అనువాదలహరి

పర్వతాగ్రాలనుండి … జార్జి స్టెర్లింగ్… అమెరికను కవి

ముఖం మీద సాయం సంధ్యపులుముకుని ఇళ్ళకు మరలు దాం…

వేకువనే బయలు దేరిన మనం

ఉదయకాంతి వేగంతో చరించే గాలిని అనుసరిస్తూ

ఎడారుల హద్దుల్ని కనుక్కుందికి:

దైవం గర్హించే మన ఆశల తీరాలని వెదికినవారమై.

ముఖం మీద సాయం సంధ్యపులుముకుని ఇళ్ళకు మరలు దాం…

దారి తప్పి చాలా దూరం పోయిన మనం

నడి మధాహ్నం వేళకి, విపత్కరమైన చోట్ల జేరి,

చెట్టుకొననున్న పిట్టగూళ్ళకీ, పగటిచుక్కకీ

నడుమనున్న పర్వతాల ఎత్తేదో తెలుసుకున్నవాళ్లమై

ముఖం మీద సాయం సంధ్యపులుముకుని ఇళ్ళకు మరలు దాం

మీరరాని చోటులకు మార్గాలు

మనం కనుక్కోలేకపోయినా

మనం సమున్నత స్థానం నుండి

క్రింద సుదూరంగా చప్పుడు చేయని సంద్రాన్ని చూసినవారమై

.

జార్జి స్టెర్లింగ్

December 1, 1869 – November 17, 1926)

అమెరికను కవి

 

.

From The Mountains

.

Let us go home with the sunset on our faces—

We that went forth at morn,

To follow on the wind’s auroral paces,

And find the desert bourn

The frontier of our hope and Heaven’s scorn.

 

Let us go home with sunset  on our faces—

We that have wandered far

And stood by noon in high, disastrous places,

And known what mountains are

Between  those eyries and the morning star.

 

Let us go home with the sunset on our faces:

Altho we have not found

The pathway to the inviolable spaces,

We see from holy ground

An ocean far below without a sound.

.

George Sterling 

(December 1, 1869 – November 17, 1926)

American Poet

Poem Courtesy:

The Phoenix   Vol 2  April 1915 No. 5, (page 306)

https://play.google.com/books/reader?id=cerUAAAAMAAJ&printsec=frontcover&output=reader&hl=en&pg=GBS.PA357 

%d bloggers like this: