తారకలు పువ్వుల్లా మెత్తగానూ, అంత చేరికలోనూ ఉన్నాయి;
కొండలు నెమ్మదిగా వడికిన క్రీనీడల వలల్లా ఉన్నాయి;
ఇక్కడ ఆకునీ, గడ్డిపరకనీ విడిగా చూడలేము
అన్ని ఒకటిగా కలిసిపోయి ఉన్నాయి.
ఏ వెన్నెల తునకా గాలిని చొచ్చుకుని రాదు, ఒక నీలి
వెలుగు కిరణం బద్ధకంగా దొరలి అంతలో ఆరిపోయింది.
ఈ రాతిరి ఎక్కడా పదునైన వస్తువేదీ కనరాదు
ఒక్క నా గుండెలో తప్ప.
.
డొరతీ పార్కర్
ఆగష్టు 22, 1893 – జూన్ 7, 1967
అమెరికను కవయిత్రి
.

.
స్పందించండి