అనువాదలహరి

సుదూర భవిష్యత్తులోని కవికి… జేమ్స్ ఫ్లెకర్, ఇంగ్లీషు కవి

వెయ్యేళ్ళ క్రితమే గతించిన నేను,
నీకు ఈ ప్రాక్తన  మధుర గీతం రాస్తునా.
మాటలే నీకు వార్తాహరులుగా పంపుతునా
నేను నీతో కలిసి నడవను గనుక.

నువ్వు సముద్రాలపై వారధులే కడతావో
భీకరమైన రోదసిలో భద్రంగా ప్రయాణిస్తావో
ఉత్కృష్టమైన రమ్యహర్మ్యాలే నిర్మిస్తావో,లేక
ఇనుమూ,ఇటుకతో కట్టుకుంటావో నా కనవసరం .

ఇంకా సంగీతమూ, మద్యమూ దొరుకుతున్నాయా?
విగ్రహాలూ, ఇంతలేసి కన్నులున్న ప్రేమికలున్నారా?
మంచీ, చెడూ గురించిన పిచ్చి పిచ్చి ఆలోచనలున్నాయా?
ఊర్ధ్వలోకాల్లోని వారికై ప్రార్థనలున్నాయా?

మనం  మనసులెలా గెలవాలి? సాయంత్రవేళ
వీచే పిల్ల తెమ్మెరలా మన ఊహలు తేలియాడాలని
పాపం గుడ్డి మారాజు పూర్వం ఎప్పుడో
మూడువేల ఏళ్ళ క్రిందట చెప్పనే చెప్పాడు. 

చూడని, తెలియనేరని, ఇంకా పుట్టనే పుట్టని
ఓ మిత్రమా, తీయని మన ఆంగ్లభాషాప్రేమికుడా!
నామాటలు రాత్రిపూట ఒంటరిగా చదువుకో,
నేనో కవిని, యువకుణ్ణి.

నేను నీ ముఖం చూడలేను గనుక
నీతో చెయ్యి కలపలేను గనుక
వ్యోమ,కాలాలు సాక్షిగా నీకు నా ఆత్మీయ
శుభకామనలు. నువ్వు గ్రహిస్తావులే. 
.
జేమ్స్ ఫ్లెకర్

5 November 1884 – 3 January 1915

ఇంగ్లీషు కవి

.

James Elroy Flecker

.

To A Poet A Thousand Years Hence

I who am dead a thousand years,

 And wrote this sweet, archaic song,

 Send you my words for messengers

 The way I shall not pass along

 I care not if you bridge the seas

 Or ride secure the cruel sky,

 Or build consummate palaces

 Of metal or of masonry.

 But have you wine and music still,

 And statues and a bright-eyed love,

 And foolish thoughts of good and ill,

 And prayers to them who sit above?

 How shall we conquer? Like a wind

 That falls at eve our fancies blow,

 And old Maeonides* the blind

 Said it three thousand years ago.

 O friend unseen, unborn, unknown,

 Student of our sweet English tongue:

 Read out my words at night, alone:

 I was a poet, I was young

 Since I can never see your face,

 And never shake you by the hand,

 I send my soul through time and space

 To greet you. You will understand.

.

James Elroy Flecker

5 November 1884 – 3 January 1915

English Poet, Novelist and Playwright.

(Note: Maeonides: Homer)

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.com/2003/04/to-poet-thousand-years-hence-james.html

Come! Let’s weave a dream for the morrow… Sahir Ludhianvi,

Come! Let’s weave a dream for the morrow,

Lest this grave enduring night should bite

And unnerve us, that for the rest of our lives,

Our heart and mind fail to weave a colorful dream!

Though youth is fleeting from us like a dart

Life totes on the mere strength of dreams …

Dreams of tresses, of lips, and shapely bodes

Of reaching pinnacle of art and touch sublime poetry;

Dreams of urbane life and a prosperous country

Dreams of prisons and of roads to gallows

They were the marrow of my youthful days;

And they were the essence of activity I was nourished with.

If these dreams were to die, life would just be colorless

And go pale like a hand caught under a boulder.

Come! Let’s weave a dream for the morrow,

Lest this grave enduring night should bite

And unnerve us, that for the rest of our lives,

Our heart and mind fail to weave a colorful dream! 

.

Sahir Ludhianvi 

8 March 1921 – 25 October 1980

Urdu Poet and Lyricist,  Indian 

.

Sahir Ludhianvi

.

ఆవో కే కోయీ ఖాబ్ బునేం కల్ కే వాస్తే

వర్న యే రాత్ ఆజ్ కీ సంగీన్ దౌర్ కీ

డస్ లేగీ జానో దిల్ కో కుఛ్ ఐసే కె జానో దిల్

తా ఉమ్ర్ ఫిర్ న కోయీ హసీన్ ఖాబ్ బున్ సకేం

గో హమ్ సే భాగ్తీ రహీ యే తేజ్ గామ్ ఉమ్ర్

ఖాబోంకే ఆస్రేపే కటీ హై తమామ్ ఉమ్ర్

జుల్ఫోం కే ఖాబ్, హోంటోం కే ఖాబ్, ఔర్ బదన్ కే ఖాబ్

మేరాజ్ ఫన్ కే ఖాబ్, కమాల్ సుఖన్ కే ఖాబ్

తహజీబ్ జిందగీ కే, ఫ్రోగ్ వతన్ కే ఖాబ్

జందాం కే ఖాబ్, కూచె దారో రసన్ కే ఖాబ్

యే ఖాబ్ హీతో అప్నీ జవానీ కే పాస్ థే

యే ఖాబ్ హీతో అప్నీ అమల్ కే ఎసాస్ థే

యే ఖాబ్ మర్ గయే హైతో బే రంగ్ హై హయాత్

యుం హై కె జైసే దస్తె తహ్ సంగ్ హై హయాత్

ఆవో కే కోయీ ఖాబ్ బునేం కల్ కే వాస్తే

వర్న యే రాత్ ఆజ్ కీ సంగీన్ దౌర్ కీ

డస్ లేగీ జానో దిల్ కో కుఛ్ ఐసే కె జానో దిల్

తా ఉమ్ర్ ఫిర్ న కోయీ హసీన్ ఖాబ్ బున్ సకేం

ఆవో కే కోయీ ఖాబ్ బునేం కల్ కే వాస్తే

వర్న యే రాత్ ఆజ్ కీ సంగీన్ దౌర్ కీ

డస్ లేగీ జానో దిల్ కో కుఛ్ ఐసే కె జానో దిల్

తా ఉమ్ర్ ఫిర్ న కోయీ హసీన్ ఖాబ్ బున్ సకేం

గో హమ్ సే భాగ్తీ రహీ యే తేజ్ గామ్ ఉమ్ర్

ఖాబోంకే ఆస్రేపే కటీ హై తమామ్ ఉమ్ర్

.

Telugu Transliteration courtesy:

 Janab Abd Wahed

“ఉర్దూ కవిత్వ నజరానా” శుక్రవారం,  August 2015,

Kavi Sangamam Group in Facebook.

