తారానివహపు మాయ… రిచర్డ్ బట్లర్ గ్లేంజర్, అమెరికను
నేనూహంచలేని ఏ దివ్యకుసుమాన్ని మించి
ఈ రోజు మీ సౌందర్యం ఉన్నా
ఈ రాత్రి మీరు నా మనసు దోచలేరు
ఎందుకంటే నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.
విరబూచిన గన్నేరులా
గాలి అలలలో తేలిపోతూ…
ప్రతి పువ్వునీ చెంతనున్న
మరోపువ్వు అధిగమిస్తూ…
భగ్గున వెలిగిన మంటలా,
ఆకుపచ్చని చారల రత్నంలా;
నక్షత్రాల తళతళలతో ఆకాశం
అద్భుతమైన స్ఫటికంలా
అక్కడక్కడ నీలి పొడిజల్లినట్టు ఉంది.
ఈ ఒక్క రాత్రికి
నా మనసు గండుతుమ్మెద అయిపోయింది
నక్షత్ర నివహాన్ని
విరినికుంజముగా ఊహించుకుంటూ …
ఆకాశం మెరుగుతీగలా అల్లిన
లెక్కలేని ఈ తారకలన్నీ
అనంతరోదసీ తీరాలనుండి
వెలుగులు విరజిమ్ముతున్నాయి,
రసనిష్యందమైన ఆ శోభ
కొలవ సాధ్యం కాదు
ఈ ఒక్క రాత్రికి
నా మనసు సాహసించింది,
ఈ నక్షత్రాల కాంతివలలో చిక్కుకుంది.
మీ అందం గణింపరాని
శక్తివంతమైన వల అయి ఉండొచ్చు,
ఈ రాత్రికి నన్ను కట్టిపడెయ్యలేదు
ఎందుకంటే, నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.
.
Star-Magic
.
Though your beauty be a flower
Of unimagined loveliness,
It cannot lure me tonight;
For I am all spirit.
As in the billowy oleander,
Full-bloomed,
Each blossom is all but lost
In the next—
One flame in a glow
Of green-veined rhodonite;
So is heaven a crystal magnificence
Of stars
Powdered lightly with blue.
For this one night
My spirit has turned honey-moth
And has made of the stars
Its flowers.
So all uncountable are the stars
That heaven shimmers as a web,
Bursting with light
From beyond,
A light exquisite,
Immeasurable!
For this one night
My spirit has dared, and been caught
In the web of the stars.
Though your beauty were a net
Of unimagined power,
It could not hold me tonight;
For I am all spirit.
.
Richard Butler Glaenzer
http://www.bartleby.com/265/144.html
The New Poetry: An Anthology. 1917.
Harriet Monroe, ed. (1860–1936).