free men set themselves free.

.

James Oppenheim

24th May 1882–  4th Aug 1932

American Poet, Novelist and Editor

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936)

http://www.bartleby.com/265/268.html. 

.

ఏ శపధాలూ చెయ్యొద్దు… గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి

నేనోసారి శపథం చేశాను, ఒక్కటంటే ఒక్కటి.
అప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను, ఒంటరిగా.
నాకు బాగా ధైర్యం వచ్చినపుడు ఇలా అనుకున్నాను:
“ఈ నియమాలు నాకు చాలా సంకుచితంగా కనిపిస్తున్నాయి.  
అరిగిపోయిన ఆ పాత నియమాలకి నేనెందుకు కట్టుబడి ఉండాలి?
ఈ రోజు నుంచీ బట్టలు మార్చినట్టు అన్ని నియమాలూ మార్చెస్తాను!”

కానీ ఆ పాత అరిగిపోయిన నియమమే
నాకు ఇప్పుడు సంకెలలా తగులుకుంది.
అదిప్పుడు ఉల్లంఘించడం చాలా చాలా కష్టం;
నానుండి దాన్ని వదుల్చుకోడం మహా మహాకష్టం.

ఉదయం దాన్ని ఉల్లంఘిస్తానా, రాత్రి నన్ను పట్టుకుంటుంది,
ఉదయం పూటమాత్రమే స్వేచ్ఛగా ఉండేవాడు, స్వేచ్చాజీవి కాడు,
కలల్లో సంకెలలు భరించేవాడు స్వేచ్చాజీవి కానేరడు
కలల్లో కనిపించే తేట ఊట సెలయేళ్లకు ఆనందించేవాడిలా.

బతకడానికి చాలా విలువైన శక్తి కావాలి.
కనుక నీ శక్తినంతా ఎక్కడ వెచ్చించాలో జాగ్రత్తగా గమనించు.
నిరంకుశంగా, ఆనందంగా ఇపుడుండవలసిన నేను, నా శక్తినంతా
నాకు భారంగా మారిన శపథాన్ని ఉల్లంఘించడానికి వినియోగించాలి
.
గ్రేస్ ఫాలో నార్టన్

29th October 1876  – 1956

అమెరికను కవయిత్రి

.

Make No Vows

.

I made a vow once, one only.   

I was young and I was lonely.  

When I grew strong I said: “This vow

Is too narrow for me now.        

Who am I to be bound by old oaths?  

I will change them as I change my clothes!” 

But that ancient outworn vow   

Was like fetters upon me now.  

It was hard to break, hard to break;    

Hard to shake from me, hard to shake.         

I broke it by day, but it closed upon me at night.    

He is not free who is free only in the sun-light.      

He is not free who bears fetters in his dreams,        

Nor he who laughs only by dark dream-fed streams.        

Oh, it costs much bright coin of strength to live!    

Watch, then, where all your strength you give!      

For I, who would be so wild and wondrous now,  

Must give, give, to break a burdening bitter vow.

.

Grace Fallow Norton

(29th October 1876  – 1956)

American Poetess

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/266.html

The Grieving Sea… Aranya Krishna, Telugu, Indian

The salty sea is but my embarrassing tears

I harbored from public view;

When I lean back

On the pacific shore

The long dried up moisture

Of the eyes touches my hands

Behind the bleary screens…. the Sea,

Sundering itself into several currents

Disturbed by the afflictions of the past.

Breaks its head on the rocky shore

And pulls me by my legs

Enveloping with its pale frothy blood.

My heart bleeds once more

Like a fish thrown ashore biting the hook.

The Sea reverberates from its bed

My lone helpless scream of agonizing past.

Like a conch devoid of its snail

I resound the bewailing sea

.

Aranya Krishna

Telugu

Indian

Aranya Krishna Photo Courtesy: BOOKS ADDA
Aranya Krishna
Photo Courtesy:
BOOKS ADDA

గాయపడ్డ సముద్రం

సముద్రం

నేను సిగ్గుపడి దాచుకున్న కన్నీరు

తీరం ప్రశాంతతమీద

వెనక్కివాలి కూర్చున్న నా చేతులకి

ఎప్పుడో ఇంకిపోయిన

కళ్ళ తడి తగులుతుంది

మసక తెరల వెనుక సముద్రం

ఉద్విగ్న విషాదగతమై

ఆత్రంగా బండరాళ్ళకేసి తలను బాదుకుంటూ

అలలు అలలుగా చీరుకుపోయి

తెల్లనెత్తుటి నురగలతో నన్నుతాకి

కాళ్ళుపట్టి లాగుతుంది

ఎర తగిలి ఒడ్డున ఎగిరిపడ్డ చేప నోటిలా

హృదయం రక్తసిక్తమౌతుంది మళ్ళీ

ఒకానొక సుదీర్ఘ కల్లోల గతాన

నా ఏకాకితనపు కేకను

సముద్రం నాభినుండి హోరు పెడుతుంది

నిర్జీవమైన నత్త జారిపోయిన శంఖాన్నై

భోరున సముద్రాన్ని ప్రతిధ్వనిస్తాను.

.

అరణ్యకృష్ణ

సానెట్… 104… షేక్స్పియర్

ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరము

ప్రియ మిత్రమా, నాకు నువ్వెన్నాళ్ళయినా పాతబడవు

నిన్ను మొదటిసారి చూసినపుడెలా ఉన్నావో అలాగే ఉన్నావు

నీ అందం అలాగే ఉంది. అప్పుడే మూడు హేమంతాలు గడిచాయి

అడవి గర్వించే వనసంపదని మూడు వేసవులై హరిస్తూ,

అందమైన మూడు వసంతాలు మూడు పలిత శిశిరాలయేయి,

ఈ నిరంతర ఋతుచక్రభ్రమణంలో నేను గమనించినది:

మూడు వసంతాల సుగంధాలు మూడు మండు వేసవులలో నిందుకోవడం.

నేను మొదటిసారి చూసిన దనం ఇంకా అలానే ఉంది.

ప్చ్! అయినా వాచీలోని సెకన్ల ముల్లు అందాన్ని

శరీరంనుండి చాపకిందనీరులా సంగ్రహిస్తుంది

అందువల్ల, నీలో నేను ఇంకా మిగిలుండనుకుంటున్న అందం

కరిగిపోతోందేమో, నా కళ్ళు భ్రమిస్తున్నాయేమో!

అందుకనే, ముదిమి నీకు చెప్పకముందె ఇది విను

నీ పుట్టువన్నెలరుచులు క్షీణించక ముందె విను.

.

షేక్స్పియర్

ఇంగ్లీషు కవి

William Shakespeare

Sonnet CIV

.

To me, fair friend, you never can be old,
For as you were when first your eye I ey’d,
Such seems your beauty still. Three winters cold,
Have from the forests shook three summers’ pride,
Three beauteous springs to yellow autumn turned,
In process of the seasons have I seen,
Three April perfumes in three hot Junes burned,
Since first I saw you fresh, which yet are green.
Ah! yet doth beauty like a dial-hand,
Steal from his figure, and no pace perceived;
So your sweet hue, which methinks still doth stand,
Hath motion, and mine eye may be deceived:
For fear of which, hear this thou age unbred:
Ere you were born was beauty’s summer dead.

.

William Shakespeare

English Poet and Dramatist

Poem Courtesy:
http://www.shakespeares-sonnets.com/sonnet/104

జీవితంలో వింత… హేరియట్ మన్రో, అమెరికను కవయిత్రి

ఎంత విశృంఖలంగా, మాంత్రికురాల్లా ఎంత వింతగా ఉంటుందీ జీవితం!

చివరకి ఏ స్పందనలూ ఎరుగని రాయి కూడా కలగంటుంది,

ఎప్పటినుండో పగిలడం ప్రారంభించి …

ఒహోహో… ఎదగడం ప్రారంభిస్తుంది…

ఆకుపచ్చని ఉడుపులు ధరించి.
ఎంత స్పష్టమైన, వింతైన పదార్థం! ఇదేనా జీవితమంటే!

ఓహ్, అది పిచ్చెంకించే మార్మికత. ఆనంద హేల,

ధూళికణం ఎగిరి, ప్రాణంతో ఎగసి, అడుగులేసి పరిగెత్తుతుంది…

రెక్కవిప్పి ఎగురుతుంది, అరుపులతో అంతరాంతరాలు కదిలిస్తుంది…

ఓహ్… ఎక్కడెక్కడి లోతులు…

ఏమిటీ అందమైన ఆహార్యం? వింత ముసుగు? అదేనా జీవితమంటే!

.

హేరియట్ మన్రో

December 23, 1860 – September 26, 1936

అమెరికను కవయిత్రి

.

Harriet Monroe

.

The Wonder of It

How wild, how witch-like weird that life should be!

That the insensate rock dared dream of me,

And take to bursting out and burgeoning—

      Oh, long ago—yo ho!—

And wearing green! How stark and strange a thing

That life should be!

Oh, mystic mad, a rigadoon of glee,

That dust should rise, and leap alive, and flee

A-foot, a-wing, and shake the deeps with cries—

      Oh, far away—yo-hay!

What moony masque, what arrogant disguise

That life should be!

.

Harriet Monroe

(December 23, 1860 – September 26, 1936)

American Poetess and Editor

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/252.html

 

Let it Rain!… Indra Prasad, Telugu, Indian

Let it rain!

Like threads of gossamer

Let it rain for years!

Let the trees spring shoots

Let flowers blossom

Let the Hares hide in the shrubbery

At the grating of pebbles.

Let it rain!

And let all secrets open up

Let the soil hardened over decades

Break and melt steadily.

And moss these roads and structures,

Why, the civilization itself.

Let all violence, destruction, pleasure and pain

Melt, and melt away.

Let it rain!

Like the whiff of love

Like the carnival of Spring

Let the scintillating sun spread out

And birds celebrate with their chirping

Let cells divide and multiply

Let man laugh heartily once more

Let life punctuated with Grief and Gloom

And, Pleasure and Peace be swept away.  

Let all souls become trees

And all trees become birds

And all birds become flowers

And children at play!

.

Indraganti Prasad

Telugu

Indian

Indraganti Prasad (Indra Prasad ) born 1961 has been writing poetry for over 3 decades. In 1993 he published his selection of poems ‘నడిచివచ్చిన దారి’. He is working on his second book. He is a Banker  by profession living in Doha, Qatar. He is running his blog passingthroughtimes.wordpress.com for the last 6 months. 

 వాన కురవనీ

వాన కురవనీ
వందేళ్లు సన్నగా దారంలా
వాన కురవనీ
చిగురించనీ చెట్లు
వికసించనీ పువ్వులు
గులకరాళ్ల చప్పుళ్లలో
పొదల్లో దాక్కోనీ కుందేళ్లు

వాన కురవనీ
రహస్యాలన్నీ బహిరంగమవనీ
తరతరాలుగా పెరుకొన్న
మట్టి కరగనీ
ఈ రోడ్లూ భవనాలూ
నాగరికతంతా నాచు పట్టనీ

హింసా ధ్వంసం దుఃఖం సుఖం
కరిగిపోనీ
కురవనీ వాన కురవనీ

ప్రణయోర్మిళంలాగ
వసంతోత్సవంలాగ
మిలమిలా మేరిసే ఎండరానీ
కిలకిలా నవ్వే పక్షులెగరనీ
కణంనించి మరో కణం
ప్రత్యుత్పత్తి కానీ
మరోసారి మనిషి నవ్వనీ
దుఃఖా దుఃఖ సుఖా సుఖ
జీవితం కొట్టుకపోనీ

ఆత్మలన్నీ చెట్లవనీ
చెట్లన్నీ పక్షులవనీ
పక్షులన్నీ పువ్వులై
ఆడుకొనే పిల్లలవనీ…..

.

ఇంద్రగంటి  ప్రసాద్ 

తెలుగు

భారతీయ కవి  

 

That girl…. Rama Sundari, Telugu, Indian’

I still remember the girl!

Once when the faint drizzle

And tender greenery made friendship

I saw her humbly walking hugging the books

Down the Jamun-trees alley;

At the Andhra University out-gate, many times

I saw her giving her hoarse voice chorus to Gaddar’s song;

She used to sit all alone near the

Martyr’s memorial at Boddapadu every year;

Later I saw her dried up meandering hand

In slogans in red-orpiment on the University walls;

She finally settled somewhere in Sultan Bazar

Brittle … Along with the recycled newspapers …

 

For long, she was not seen anywhere.

Then I saw her briefly the other day

She looked as downy as the plume of a peacock to the eye.

She was looking seriously at somebody in thick eye-glasses.

Whether it’s her ideal or action or a rifle

Something was slinging over her shoulder

Through the green canopy of woods under the sky

I saw her walking briskly

Along the cool footways … like my alter ego.

Before I could herald my words of caution

She came back with the news of the jungle,

Sat by me and started narrating their sagas.

She said that she planted seeds, and

Blew the bellows for the fire-pits.

And said, the harvesting season would begin soon.

When I tried to feel her tenderly

I found her hands bruised

And her legs crushed…

She displayed her private parts

For me to behold…

What I saw was an overwhelming abuse

Of her dignity by the plundering rich

When I was wailing my heart out

She laughed at me jeeringly and asked

“Why would you wail for yourself?”

Looking into my eyes with a smile

And tapping my throbbing heart with her finger

As if to say I was still alive,

She disappeared.

.

Rama Sundari

(In Tribute to Sruti who was encountered recently in Warrangal)

 

B. Ramaa Sundari
B. Ramaa Sundari

Battula Rama Sundari, M. Tech (Electronics and Communications) hails from Ongole, Prakasam Dt. of Andhra Pradesh. She is presently working as Senior Lecturer in Govt. Poly. Technic.  She is ton the Editorial Board of “Matruka” a monthly magazine. She is the current Vice President of Progressive Organization for Women (POW)  Andhra Pradesh.  She is widely published and one of her stories is selected for “Katha 2014 ” Edited and published by Sri Vasireddi Naveen and Sri Papineni Siva Sankar every year.  She is running a blog “మోదుగుపూలు” ( kadhalu.wordpress.com) since Oct 2013.

ఆ పిల్ల …

.

ఈ పిల్ల నాకు గుర్తుంది

అపుడెపుడో పచ్చని ఆకులు సన్నని జల్లుతో జోడు కట్టినపుడు

నేరేడు పండ్ల చెట్టు కింద నుండి పుస్తకాలు

గుండెకు హత్తుకొని తలవంచుకొని నడిచి వస్తూ ఉండేది.

ఆ పిల్ల నాకు ఏయూ అవుట్ గేటు కాడ

గద్దరు పాడుతుంటే బొంగురు గొంతుతో కోరస్ యిస్తూ కనబడేది

ఏడాదికోసారి శ్రీకాకుళం బొడ్డపాడులో

స్థూపం దగ్గర వంటరిగా కూర్చొని ఉండేది.

తరువాత యూనివర్సిటీ గోడల్లో

జేగురురంగులో వంకర టింకరగా యింకి పోయి కనిపించింది

సుల్తాన్ బజార్ గల్లీలో మారుమూల షాపులో

న్యూస్ ప్రింట్ కాగితంలో పెళుసు బారి స్థిరపడింది.

ఇటీవల చానా రోజులుగా ఆ పిల్ల కనబడలేదు.

మళ్ళీ చూశానా పిల్లని మొన్నా మధ్య

నెమలి ఈకలంత మెత్తదనంతో స్పర్శిస్తుంది చిన్నిపాపలను

మందపు అద్దాలతో తీక్షణంగా చూస్తోంది ఎవరి వైపో

ఆదర్శమో, ఆచరణో, ఆయుధమో ఏవో ఆ పిల్ల భుజం మీద వేలాడుతున్నాయి

చెట్లు కమ్ముకొన్న ఆకాశం కింద

చల్లని దారుల్లో

ఆ పిల్ల నాలో నుండి సాగిపోవడం చూశాను

వద్దు వద్దని నా గొంతు పెగలక ముందే

తిరిగి వచ్చి నా దగ్గరే కూర్చొని అడవి కబుర్లు చెప్పింది

యిత్తులు వేసి వచ్చిందంట కొలిమిని ఊదీ వచ్చిందంట

పంటలు పండే కాలం తొందరలోనే ఉందన్నది.

ప్రేమగా ఆమెను తాకబోతే

చెయ్యి పెగిలి ఉంది

కాలు కమిలి ఉంది

 

ఇదిగో చూడని

మర్మాంగాన్ని తెరిచి చూయించింది

గుత్త సంపదదారుడు కార్చిన సొంగ

పొంగి పొరులుతుంది అక్కడ

వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను చూసి

వెక్కిరింతగా నవ్వింది

నిన్ను చూసి నువ్వు ఏడ్చుకొంటావెందుకని ప్రశ్న వేసింది

వేలు బెట్టి గుండెకు ఆనించి

నా కళ్లలోకి చిరునవ్వుతో చూస్తూ

నువ్వు యింకా బతికే ఉన్నావని చెబుతూ

మాయామయి పోయిందా పిల్ల

.

రమా సుందరి 

తెలుగు

భారతీయ కవయిత్రి 

Let me speak of a Poem… Bala Sudhakar Mauli, Telugu, Indian

A Poem is nowhere else

But moves amongst us!

When conversation

Between two people

Fails­­ to flow freely

Poem suffers silently

Shuttling in the gullet;

A poem convulsing

Standing on the dais of

Conflict and mistrust

Between people of two regions,

Is a disheartening spectacle;

When the camaraderie

In the faces of people disappears

Poem, too, slips all of a sudden

And walks with heavy and pitiable gait.

A Poem is nowhere else

But moves amongst us!

When cuddle it endearingly

Taking it into your hands

It submits without demur

And snuggles like a pussy

Sneaking into your bed in winter.

And then, like it,

Leaps out suddenly

As if it had remembered something

And searches vaguely here and there

And retreats back into your bed

Or curls up at your feet.

A Poem has too sharp a wit!

It slumbers

With eyes half-open

Longing for a hand

That caresses and

Puts her to sleep.

Poem is nowhere else!

One man at dawn

Carries it off with him

In his yoke to places.

It opens its eyes

Either at a farm

Or on the bund of a field;

Another man, a potter

Places doughs of clay

On a wheel and turns it

Round and round with a stick

As if he were

Wheeling the earth.

Then like the Sun

Shooting off through

The undulation of hills

A poem gradually emerges;

Yet another man,

An imaginative visionary

Who can scoop colors from ether

And dab them to a rainbow,

In his presence

The Poem stands hands-crossed

With all humility:

For the painting steals the heart.

A Poem is nowhere else

But apprentices

Under an archer

Who, burning with

Hunger – anger – and dreams

Patiently spins counter-strategies

As assiduously … as a spider!

.

Bala Sudhakar Mauli

Telugu

Indian

 

Photo Courtesy: Balasudhakar Mauli
Photo Courtesy:
Balasudhakar Mauli

 

పద్యం గురించి కాస్తా మాట్లాడుతా

.

పద్యం ఎక్కడో లేదు

మన మధ్యే పద్యం సంచరిస్తుంది

ఇద్దరు మనుషుల మధ్య

మాటల్లేని వేళ

పద్యం

లోగొంతుకతో కొట్లాడుతుంది

రెండు ప్రాంతాల మధ్య

సందేహాల సంఘర్షణల మిద్దె మీద నిల్చొని

పద్యం

విలవిలలాడుతున్న దృశ్యం

కలవరపెడుతుంది

మనుషుల ముఖాల్లోంచి

అదృశ్యమౌతున్న కలివిడితనంలోంచి

పద్యం

వున్నట్టుండి జారి

భారంగా, ధీనంగా

నడుస్తుంది

పద్యం ఎక్కడో లేదు

మనుషుల మధ్యే వుంది

 

పద్యాన్ని

అరచేతుల్లోకి తీసుకుని

ఆప్యాయంగా నిమిరితే

అట్టే

అంటిపెట్టుకుని వుంటుంది

గారాబం పోతుంది

చలికి

పక్కలో దూరిన పిల్లిపిల్లలా

అతుక్కుపోతుంది

వెంటనే

ఏదో గుర్తొచ్చినదానిలా

చెంగున గెంతి

దేన్నో

అటూ యిటూ వెతికి

నెమ్మదిగా

మళ్లీ

దుప్పట్లోనో

కాళ్లకిందో

వచ్చి చేరుతుంది

పద్యం

బహుచమత్కారి

జోకొట్టి

లాలించే చెయ్యికోసం

ఓరకన్ను తెరచుకుని

పడిగాపులు కాస్తుంది

 

పద్యం ఎక్కడో లేదు

పద్యాన్ని

కావిడిలో వేసుకుని

వేకువనే

వొకరు వూరు బయలకు దారితీస్తారు

పద్యం

కళ్లంవద్దో  – పొలంగట్టునో

కళ్లు తెరుస్తుంది

 

మరొకరు

అరచేతులతో మట్టిముద్దలను

సారెపై వేసి

కర్రతో

భూమిని తిప్పుతున్నట్టు

సారెని తిప్పుతున్నప్పుడే

పర్వతపంక్తుల్లోంచి పొడుచుకొచ్చే

సూర్యునిలా

పద్యం

పుట్టుకొస్తుంది

 

యింకొకరుంటారు

శూన్యంలోంచి రంగులు తీసి

హరివిల్లుని చిత్రించే వూహాశీలి

అతని ఎదుట

పద్యం

వినమ్రంగా చేతులు జోడించి

నిల్చుంటుంది

చిత్రం అంతరంగమవుతుంది

 

పద్యం ఎక్కడో లేదు

ఆకలితోఆగ్రహంతోఆకాంక్షలతో

రగిలిపోతూ

నెమ్మదిగా

సాలీడు గూడు అల్లుతున్నట్టు

ప్రతివ్యూహాన్ని రచిస్తున్న

రేపటి విలుకాడి వద్దే

పద్యం

శిష్యరికం చేస్తుంది !

.

బాలసుధాకర్ మౌళి

మాతృత్వం… ఏలిస్ మేనెల్, అమెరికను కవయిత్రి

ఒకామె తన ఒకే ఒక బిడ్డకై ఏడుస్తోంది.
పోయి పదేళ్ళయింది, పురిటిలోనే.
“ఏడవకు. స్వర్గంలో ఉన్నాడులే” అన్నారందరూ. 
ఆమె అంది కదా: ” అయినా సరే!

“పదేళ్ళ క్రిందట పేగుతెంచుకున్న  
ఆ బిడ్డని ఇప్పుడు మరిచిపోలేను.
కానీ, అయ్యో! పదేళ్ళ క్రిందట నిష్ప్రయోజనంగా
ఒక అమ్మ, ఒక తల్లి జన్మించింది. ”
.
ఏలిస్ మేనెల్

అమెరికను కవయిత్రి

.

Alice Meynell

.

Maternity

 .

One wept whose only child was dead

  New-born, ten years ago.

“Weep not; he is in bliss,” they said.

  She answered, “Even so.

“Ten years ago was born in pain

  A child not now forlorn.

But oh, ten years ago, in vain

  A mother, a mother was born.”

,

Alice Christiana Gertrude Meynell  (née Thompson)

11 October 1847 – 27 November 1922

English writer, editor, critic, and suffragist.

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

 http://www.bartleby.com/265/236.html

One Has to Search… Mohana Tulasi Ramineni Telugu, Indian

On the wings of another night, or

Under the umbrages of moon or Jasmine bowers

Or, in the amative eyes of a sweetheart

The threads of last night’s sentence

Before the first rays of the day break.

In deep ebony cloud-lets, or in dolorous sagas,

In moments when sky seems the limit

Or on the bourns of hesitant step

The threads of last night’s sentence

Before the fog melts away.

In the last tingle of parting fingers,

Or in the suspending tickle on ear lobes

In the roar of the sea or catalogue of dreams

The threads of last night’s sentence

Before the night becomes a memory…

.

Mohana Tulasi  Ramineni

Telugu

Indian

Mohana Tulasi Ramineni
        Mohana Tulasi Ramineni

Mohanatulasi is a System Analyst with SAP and lives in Chicago, USA.  Apart from reading/ writing poetry, she loves photography and painting. She is running a column “మోహన రాగం ” in a web magazine  and is an active blogger  with her blog Vennela Vaana: (http://vennela-vaana.blogspot.com)  since January 2008.  Her Collection of Poetry is on the anvil.

రాత్రి వాక్యాలకు కొనసాగింపు 

.

రాత్రి వాక్యాలకు కొనసాగింపు 
మరో రాత్రి రెక్కల్లోనో
వెన్నెలనీడల్లోనో,విరజాజి పూల తీగల్లోనో
ప్రియురాలి సోగ కళ్ళల్లోనో వెతకాలి 
వెలుగురేఖలు అంటకమునుపే!

రాత్రి వాక్యాలకు కొనసాగింపు 
మసక మబ్బుల్లోనో, గుబులు గాధల్లోనో 
ఆకాశం హద్దనిపించని ఘడియల్లోనో, 
వెనక్కి తిరగమనే పాదం అంచుల్లోనో వెతకాలి 
పొగమంచు కరగకముందే!

రాత్రి వాక్యాలకు కొనసాగింపు
చేతివేలి చివర తీసుకున్న వీడ్కోలులోనో,
చెవి అంచుల్లో తారాడే స్పర్శలోనో,
కడలి హోరులోనో…కలల జాబితాలోనో వెతకాలి
ఈరేయి జ్ఞాపకమవ్వక మునుపే!

మోహన తులసి రామినేని

%d bloggers like this: