అనువాదలహరి

తోటలోని విగ్రహం… ఏగ్నెస్ లీ, అమెరికను కవయిత్రి

నన్నీ చలువరాయి దొరకబుచ్చుకునేవరకు దేవతని
ఓ పవనమా, పవనమా, ఆలస్యం చెయ్యకు!
నా ఆత్మను ఎగరేసుకుపో కిసలయాలు కిరీటాలయే ఎత్తుకి!
అయ్యో ఈ గాలి వినిపించుకోదేమి?

సరే, ఆగు ఆగు నా మాట విను చిన్ని పిచ్చుకా!
నాకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది తెలుసా
ఒకప్పుడు నేను అపోలో గుండెమీద వాలి ఉండేదాన్ని!
అరే ఒక పిట్టా నన్ను పట్టించుకోదే.

ఇక్కడ రోజులన్నీ వింతగా ఉన్నాయి,
కలకూజితాలతో నాకు రోజూ తెల్లవారుతుంది!
కాని బోసిపోయిన నాభుజాలమీద, అణగారిన ఆశల్లా
పండుటాకులు ఒకటొకటీ రాలుతున్నాయి.

వెలిగక్కని దుఃఖంలా ఆకాశం నల్లగా  ఉంది 
దిగువ ఆవరించి ఉన్న చీకటికి దీటుగా 
శరత్తు తొలి అడుగులు నేను గమనిస్తూనే ఉన్నాను: 
కొమ్మలు కళావిహీనమై గట్టిబడుతున్నాయి

దూరాననున్న పూలన్నీ తేరుకుంటున్నాయి
బక్కచిక్కిన ఈ చెట్లన్నీ భయపెడుతున్నాయి
వెల్లబోయిన నా భుజాలమీద రాలుతున్న ఆకులు
ఆవరించి ఉన్న చీకటికి వంతపాడుతున్నాయి.

.

ఏగ్నెస్ లీ
1868 – 1939
అమెరికను కవయిత్రి

.

A Statue in a Garden

 .

I was a goddess ere the marble found me.    

  Wind, wind, delay not! 

Waft my spirit where the laurel crowned me!         

  Will the wind stay not? 

Then tarry, tarry, listen, little swallow!

  An old glory feeds me—        

I lay upon the bosom of Apollo!        

  Not a bird heeds me.     

For here the days are alien. Oh, to waken     

  Mine, mine, with calling!        

But on my shoulders bare, like hopes forsaken,      

  The dead leaves are falling.     

The sky is gray and full of unshed weeping 

  As dim down the garden         

I wait and watch the early autumn sweeping.

  The stalks fade and harden.    

The souls of all the flowers afar have rallied.

  The trees, gaunt, appalling,     

Attest the gloom, and on my shoulders pallid         

  The dead leaves are falling.     

.

Agnes Lee (aka Martha Agnes Rand)

1868- 1939)

American Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/187.html

 

%d bloggers like this: