[ఇది చాలా అపురూపమైన కవిత. చిన్ని చిన్ని మాటలతో, సున్నితమైన భావనలను వ్యక్తపరచగలిగేడు కవి. ఇది పరాకుగా చదివితే సూఫీకవుల కవిత అనుకునే అవకాశం ఉంది. ఈ కవిత చదువుతుంటే, ముఖ్యంగా మొదటి త్రిపది, నాకు వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి “ఆశాగానము” గుర్తొచ్చింది.
చిత్తగించండి:
ఏ సడి లేక ఈ ప్రకృతియెల్ల గభీర నిశా నిబద్ధమై నీ సుకుమారహస్తముల నిద్దురవోయెడు మౌన వేళ, నీ వే, సరిజేసి, ఈ శిధిలవీణను పాడుమటంచు నా పయిన్ ద్రోసెదవేల, తీగ తెగునో, శృతిదప్పునొ, పల్కదో ప్రభూ!
ఇది ఒక మానవుడు భగవంతునితో పెట్టుకునే మొరలాగ (మరొక రకంగా చూస్తే, ఒక ప్రేమ పిపాసి తన ప్రేయసికి చేసుకునే నివేదనలాగ) ఉంది. ] .
నువ్వు పవనానినివి, నేను తంత్రీవాద్యాన్ని; ఓ పవనమా! నిద్రిస్తున్న ఈ తీగలపై చెలరేగు; మూగబోయిన ఈ హృదీ, తీగలూ తిరిగి నినదించేలా.
నేను యజ్ఞవేదికని; నువ్వు హోమాగ్నివి. ఓ అగ్నిహోత్రమా! జ్వలించు… నివురుగప్పిన నిప్పువై ఈ నిమిత్త శరీరపు దోషాలను సమూలంగా హరిస్తూ.
నేను నిశిని, నీవు స్వప్నానివి; సుతిమెత్తగా నను తాకి గాఢమైన అనుభూతిని ప్రసాదించు, శుషుప్తశైలాగ్ర శిఖరాన అన్నివర్ణాలూ ఏకమయేలా.
నీవు చంద్రమవు, నేను సెలయేరును; జలదరిస్తున్న నా గుండెలో ప్రతిఫలించు, నా జీవనపర్యంతమూ ఆత్మను వెలిగిస్తూ. .
ఎడ్విన్ మారఖామ్
April 23, 1852 – March 7, 1940
అమెరికను కవి.
.
.
Wind and Lyre
.
Thou art the wind and I the lyre;
Strike, O Wind, on the sleeping strings—
Strike till the dead heart stirs and sings!
I am the altar and thou the fire;
Burn, O Fire, to a snowy flame,
Burn me clean of the mortal blame!
I am the night and thou the dream;
Touch me softly and thrill me deep,
When all is white on the hills of sleep.
Thou are the moon and I the stream;
Shine in the trembling heart of me,
Light my soul to the mother-sea.
.
Edwin Markham
April 23, 1852 – March 7, 1940
American Poet
Poem Courtesy:
The Phoenix, Vol 3, July- August 1915, No. 2-13 , Pages 60-61 Ed. Michael Monahan