నువ్వు అందమైన దానివే, కాని అది గతం, ఒక పురాతన పియానో మీద ఆలపించిన ఒకనాటి సంగీత రూపకంలా; లేదా,18వ శతాబ్దపు అంతిపురాల్లో సూర్యకాంతులీనే పట్టువలిపానివి.
నీ కన్నుల్లో గడువు మీరి, వ్రాలుతున్న నిమేష కుసుమాలు నివురుగప్పుతున్నాయి; నీ ఆత్మ సౌరభం ఏదో తెలియని వాసనతో ముంచెత్తుతోంది చాలకాలం మూతవేసిన జాడీల్లోని ఆవకాయలా.
కానీ, నీ గొతులో పలికే స్వరభేదాలు
వాటి మేళవిప్ములు వింటుంటే నాకు మనోహరంగా ఉంది.
నా శక్తి అప్పుడే ముద్రించిన నాణెం లాంటిది దాన్ని నీ పాదాల ముందు ఉంచుతున్నాను. మాట్టిలోంచి తీసి చూడు. దాని తళతళ నీకు నవ్వు తెప్పించవచ్చు
“18వ శతాబ్దపు అంతిపురాల్లో
సూర్యకాంతులీనే పట్టువలిపానివి.” one of the best lines. The entire poem has comeout well.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you Vasudev garu.
మెచ్చుకోండిమెచ్చుకోండి