సార్వజనీనిక ప్రార్థన… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి

సమస్తభూతకోటికి తండ్రివయిన పరమాత్మా!
దేశకాలావధులుదాటి జనులు నిను కొలుస్తారు
ఋషులూ, పండితులూ, పామరులన్న భేదంలేకుండా
యెహోవావనో, అల్లావనో, ఈశ్వరుడవనో!
సృష్టికి ఆదికారణమవు; కానీ, ఎవరికీ ఆకళింపు కావు:
నా ఇంద్రియాలకి ఇంతవరకు మాత్రమే తెలుసుకునేలా
నిర్దేశించేవు:నువ్వు దయామయుడవనీ,
నేను మాత్రం నిన్ను కనుగొనలేననీ.
అయినప్పటికీ, ఈ విశాలనిశాజగతిలో
చెడులో మంచిని చూడగలిగే దృష్టి ప్రసాదించేవు;
ఈ ప్రకృతిని విధితో గట్టిగా ముడివేస్తూనే
మనిషికి ఇచ్చవచ్చినది చేయగల స్వేచ్ఛనిచ్చావు.
నా మనసు ఏది అనుమతిస్తుందో అది చేసేలా,
ఏది వద్దని వారిస్తుందో అది చెయ్యకుండుట ఎలాగో,
వాటితోపాటు,స్వర్గాన్ని పొందడమెలాగో కంటే,
నరకాన్ని తప్పించుకోడమెలాగో బోధించు;
నీవు కరుణతో అనుగ్రహించిన సంపదలేవీ
నేను అజ్ఞానంతో దూరం చేసుకోకుండా చూడు
ఎందుకంటే మనిషి స్వీకరణే దైవానికి మన్నన,
అనుభవించడమే … ఆజ్ఞ శిరసావహించడం.
అయినప్పటికీ, నా పై నీ అనుగ్రహాన్ని
లేశమైన ఈ భూమి మనుగడవరకే పరిమితి చేయకు,
పరీవ్యాప్తమై వేల జగత్తులున్నచోట కేవలం
మనిషికే నీవుదేవుడవని నేను భ్రమించకుండా చూడు,
ఈ బలహీణుణ్ణి, ఈ అవివేకిని
నీ ప్రయత్నాలని వృధా చేసి
నీ శత్రువని నేను భావించినవాడికి
ఇక్కడే నరకాన్ని చవిచూచేలా చెయ్యనీయకు.
నేను చెప్పినది సరియైతే, నీ కరుణ ప్రసరించి
నేను ఆ ఋజుమార్గంలో కొనసాగేలా ఆశీర్వదించు;
నేను పొరబడితే, ప్రభూ, నా హృదయానికి,
సరియైన త్రోవ కనుక్కోగల శక్తినిప్రసాదించు.
నన్ను వివేకహీనమైన అహంకారంనుండీ,
ధర్మదూరమైన అసంతృప్తినుండీ రక్షించు;
నీ వివేకము నిరాకరించినచోటులలోనూ,
నీ అనుగ్రహము వర్షించినచోటులలోనూ
ఇతరుల కష్తాలను అర్థంచేసుకోగల విజ్ఞతనీ,
నేను చూసేలోపాన్ని కప్పిపుచ్చగల శక్తినీ ఇవ్వు;
నేను ఇతరులపై ఏ అనుకంప ప్రదర్శించగలనో
అదే అనుకంప నీవు నాపై ప్రసరించు.
నేను అల్పుడినే, కానీ పూర్తిగా కాదు,
నీ ఊపిరి నాకు పునర్జన్మనిస్తుంది కనుక;
ప్రభూ, నేను ఏ యే చోటుల సంచరించినా
జీవ్వనంలోనూ, మరణంలోనూ నీవే నన్ను నడిపించు.
ఈ రోజు నాకు కడుపుకీ, మనసుకీ శాంతి అనుగ్రహించు.
తక్కినవి ఎన్ని నువ్వు అనుగ్రహించినా.
నీకు తెలుసు శ్రేష్ఠమైనది అనుగ్రహించేవో లేదో,
నీ సంకల్పం ఏదైతే అలాగే జరగనీ.
ఈ విశ్వమే నీ దేవాలయమైన చోట,
భూమ్యాకాశాలూ, రోదశీ నివేదనాస్థలమైన చోట,
అందరూ ఏకకంఠంతో కీర్తించనీ
సృష్టిలోని సమస్త సుగంధాలూ వ్యాపించనీ!

.
అలెగ్జాండర్ పోప్

21 May 1688 – 30 May 1744

ఇంగ్లీషు కవి

Alexander Pope

.

Universal Prayer

.

Father of all! in every age,

    In every clime adored,
By saint, by savage, and by sage,
    Jehovah, Jove, or Lord!
Thou Great First Cause, least understood:
    Who all my sense confined
To know but this—that thou art good,
    And that myself am blind:
Yet gave me, in this dark estate,
    To see the good from ill;
And binding Nature fast in fate,
    Left free the human will.
What conscience dictates to be done,
    Or warns me not to do,
This, teach me more than Hell to shun,
    That, more than Heaven pursue.
What blessings thy free bounty gives,
    Let me not cast away;
For God is paid when man receives,
    To enjoy is to obey.
Yet not to earth’s contracted span,
    Thy goodness let me bound,
Or think thee Lord alone of man,
    When thousand worlds are round:
Let not this weak, unknowing hand
    Presume thy bolts to throw,
And deal damnation round the land,
    On each I judge thy foe.
If I am right, thy grace impart,
    Still in the right to stay;
If I am wrong, oh teach my heart
    To find a better way.
Save me alike from foolish pride,
    Or impious discontent,
At aught thy wisdom has denied,
    Or aught thy goodness lent.
Teach me to feel another’s woe,
    To hide the fault I see;
That mercy I to others show,
    That mercy show to me.
Mean though I am, not wholly so
    Since quickened by thy breath;
Oh lead me wheresoe’er I go,
    Through this day’s life or death.
This day, be bread and peace my lot:
    All else beneath the sun,
Thou know’st if best bestowed or not,
    And let thy will be done.
To thee, whose temple is all space,
    Whose altar, earth, sea, skies!
One chorus let all being raise!
    All Nature’s incense rise!
.
Alexander Pope

poem Courtesy:

https://archive.org/stream/englishpoetryits00gaylrich#page/112/mode/1up

ఒక ముదిత… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

నువ్వు అందమైన దానివే, కాని అది గతం,
ఒక పురాతన పియానో మీద ఆలపించిన
ఒకనాటి సంగీత రూపకంలా;
లేదా,18వ శతాబ్దపు అంతిపురాల్లో
సూర్యకాంతులీనే పట్టువలిపానివి.

నీ కన్నుల్లో గడువు మీరి, వ్రాలుతున్న
నిమేష కుసుమాలు నివురుగప్పుతున్నాయి;
నీ ఆత్మ సౌరభం
ఏదో తెలియని వాసనతో ముంచెత్తుతోంది
చాలకాలం మూతవేసిన జాడీల్లోని ఆవకాయలా.

కానీ, నీ గొతులో పలికే స్వరభేదాలు

వాటి మేళవిప్ములు వింటుంటే నాకు మనోహరంగా ఉంది.

నా శక్తి అప్పుడే ముద్రించిన నాణెం లాంటిది
దాన్ని నీ పాదాల ముందు ఉంచుతున్నాను.
మాట్టిలోంచి తీసి చూడు.
దాని తళతళ నీకు నవ్వు తెప్పించవచ్చు

.

 ఏమీ లోవెల్

February 9, 1874 – May 12, 1925

అమెరికను కవయిత్రి

.

Amy Lowell

.

A Lady

.

You are beautiful and faded,

Like an old opera tune

Played upon a harpsichord;

Or like the sun-flooded silks

Of an eighteenth century boudoir.

In your eyes

Smoulder the fallen roses of outlived minutes,

And the perfume of your soul

Is vague and suffusing,

With the pungence of sealed spice jars.

Your half-tones delight me,

And I grow mad with gazing

At your blent colors.

My vigor is a new-minted penny,

Which I cast at your feet.

Gather it up from the dust,

That its sparkle may amuse you.

.

Amy Lowell

February 9, 1874 – May 12, 1925

American

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/199.html

Staking Life… Mohan Rishi, Telugu, Indian

There is nothing more to be dreadful about death,

Nor, are there any illusions of it visiting a particular day.

The light and night try to neutralize one another

Pleasures and pains are not exempted.

Today walks over us to morrow

The survivors continue their death-ward journey.

Death lurking in every step, and

Life abiding under shadow of death

Are the facts of the times.

One can’t witness any glimmer of hope

In people living under Damocles’ sword.

Is coming home a bane or a blessing?

It’s moot on a frightful disquieting stygian night.

In a wont, heartless, calcining world

Where people are insulated from one another

Dumbstruck and half-asleep in their own time-zones,

Their cells, busy engagements, and their heart-rending grieves,

There is more now to fear … how to live?

.

Mohan Rishi

Telugu

Indian

Image Courtesy: Mohan Rishi
Image Courtesy: Mohan Rishi

Mr. Mohan Rishi is a copy Editor with Ad Agency. He has over 100 poems published in all reputed Telugu magazines . Music and Literature are his passion. He can be reached at: Mohanrishi.73@gmail.com.

చంపుడుపందెం

.

చావుగురించి భయపడ్డానికేమీ లేదు. ఇప్పుడది ప్రత్యేకంగా
ఒకరోజున వస్తుందన్న భ్రమలూ లేవు.

పగలూ, రాత్రులూ ఒకదాన్నొకటి చంపుకుంటాయి. సంతోషాలూ,
దుఃఖాలూ, అతీతాలూ కావు.

రోజు మనల్ని చంపి మరోరోజులోకి ప్రవేశిస్తుంది. బతికి బట్టకట్టినవాళ్ళు
మరణం దిశగా ప్రయాణిస్తారు

.

అడుగు అడుగులోని చావూ, చావు నీడలోని బతుకూ ఇప్పటి 
నిజాలు. ప్రాణాలు ఉగ్గబట్టుకొని చరిస్తున్న జీవాల్లో ఏ రేపటి 
ఆశలకాంతినీ కనుగొనలేవు.

తిరిగిరావడం చావో, బతుకో తేల్చుకోలేని భయవిహ్వల కాళరాత్రి
కాలాల్లో. జాలాల్లో. హృదయవిదారక శోకాల్లో.

పలకరించుకోవడానికి దొరకని సమయాల్లో. మాటలు దొరకని 
సందర్భాల్లో. పలవరించలేని సగంనిద్రల్లో. ఒకరికొకరు ఏమీకాని
నిర్దిష్ట, నిర్దయామయ నిప్పులకుంపటి లోకంలో.

ఇప్పుడు బతుకు గురించి భయపడ్డానికే చాలా వుంది.

.

మోహన్ రుషి

నాకు తెలుసు, నాకొక్కడికే తెలుసు… ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి

నాకు తెలుసు, నాకొక్కడికే తెలుసు…
ఏ నమ్మకమూ, ఏ నియమమూ,
ఏ సంగీతమూ, ఏ ఆలోచనా లేకపోతే
ఈ హృదయం ఎంత గాయపడుతుందో.

నాకు తెలుసు, నాకొక్కడికే తెలుసు…
కాని అదేదీ నేను చెప్పలేను.
ఎందుకంటే ఆ అనుభూతి ఆకాశం లాంటిది
కనిపిస్తుంది, చూడడానికి ఏమీ ఉండదు.
.
ఫెర్నాండో పెసో
June 13, 1888 – November 30, 1935

పోర్చుగీసు కవి

Fernando Pessoa

.

I Know, I Alone

.

I know, I alone

How much it hurts, this heart

With no faith nor law

Nor melody nor thought.

Only I, only I

And none of this can I say

Because feeling is like the sky –

Seen, nothing in it to see.

.

Fernando Pessoa

June 13, 1888 – November 30, 1935

Portuguese Poet, writer, literary critic, translator, publisher and philosopher.

Poem Courtesy:  http://allpoetry.com/Fernando-Pessoa

పవనమూ— తంత్రీ వాద్యమూ … ఎడ్విన్ మారఖామ్, అమెరికను కవి

[ఇది చాలా అపురూపమైన కవిత. చిన్ని చిన్ని మాటలతో, సున్నితమైన భావనలను   వ్యక్తపరచగలిగేడు కవి. ఇది పరాకుగా చదివితే సూఫీకవుల కవిత అనుకునే అవకాశం ఉంది. ఈ కవిత చదువుతుంటే, ముఖ్యంగా మొదటి త్రిపది, నాకు వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి “ఆశాగానము” గుర్తొచ్చింది. 

చిత్తగించండి:

ఏ సడి లేక ఈ ప్రకృతియెల్ల గభీర నిశా నిబద్ధమై
నీ సుకుమారహస్తముల నిద్దురవోయెడు మౌన వేళ, నీ
వే, సరిజేసి, ఈ శిధిలవీణను పాడుమటంచు నా పయిన్
ద్రోసెదవేల, తీగ తెగునో, శృతిదప్పునొ, పల్కదో ప్రభూ!

ఇది ఒక మానవుడు భగవంతునితో పెట్టుకునే మొరలాగ (మరొక రకంగా చూస్తే, ఒక ప్రేమ పిపాసి తన ప్రేయసికి చేసుకునే నివేదనలాగ) ఉంది. ]
.

నువ్వు పవనానినివి, నేను తంత్రీవాద్యాన్ని;
ఓ పవనమా! నిద్రిస్తున్న ఈ తీగలపై చెలరేగు;
మూగబోయిన ఈ హృదీ, తీగలూ తిరిగి నినదించేలా.

నేను యజ్ఞవేదికని; నువ్వు హోమాగ్నివి.
ఓ అగ్నిహోత్రమా! జ్వలించు… నివురుగప్పిన నిప్పువై
ఈ నిమిత్త శరీరపు దోషాలను సమూలంగా హరిస్తూ.

నేను నిశిని, నీవు స్వప్నానివి;
సుతిమెత్తగా నను తాకి గాఢమైన అనుభూతిని ప్రసాదించు,
శుషుప్తశైలాగ్ర శిఖరాన అన్నివర్ణాలూ ఏకమయేలా.

నీవు చంద్రమవు, నేను సెలయేరును;
జలదరిస్తున్న నా గుండెలో ప్రతిఫలించు,
నా జీవనపర్యంతమూ ఆత్మను వెలిగిస్తూ.
.

ఎడ్విన్ మారఖామ్ 

April 23, 1852 – March 7, 1940

అమెరికను కవి.

.

 

 .

Wind and Lyre 

.

Thou art the wind and I the lyre;

Strike, O Wind, on the sleeping strings—

Strike till the dead heart stirs and sings!

I am the altar and thou the fire;

Burn, O Fire, to a snowy flame,

Burn me clean  of the mortal blame!

I am the night and thou the dream;

Touch me softly and thrill me deep,

When all is white on the hills of sleep.

Thou are the moon and I the stream;

Shine in the trembling heart of me,

Light my soul to the mother-sea.

.

Edwin Markham

April 23, 1852 – March 7, 1940

American Poet

Poem Courtesy:

The Phoenix, Vol 3, July- August 1915, No. 2-13 , Pages 60-61  Ed. Michael Monahan

సానెట్ -3… షేక్స్పియర్

ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం

ఒకసారి అద్దంలోకి చూసుకుని, కనిపించిన ముఖానికి చెప్పు:
ఆ ముఖం మరో ముఖాన్ని తీసుకురావలసిన వయసు ఒచ్చిందని,
ఆ లోపాన్ని గాని నువ్విప్పుడు భర్తీ చెయ్యకపోతే
నువ్వు ప్రపంచాన్ని మభ్యపెట్టి, కాబోయే తల్లిని అన్యాయం చేస్తున్నావని.
బిడ్డలను కనవలసి వస్తుందని నీ సహచర్యాన్ని తిరస్కరించే
అందమైన స్త్రీ ఎక్కడైనా ఉందేమో చూపించు?
మృత్యువంటే అంత అపేక్ష ఉన్నవారెవరు, తన అందం
మీద ప్రేమతో బిడ్డలను కనకుండా ఉండడానికి?
నువ్వు మీ తల్లికి ప్రతిబింబానివి; ఆమె నినుచూసినపుడు
తన పూర్ణయవ్వన వయః పరిపాకాన్ని తలపోసుకుంటుంది.
అలాగే నువ్వు నీ వయసు వాటారిన వేళ, తనువు
ముడుతలు దేరినా, నేటి సొగసులు నెమరువేసుకుంటావు.
నిన్నెవరూ గుర్తుపెట్టుకోనక్కరలేదని బ్రతుకుతా నంటావా
సరే, ఒంటరిగా మరణించు. నీ రూపు నీతోనే సమసిపోతుంది.
.
విలియం షేక్స్పియర్

William Shakespeare

Sonnet III

.

Look in thy glass and tell the face thou viewest,

Now is the time that face should form another,

Whose fresh repair if now thou not renewest,

Thou dost beguile the world, unbless some mother.

For where is she so fair whose uneared womb

Disdains the tillage of thy husbandry?

Or who is he so fond will be the tomb,

Of his self-love to stop posterity?

Thou art thy mother’s glass and she in thee

Calls back the lovely April of her prime,

So thou through windows of thine age shalt see,

Despite of wrinkles this thy golden time.

But if thou live remembered not to be,

Die single and thine image dies with thee.

.

William Shakespeare

ఎదురుచూపు… రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి

(ఈ కవిత తన భార్య ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ మృతి సందర్భంగా 1861లో వ్రాసినది.)

మృత్యువంటే భయపడుతునానా?  గొంతులో చల్లదనం ప్రారంభమై

ముఖాన్ని చలిగాలి తాకి,

మంచు పేరుకోడం ప్రారంభమై, ఈదురుగాలులు వీస్తున్నాయంటే

నేను ఆ ప్రదేశానికి చేరువయ్యానన్న మాట.

రాత్రి చూడబోతే బలీయము, విరుచుకుపడుతోంది తుఫాను

పట్టవలసింది శత్రు స్థావరం

అక్కడ భయంకరమైన శత్రువు కంటికెదురుగా నిలిచిన్నప్పటికీ

సాహసికుడు ముందుకు పోక తప్పదు

ప్రయాణం ముగిసింది, శిఖరం చేతికందింది,

సరిహద్దులు కూలిపోయాయి

బహుమతి చేతికి చిక్కే వరకూ పోరాడవలసి ఉన్నా, కడకి

అన్నిపోరాటాలకీ అదే బహుమతి

నేను నిత్య పోరాట యోధుణ్ణి— ఇది మరొక్క పోరాటం

చివరదీ, అన్నిటిలోకి మిన్న ఐనదీ

మృత్యుభయం కళ్ళకు గంతలు కట్టి, నిర్వీర్యం చేసి,

నామీద పెత్తనం చెలాయించడం  నాకు నచ్చదు;

లాభం లేదు. దాని అంతు చూడవలసిందే, పూర్వపు వీరుల్లా

నా సహచరుల్లా పోరాడవలసిందే.

ముందుండి ఎదుర్కోవాలి, ఒక్క నిముషంలో జీవితంలోని

వేదనల, నిరాశల, నిర్లిప్తతల బాకీలు చెల్లించాలి

ధీరులకి పరిస్థితి ఒక్కసారిగా విషమించడమే మంచిది,

చివరి ఘడియ ఎంతసేపో ఉండదు

ప్రకృతిశక్తులు ముమ్మరమై, అంతవరకూ ఉత్సాహపరచిన

మిత్రుల మాటలు పలచనై, గాలిలో కలిసి

ఆగిపోతాయి. బాధలలోంచి మొదట నిష్కృతి లభిస్తుంది,

వెనువెనకనే ఒక వెలుగు; తర్వాత గుండె ఆగుతుంది.

ఓ నా ప్రాణంలో ప్రాణమా! నేను నిన్ను మళ్ళీ హత్తుకుంటాను

తక్కినది అంతా పరమాత్మలోనే!

.

రాబర్ట్ బ్రౌనింగ్

ఇంగ్లీషు కవి.

.

Prospice* 

.

Fear death? — to feel the fog in my throat,

The mist in my face,

When the snows begin, and the blasts denote

I am nearing the place,

The power of the night, the press of the storm,

The post of the foe;

Where he stands, the Arch Fear in a visible form,

Yet the strong man must go:

For the journey is done and the summit attained,

And the barriers fall.

Tho’ a battle’s to fight ere the guerdon be gained,

The reward of it all.

I was ever a fighter, so — one fight more,

The best and the last!

I would hate that death bandaged my eyes, and forebore,

And bade me creep past.

No! let me taste the whole of it, fare like my peers

The heroes of old,

Bear the brunt, in a minute pay glad life’s arrears

Of pain, darkness and cold.

For sudden the worst turns the best to the brave,

The black minute’s at end,

And the elements’ rage, the friend-voices that rave,

Shall dwindle, shall blend,

Shall change, shall become first a peace out of pain,

Then a light, then thy breast,

O thou soul of my soul! I shall clasp thee again,

And with God be the rest.

.

(Note: Prospice in Latin means “Looking Forward”)

Robert Browning 

7 May 1812 – 12 December 1889

English Poet and Playwright

అర్థ రాత్రి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

తారకలు పువ్వుల్లా మెత్తగానూ, అంత చేరికలోనూ ఉన్నాయి;

కొండలు నెమ్మదిగా వడికిన క్రీనీడల వలల్లా ఉన్నాయి;

ఇక్కడ ఆకునీ, గడ్డిపరకనీ విడిగా చూడలేము

అన్ని ఒకటిగా కలిసిపోయి ఉన్నాయి.

ఏ వెన్నెల తునకా గాలిని చొచ్చుకుని రాదు, ఒక నీలి

వెలుగు కిరణం బద్ధకంగా దొరలి అంతలో ఆరిపోయింది.

ఈ రాతిరి ఎక్కడా పదునైన వస్తువేదీ కనరాదు

ఒక్క నా గుండెలో తప్ప.

.

డొరతీ పార్కర్

ఆగష్టు 22, 1893 – జూన్ 7, 1967

అమెరికను కవయిత్రి

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

.

Midnight

The stars are soft as flowers, and as near;
The hills are webs of shadow, slowly spun,
No separate leaf or single blade is here
All blend to one.

No moonbeams cuts the air, a sapphire light
Rolls lazily and slips again to rest.
There is no edged thing in all this night,
Save in my breast.

.
Dorothy Parker
August 22, 1893 – June 7, 1967
American Poet, critic and short story writer

%d bloggers like this: