అనువాదలహరి

Packing Up… HRK, Telugu, Indian

I am sitting in some railway station

Whichever way I look, there is

Just this bench-long space to move about

I don’t know who these people are

What country and what language it is.

I don’t like railway stations

For, the rails lie there idly

Stretching into the unknown both ways

The signals suffer from drop head syndrome

And eons-old stains mark the walls.

Some X should come

Would he?

Something should happen

Like a train running onto the road

Or a bus speeding onto the rails…

Or some such thing.

Would it?

Whether or not that X came

Or that ‘something’ happened

Half-sitting on this choking bench

Like a timber adrift in a whirlwind

Waiting for another to drift elsewhere,

I should wait here shy, timid,

Reticent and gesturing with my head

For everything in “yes, yes”es or, “oh, yes”es,

“May be yes”es and “yes, it could be’s

Till somebody shifts me to some other place

Or till the awareness that nobody

Would ever come dawns upon me

And sweeps me off the platform

Thus I sit in some railway station

Oblivious of hours, days, years and ages.

Sivaram, My Pal!

Whatever I say, whatever I do

I need to do in this lone moment

That is in my hands

That’s it

And that’s all

After that I too should leave

Doffing the attire, cleaning up and closing the box

Whatever battles we fight, win or lose

All that we have at hand

Is one fleeting moment

And an angstrom arena

.

HRK

Photo Courtesy: HRK
Photo Courtesy: HRK

పెట్టె మూసేసి…

.

ఏదో రైల్వే స్టేషన్ లో కూర్చుని వున్నాను

ఎటు చూసినా ఒక్క బెంచీడు స్థలమే

కదలడానికి

ఏ వూరో ఏ దేశమో, వీళ్లంతా ఎవరో

గలగలమని ప్రవహిస్తున్నది ఏ భాషో

రైల్వే స్టేషనంటే నాకు ఇష్టం వుండదు

ఎక్కడి నుంచో వచ్చి మరెక్కడికో వెళ్తూ

వూరక పరుచుకుని వుంటాయి పట్టాలు

తలలు వాల్చి నిలబడతాయి సూచికలు

గోడల మీద ఎప్పటెప్పటివో మాసికలు

ఎవరో రావాలి

వస్తారా

ఏదో రావాలి

రోడ్డు మీద రైలో

పట్టాలపై బస్సో

ఏదో ఒకటి

వస్తుందా

ఎవరూ ఏదీ రాకున్నా

చాలీ చాలని ఈ బెంచీ మాదిరిగానో

ఒక పెను గాలికి వచ్చి పడి

ఇంకో పెను గాలి వచ్చే దాక

పడి వుండే కర్రముక్క మాదిరిగానో

ఏదో ఒకటి ఎవరో ఒకరు వచ్చే వరకు

చెయ్ చాచి నన్నిట్నుంచటు జరిపే వరకు

అసలు ఏదీ ఎవరూ రారనే పెను తెలివిడి

ప్లాట్ ఫాం మీద సుడిగాలయి వీచే వరకు

సిగ్గు సిగ్గుగా, మౌనంగా, ప్రతి దానికీ

ప్రతి దారికీ

ఔను అవునవును ఔనంటూ, లేదా,

ఔను కదూ,, ఔనేమో, కావొచ్చంటూ

ఏదో రైల్వే స్టేషన్ లో కూర్చుని వున్నాను

అరగంటయిందో ఆరు గంటలయిందో

అరవై దినాలో దశాబ్దాలో శతాబ్దాలో…

ఒరే, శివరామూ, అంతేరా

అంతే,

అంతా ఒక్క క్షణం లోనే

ఏంచెప్పినా ఏంచేసినా చేతిలో వున్న

ఒక్క క్షణంలోనే, ఆపై వెళి పోవాలి,

విప్పేసి తుడిచేసి పెట్టె మూసేసి

ఏం చేసినా ఏం గెలిచినా ఏం ఓడినా

ఈ ఒక్క క్షణమే, ఈ చిన్ని స్థలమే

.

HRK

2-8-2015

%d bloggers like this: