(పైకి ఒకమాట చెబుతూ లోపల ఇంకొకపని చేసే వాళ్ల ఆంతర్యం ఒకరోజు కాకపోతే మరొకరోజైనా బహిర్గతమౌతుంది. అవసరానికి మించి ఎవరైతే ఎక్కువ నీతులు వల్లిస్తారో వాళ్ళపట్ల బుద్ధిజీవులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడమే గాక, అమాయకులకి హెచ్చరికలుకూడా చేస్తుంటారు. అలాంటి హెచ్చరికే చేస్తున్నాడు కవి అమెరికాకి… బహుశ ఈ కవిత రెండవప్రపంచ సంగ్రామం నేపథ్యంలో రాయబడి ఉండొచ్చు)