అనువాదలహరి

అన్ని అందమైన ఆకారాల్నీ చీకటి సొంతం చేసుకుంటుంది

కానీ, అబ్బా, ఆమె రెండు నల్లని అరచేతులూ ఎర్రగా ఉంటాయి.

నేను మృత్యువుకి భయపడతాను, మృతులకి కాదు

ఈ చీకటి పొత్తానికికాదు, ఎరుపుకీ, భయంకర దృశ్యాలకీ

గడ్డిలో మంచుబిందువుల్లా, దీపాలు తెల్లగా ఉన్నాయి

ఎక్కడా చలనం లేక ఈ నగరం శ్మశానంలా ఉంది

నల్లగా, చీకటి ఆవరించింది. ఇంత త్వరలో మరో

గాయపడ్డ సూర్యాస్తమయమొచ్చే అవకాశం లేదు.

కాబట్టి, నేను తీరుబడిగా ఈ చీకటి పేజీలు తిరగేస్తాను

నల్లగా కదిలే నీడల్ని గుడ్డివాడు చదువుతున్నట్టూహించుకుని

రాబోయే పదం రక్తమోడుతుందేమోనని భయంగా ఉంది.

లేదులేదు, మీరీ బొమ్మల ప్రార్థనపుస్తకాన్ని తీసుకుపొండి.

.

డి.హెచ్. లారెన్స్

11 September 1885 – 2 March 1930

ఇంగ్లీషు కవి

కొన్ని పుస్తకాలు చిత్రంగా ఉంటాయి. అందులో విషయాలు, ఏ లక్ష్యంకోసం రాయబడ్డాయో ఆ లక్ష్యానికి సరిగ్గా వ్యతిరేకమైన భావనలు సృష్టిస్తాయి పఠితల్లో. ఈ కవితలో పేర్కొన్న మిసాల్ Missal అన్నది కాథలిక్కుల ప్రార్థనాగీతాల పుస్తకం. ఇది కేవలం సింబాలిజం మాత్రమే. దానికి బదులు ఏ పుస్తకాన్ని ప్రతిక్షేపించినా భావంలో మార్పు ఉండదు

.

DH Lawrence

.

Grief

 .

The darkness steals the forms of all the queens.      

But oh, the palms of her two black hands are red!  

It is Death I fear so much, it is not the dead—        

Not this gray book, but the red and bloody scenes.

The lamps are white like snowdrops in the grass;   

The town is like a churchyard, all so still      

And gray, now night is here: nor will 

Another torn red sunset come to pass.

And so I sit and turn the book of gray,         

Feeling the shadows like a blind man reading,        

All fearful lest I find some next word bleeding.      

Nay, take my painted missal book away.

.

D H. Lawrence

11 September 1885 – 2 March 1930

English Novelist and Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/184.html

 

%d bloggers like this: