వెన్నెల్లో… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
“ఓ ఒంటరి పనివాడా, ఊహలలో తేలుతున్నట్టు
అక్కడ నిలబడి ఆమె సమాధివంక అలా
ప్రక్కన మరో సమాధిలేనట్టు ఎందుకు తేరి చూస్తావు?
శుష్కించిన నీ పెద్ద కన్నులు అంతగా ప్రాధేయపడితే
శవంలా చల్లబడిన ఈ వెన్నెల వెలుగులో, ఆమె ఆత్మ
బహుశా నిరాకారస్వరూపాన్ని ధరించి పైకి లేస్తుందేమో.”
“ఓయ్ వెర్రిడా! ఇక్కడ మనుషులెవరికీ అక్కరలేకపోయినా
నేను ఇపుడు చూద్దామనుకుంటున్నది సరిగ్గా అదే.
కాని ఏం లాభం? నా కలాంటి అదృష్టం లేదు.”
“అయితే, నిస్సందేహంగా ఆమె నీ ప్రేయసి అయి ఉంటుంది,
నీ మంచీ చెడులలో, కష్టాలూ సుఖాల్లో పాలుపంచుకొని
ఆమె పోగానే, నీ జీవితంలో వెలుగు హరించుకుపోయి ఉంటుంది.”
“లేదు. ఆమె నేను ప్రేమించిన స్త్రీ కాదు.
ఆమెని ఎవరికన్నాకూడా ఉన్నతంగా ఎవరూ పరిగణించలేదు.
ఆమె బ్రతికుండగా ఆమె గురించి ఆలోచించలేకపోయాను.”
.
థామస్ హార్డీ
2 June 1840 – 11 January 1928
ఇంగ్లీషు కవి

.