అనువాదలహరి

సుదూర భవిష్యత్తులోని కవికి… జేమ్స్ ఫ్లెకర్, ఇంగ్లీషు కవి

వెయ్యేళ్ళ క్రితమే గతించిన నేను,
నీకు ఈ ప్రాక్తన  మధుర గీతం రాస్తునా.
మాటలే నీకు వార్తాహరులుగా పంపుతునా
నేను నీతో కలిసి నడవను గనుక.

నువ్వు సముద్రాలపై వారధులే కడతావో
భీకరమైన రోదసిలో భద్రంగా ప్రయాణిస్తావో
ఉత్కృష్టమైన రమ్యహర్మ్యాలే నిర్మిస్తావో,లేక
ఇనుమూ,ఇటుకతో కట్టుకుంటావో నా కనవసరం .

ఇంకా సంగీతమూ, మద్యమూ దొరుకుతున్నాయా?
విగ్రహాలూ, ఇంతలేసి కన్నులున్న ప్రేమికలున్నారా?
మంచీ, చెడూ గురించిన పిచ్చి పిచ్చి ఆలోచనలున్నాయా?
ఊర్ధ్వలోకాల్లోని వారికై ప్రార్థనలున్నాయా?

మనం  మనసులెలా గెలవాలి? సాయంత్రవేళ
వీచే పిల్ల తెమ్మెరలా మన ఊహలు తేలియాడాలని
పాపం గుడ్డి మారాజు పూర్వం ఎప్పుడో
మూడువేల ఏళ్ళ క్రిందట చెప్పనే చెప్పాడు. 

చూడని, తెలియనేరని, ఇంకా పుట్టనే పుట్టని
ఓ మిత్రమా, తీయని మన ఆంగ్లభాషాప్రేమికుడా!
నామాటలు రాత్రిపూట ఒంటరిగా చదువుకో,
నేనో కవిని, యువకుణ్ణి.

నేను నీ ముఖం చూడలేను గనుక
నీతో చెయ్యి కలపలేను గనుక
వ్యోమ,కాలాలు సాక్షిగా నీకు నా ఆత్మీయ
శుభకామనలు. నువ్వు గ్రహిస్తావులే. 
.
జేమ్స్ ఫ్లెకర్

5 November 1884 – 3 January 1915

ఇంగ్లీషు కవి

.

James Elroy Flecker

.

To A Poet A Thousand Years Hence

I who am dead a thousand years,

 And wrote this sweet, archaic song,

 Send you my words for messengers

 The way I shall not pass along

 I care not if you bridge the seas

 Or ride secure the cruel sky,

 Or build consummate palaces

 Of metal or of masonry.

 But have you wine and music still,

 And statues and a bright-eyed love,

 And foolish thoughts of good and ill,

 And prayers to them who sit above?

 How shall we conquer? Like a wind

 That falls at eve our fancies blow,

 And old Maeonides* the blind

 Said it three thousand years ago.

 O friend unseen, unborn, unknown,

 Student of our sweet English tongue:

 Read out my words at night, alone:

 I was a poet, I was young

 Since I can never see your face,

 And never shake you by the hand,

 I send my soul through time and space

 To greet you. You will understand.

.

James Elroy Flecker

5 November 1884 – 3 January 1915

English Poet, Novelist and Playwright.

(Note: Maeonides: Homer)

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.com/2003/04/to-poet-thousand-years-hence-james.html

%d bloggers like this: