నెల: జూలై 2015
-
కాలం… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి
ఓ క్రూరమైన కాలమా! నీ పరుగు పూర్తయేదాకా పరిగెత్తు. బరువైన సీసపు లోలకపు గమనాన్ని పోలిన వేగంతో నీరసంగా అడుగులువేసే ఘడియల్ని నీ వెంట తీసుకుపో; నీకు దొరికే ఆ నశ్వరమూ, నిరుపయోగమైన వాటితోనే నీ పొట్ట పగిలేలా సుష్టుగా ఆరగించు అదంతా కేవలం క్షణభంగురమైన వ్యర్థము. మేము పోగొట్టుకున్నదీ లేదు నువ్వు బావుకున్నదీ లేదు. ఎందుకంటే, ఒక్కొక్క పనికిమాలిన వస్తువునీ అంకించుకుంటూ, చివరకి నిన్ను నువ్వే ఆరగించుకున్నాక అనశ్వరమైన బ్రహ్మానందం మాకోసం నిర్రిక్షిస్తుంటుంది ఒక్కొక్కరికీ ఆత్మీయమైన…
-
ముదివగ్గు… జోసెఫ్ కేంప్ బెల్, ఐరిష్ కవి
దేవుని సన్నిధినుంచిన తెల్లని కొవ్వొత్తిలాటిది ఒక వయసుపైబడ్డ ముఖపు అందం. చలికాలపు సూర్యుడి వేడిమిలేని వెలుగులాంటిది జీవనయాత్ర ముగింపులోకి వచ్చిన స్త్రీ జీవితం సంతు దూరమైనా ఆమె ఆలోచనలు మాత్రం పాడుబడ్డ నూతిలోని నీళ్ళలా నిలకడగా ఉన్నాయి. . జోసెఫ్ కేంప్ బెల్ July 15, 1879 – June 1944 ఐరిష్ కవి . The Old Woman . As a white candle In a holy place, So…
-
విషాదము.. రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి
వాంఛ అనే రోగము గడ్డురోజుల్లో నిరాశతో కూడిన ఆలోచనలతో సతమతమౌతూ, మనిషిని మరిచి, దేవుణ్ణి మెప్పించజూస్తుంది; కానీ నిద్రలో కూడా విచారానికి మందు కనిపెట్టలేదు. ఒకప్పుడు కలలుగనడంతో పాటు, తెగువకీ, గొప్ప పేరుప్రతిష్ఠలకీ అవకాశమిచ్చిన ‘సంశయత ‘ ఇప్పుడు చుక్కలు పొడవని చీకటిగా మారి చలిరాత్రిలో భయంకరమైన అడ్డుగోడై నిలుస్తోంది. మూర్ఖుడా! అసాధ్యమైన దానిని కోరుకున్న నువ్వు ఇపుడు అసహనంతో ఊరికే నిరుత్సాహపడుతున్నావు. చూడు సృష్టి ఏమీ మారకుండా ఎలా ఉందో. ఆనందం వివేకాన్ని హత్తుకుంది నీ…
-
సౌందర్యం కోసం వగవకు… విటర్ బైనర్, అమెరికను
లే చివురువంటి కేశాలతో మనసుదోచుకునే దృశ్యాదృశ్యమైన కనుబొమలకోసం శోకించకు; ఎండలోనూ, మంచుకురిసినపుడూ స్పష్టాస్పష్టంగా చిరునవ్వులు చిందించే పెదాలకోసమూ వగవకు; శుష్కించి నిస్త్రాణమై పడున్న అవయవాలు నీరసించి చలనరహితంగా ఉన్నాయనీ విచారించకు; అవి ఎగురుతూ ఎగురుతూ ఉన్న పిచ్చుక ఎన్ని వంకరలుపోగలదో అంతకంటే ఎక్కువగా, ఎదురులేని ఓడల తెరచాపల సత్తాను పరీక్షించడానికి ఎంత వేగంగా గాలి వీచగలదో అంతకంటే ఎక్కువ వేగంగా పరిగెత్తగలమార్గాలు అన్వేషించగలవు. శోకించకు! నీ కంటికి కనిపించిన దానికంటే లోతైన ఆ సౌందర్యానికి ఆనందభాష్పాలు విడిచిపెట్టు.…
-
A Soldier who dwarfed the sun… Aranya Krishna, Telugu, Indian
This land is still damp With every drop of blood That dripped from your bed of arrows; The motes of dust under your feet Sent for diagnostic tests Continue to transmit relentlessly The ‘power’ful impulses of your body From police laboratories; Your severed forearm By transforming into several pennants Nestles cozily in our hands; The…
-
1914 … రూపర్ట్ బ్రూక్, ఇంగ్లీషు కవి
(మొదటి ప్రపంచయుద్ధం నేపధ్యంలో వచ్చిన కవిత ఇది) ప్రియా! అందరిలోకీ అదృష్టవంతుడూ, ఈ నిముషంలో అందరికంటే సుఖంగా ఉన్నవాడూ ఎవరంటే, శాశ్వతమైన ప్రతి వస్తువుతోనూ సఖ్యంగా ఉన్న మనం, “మన అంత క్షేమంగా ఎవరున్నారు?” అన్న మాట విని మనం గోప్యంగా ఉంచిన క్షేమ రహస్యాన్ని కనుక్కుని చీకట్లు ముసురుతున్న ప్రపంచంలో నిశ్చింతగా ఉన్నవాడే. కాలం శిధిలం చెయ్యలేని ఒక ఇల్లు కట్టుకున్నాం ఏ బాధా పోగొట్టలేని శాశ్వత ప్రశాంతతని సంపాదించేం యుద్ధానికి ఎదురునిలవగల శక్తి లేదు.…
-
ప్రేమవిహంగము … రోలో బ్రిటెన్, అమెరికను కవి
ప్రేమపూర్వకమైన మాటలు గొంతులో కొట్టుకుంటాయి ఈ లోపున, కలలలో విహరించే నా మనసులోంచి మరో అందమైన భావన ఎగసి బయటకొస్తుంది. గుడిలో ప్రతిష్ఠించలేని నా ప్రేమ విహంగమా! నిన్నెన్నడూ సరియైన మాటలలో వ్యక్తపరచలేను అందుకనే అలా ఆలోచనలలోనే ఎగరేస్తుంటాను. అలా శాశ్వతంగా నిరాకారమైన నువ్వు ఎన్నడూ పైకి లేవని మంచుతెరలా గాలిలో తేలుతూనే ఉంటావు. నువ్వుకూడా నల్లని రెక్కలతో ఎగిరే పక్షుల్లో ఒకతెవై రాత్రల్లా ఎగురుతూనే ఉంటావు ఏ రాత్రినీ అర్థం చేసుకోలేక . రోలో బ్రిటెన్…
-
Before we log out… Anveeksha, Telugu
. We can’t make out whether there is any face Or just a slideshow of masks galore. I marvel at the faces dried on the washing line … pegging two poles. Did you ever notice people without a face? When I overhear somebody censuring another as “a faceless fellow” I think that was, perhaps, what…
-
హసెకావాస్మృతికి…వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్, అమెరికను
నీ మరణం పెద్ద చెప్పుకోతగ్గ వార్త కాదు. నువ్వు బ్రతికినన్నాళ్ళూ ఎవరికీ తెలియకుండానే బ్రతికేవు నువ్వు జీవితంలో గర్వంగా చెప్పుకున్నదేదీ లేదు కానీ జీవితమే … నిన్ను గర్వంగా చెప్పుకుంటున్నది. . వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్ April 4, 1878 – January 29, 1954 అమెరికను విమర్శకుడు, కవి . To Hasekawa . Perhaps it is no matter that you died. Life’s an incognito which…
-
వైద్య విద్యార్థి…మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను కవి
ఓహ్! మితిలేని అధికారం ఎంత బాధాకరం! జడమైన నా అరచేతిలో ఎందరివో ప్రాణాలున్నాయి. చిత్రమైన పరసువేది విద్య… నా రక్తాన్ని పీల్చుకుంటుంది: నా మనసు లోహం; మెదడు తామ్రం; కళ్ళు రజతం; పెదాలు ఇత్తడి; కేవలం ఒక వేలు తిప్పడం ద్వారా … నా లోంచి కొన్ని వేల ప్రాణాలు జీవంపోసుకుంటాయి… బలమైన రెక్కలు గలవీ… లేదా కొట్టుకుని కొట్టుకుని తెగిపడిపోయేవీ… వాళ్ళు నా పిల్లలు, వాళ్ళకి నేనే తల్లినీ, తండ్రినీ. వాళ్ళ జీవన్మరణాలకు నేను కాపలాకాయాలి.…