అనువాదలహరి

బలిదానం తర్వాత …షార్మెల్ ఐరిస్, ఇటాలియన్ – అమెరికన్ కవి

(ఎవరిమీదనైనా రాయి విసరడం సులువు. అందులో  ఒకరు రాయిన విసిరిన తర్వాత, తర్వాత వాళ్లు కనీసం ఎందుకు విసురుతున్నారని ప్రశ్నించనైనా ప్రశ్నించకుండా రాళ్లు విసురుతారు. దీన్నే మంద బుద్ధి (Mob Psychology) అంటారు.  కాని, నిజమైన సేవ చేసేవాడు లేదా బలిదానం చేసేవాడు వాటిని కిమ్మనకుండా భరిస్తాడు. ఆ భరించడమే తర్వాత  విచక్షణలేకుండా రాయి విసిరిన ప్రతివారికీ  అపరాథభావనతో శాశ్వతమైన శిక్షగా పరిణమిస్తుంది.  ఈ విషయాన్నే కవి చాలా సున్నితంగా చెప్పాడు. )

వాళ్ళో రాయి విసిరేరు, నువ్వో రాయి విసిరేవు
నేనూ రాయి విసిరేను ఆ రోజు
వాళ్లు విసిరినరాయి పదునైనరాయి
శరీరాన్ని దొలిచినా వాడు మారు పలకలేదు.

వాడు ఆరోజు బాధతో మూల్గని మూలుగుకి
ప్రతిగా నేను ఈ రోజు బాధ వ్యక్తం చేస్తున్నాను.
నేను విసిరిన ఆ రాయికి శిక్షగా
నా మనసు ఇప్పుడు రాయి అయిపోవాలి.
.

షార్మెల్ ఐరిస్

1889- 1967

ఇటాలియన్ – అమెరికన్ కవి.

.

After the Martyrdom

.

They threw a stone, you threw a stone,         

  I threw a stone that day.

Although their sharpness bruised his flesh    

  He had no word to say. 

But for the moan he did not make       

  To-day I make my moan;       

And for the stone I threw at him         

  My heart must bear a stone.

.

Scharmel Iris 

1889–1967

Italian-American Catholic Poet

The New Poetry: An Anthology.  1917.

 Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/166.html

%d bloggers like this: