(వంద సంవత్సరాల క్రిందట మొదటి ప్రపంచ సంగ్రామం నేపధ్యంలో Phoenix పత్రిక 1914 డిశెంబరు సంచిక 208 వ పేజీలో ప్రచురించబడ్డ కవిత. )
నేను ఎప్పుడు పడితే అప్పుడు మృత్యువులా
కబళించి, త్రేంచే పెద్ద ఫిరంగులను కీర్తిస్తాను.
అబ్బా! మధ్యలో ఈ ఏడ్చే తల్లులొకళ్ళు,
చలనం లేకుండా పడున్న ఆకారాలూను.
రెపరెపలాడూ ఎగిరే జండాల పాటలుపాడతాను,
నా ముందు యుద్ధబాకాలూ, హాహాకారాలూను.
అబ్బా! జీర్ణవస్త్రాలెగిరే ఈ అస్థిపంజరాలొకవంకా
మరి ఎన్నడూ పలుకలేని పెదవులు మరోవంకానూ.
ఒకదాన్నొకటి ఒరుసుకునే కత్తులూ, ఖండించుకునే
కరవాలాల మెరుపులగురించి ఆలపిస్తాను
మీరు కూడా అవయవహీనుల గురించీ
పడున్న అర్థ నగ్నుల గురించీ పాడుతారా?
మనకి విజయాన్ని చేకూర్చిన
సేనాధిపతులను కీర్తిస్తాను
అబ్బా! ఆ ముక్కలైన శరీరాలొకటి
తేనెపట్టునుండి కారుతున్నట్టు రక్తమోడుతూ.
నేను విజయాన్ని వరించి కవాతు చేసుకుంటూ
వస్తున్న అశేష సైనిక పటాలాలగురించి పాడతాను
మీరు ఇక ఎన్నడూ కవాతు చెయ్యలేని వారిగురించీ
కనరాని ఆత్మలగురించీ పాడగలరా?
.
హారీ కెంప్
December 15, 1883 – August 5, 1960
అమెరికను కవి
.

Harry (Hibbard) Kemp
.
I sing the Battle
I sing the song of the great guns
that belch for death at will.
Ah, the wailing mothers,
the lifeless forms and still!
I sing the song of billowing flags,
the bugles, and cry before,
Ah, but the skeletons flapping rags,
the lips that speak no more!
I sing the clash of bayonets and
sabres that flash and cleave,
And wilt thou sing of maimed ones,
too, that go with pinned-up sleeve?
I sing acclaimed generals
that bring victory home,
Ah, but the broken bodies
that drip like honey-comb!
I sing of hosts triumphant,
long ranks of marching men,
And wilt thou sing the shadowy hosts
that never march again?
.
Harry Kemp
December 15, 1883 – August 5, 1960
American Poet
Poem Courtesy:
(The Phoenix, Vol 2, December 1914, No.1 page 208.)
https://play.google.com/books/reader?id=cerUAAAAMAAJ&printsec=frontcover&output=reader&hl=en&pg=GBS.PA193‘
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…