అనువాదలహరి

సానెట్ -3… షేక్స్పియర్

ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం

ఒకసారి అద్దంలోకి చూసుకుని, కనిపించిన ముఖానికి చెప్పు:
ఆ ముఖం మరో ముఖాన్ని తీసుకురావలసిన వయసు ఒచ్చిందని,
ఆ లోపాన్ని గాని నువ్విప్పుడు భర్తీ చెయ్యకపోతే
నువ్వు ప్రపంచాన్ని మభ్యపెట్టి, కాబోయే తల్లిని అన్యాయం చేస్తున్నావని.
బిడ్డలను కనవలసి వస్తుందని నీ సహచర్యాన్ని తిరస్కరించే
అందమైన స్త్రీ ఎక్కడైనా ఉందేమో చూపించు?
మృత్యువంటే అంత అపేక్ష ఉన్నవారెవరు, తన అందం
మీద ప్రేమతో బిడ్డలను కనకుండా ఉండడానికి?
నువ్వు మీ తల్లికి ప్రతిబింబానివి; ఆమె నినుచూసినపుడు
తన పూర్ణయవ్వన వయః పరిపాకాన్ని తలపోసుకుంటుంది.
అలాగే నువ్వు నీ వయసు వాటారిన వేళ, తనువు
ముడుతలు దేరినా, నేటి సొగసులు నెమరువేసుకుంటావు.
నిన్నెవరూ గుర్తుపెట్టుకోనక్కరలేదని బ్రతుకుతా నంటావా
సరే, ఒంటరిగా మరణించు. నీ రూపు నీతోనే సమసిపోతుంది.
.
విలియం షేక్స్పియర్

William Shakespeare

Sonnet III

.

Look in thy glass and tell the face thou viewest,

Now is the time that face should form another,

Whose fresh repair if now thou not renewest,

Thou dost beguile the world, unbless some mother.

For where is she so fair whose uneared womb

Disdains the tillage of thy husbandry?

Or who is he so fond will be the tomb,

Of his self-love to stop posterity?

Thou art thy mother’s glass and she in thee

Calls back the lovely April of her prime,

So thou through windows of thine age shalt see,

Despite of wrinkles this thy golden time.

But if thou live remembered not to be,

Die single and thine image dies with thee.

.

William Shakespeare

%d bloggers like this: