నెల: జూలై 2015
-
సన్యాసిని… మేరీ కెరోలీన్ డేవీస్ అమెరికను కవయిత్రి
. ఈ రాత్రి ఆ చిన్ని సన్యాసిని మరణించింది ఆమె చేతులు గుండెలమీద ఉంచారు; అస్తమించబోతున్న సూర్యుడు ఆమె ప్రశాంతమైన కురులు ముద్దిడబోయాడు; కన్నీరొలుకుతూ ప్రవహిస్తున్న సెలయేటి తీరాన ఆమె సమాధి నిర్మించబడ్డది. ఆ బాల సన్యాసిని ఆత్మ ఆశ్చర్యపోతూ నెమ్మదిగా నిష్క్రమించింది ఆమె సోదరుడు క్రీస్తు నిలుచున్న కల్పవృక్షపునీడలోనికి. అతను నిట్టూర్చేడు; అతని ముఖం చూడగానే ఆమెకు కంట నీరు చిమ్మింది. ఆమె లేత చేతులు తన చేతులలోకి తీసుకుని ఆయన బాధ దిగమింగుతూ ఆశీర్వదించేడు;…
-
వెరసి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
కత్తులు నొప్పెడతాయి నదులు బాగా చలివేస్తాయి ఏసిడ్ లు మరకలు వేస్తాయి మందులకి ఒళ్ళు బిగుసుకుంటుంది తుపాకులు చట్టవిరుద్ధం ఉరితాళ్ళు తెగిపోవచ్చు గేస్ భరించలేని వాసన …. నువ్వు బతకడమే ఉత్తమం. . డొరతీ పార్కర్ August 22, 1893 – June 7, 1967 అమెరికను కవయిత్రి Resumé . Razors pain you; Rivers are damp; Acids stain you; And drugs cause cramp. Guns aren’t lawful; Nooses give;…
-
పంచపాదులు…ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి
1. ఒక నవంబరు రాత్రి జాగ్రత్తగా విను. వినీ వినిపించని సడితో ప్రేతాత్మల అడుగుల చప్పుడులా మంచుకి బిరుసెక్కిన ఆకులు, చెట్లనుండి వేరై క్రిందకి రాలుతున్నాయి. 2. ఆ మూడూ ఆ మూడూ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి… రాలుతున్న మంచూ వేకువకి ముందరి ఝాము అప్పుడే మరణించిన వాడి నోరూ… 3. సుసన్నా – పెద్దలూ “అవునూ, నువ్వు ఎందుకు ఆమె గురించి చెడు ప్రచారం చేస్తావు?” “ఆమె అందంగా సుకుమారంగా ఉంటుంది. అందుకు.” . ఎడిలేడ్…
-
ఓ ప్రకృతీ! … ఏలిస్ కార్బిన్, అమెరికను కవయిత్రి
చీకటి వెలుగులతో, మృణ్మయ రూపివై నా కళ్ళెదుటే మార్పుచెందే ఓ ప్రకృతీ! నీలో ఎన్ని ప్రేమ, వెలుగుల గుప్త నిక్షేపాలున్నాయో కదా! ఓ ప్రకృతీ! సమర్థతనుమించిన అధికారం దొరికినందువలన నాకు ఒరిగేది ఏముంటుంది? ఉన్నదిమార్చనూ, నూతన సమతౌల్యాన్ని తేనూ సృష్టించనూ, నశింపజేయనూ గలనా? ఓ ప్రకృతీ! దానివల్ల ఏమి లాభం? నాకు సృష్టికర్తకున్నంత ఉత్సాహమున్నా నిన్ను నా ఊహలకి దరిదాపుగా కూడా నిన్ను నేను అనువుగా మలుచుకో లేనే! . ఏలిస్ కార్బిన్ (April 16, 1881…
-
ప్రవాసి… జోసెఫ్ కాంప్ బెల్, ఐరిష్ కవి
వాహనం ఇంటిముందు సిద్ధంగా ఉంది ఇక వేడుకలకి సమయం మించిపోయింది. రా, వాద్యకారుడా, నా కోసం రాగం ఆలపించు ఇక ఈ ఇంటికీ, పంటకీ, చెట్టుచేమలకీ వీడ్కోలు ఈ రోజు పొలాలు చల్లగా చెమ్మగా ఉన్నాయి దడులు కంతలుపడ్డాయి, సొమ్ములు ముసిలివి ఒకప్పటిలా ఇప్పుడు ఏదీ ఉండటం లేదు ఇక ఈ ఇంటికీ, పంటకీ, చెట్టుచేమలకీ వీడ్కోలు నాకు మనసులేకపోయినా, పోక తప్పదు నే నెవరినీ ఎరగని మనుషుల మధ్యకి. సేవించు, మిత్రమా, నా క్షేమంకోరి మద్యం…
-
Three Sixty Degrees of the City… Aranya Krishna, Telugu, Indian
Products of casual friction of some nameless bodies Sans love, rapture or ecstasy, These children drop down like meteorites onto the city’s pavements. The days that drip like drops of milk from time’s udder Freeze grimly on their black-ice-cube-like skins. Like dirty linen washed and hung in the open to dry Their bodies smack of…
-
Ha! Ha!! Ha!!!… HRK, Telugu, Indian
You are neither the plaintiff nor the defendant You have no business with the litigation here But, watching the proceedings, you jumped into the abyss Wagered with your soul and lost your stakes. What is now left for you is to exit the place Collecting the spilled spirit in the cup of your hands The…
-
కెరటానితో నీటిపక్షి… పెడ్రాక్ కోలం , ఐరిష్ కవి
ఓ నిష్కల్మష హితుడా! నువ్వు అవిశ్రాంతంగా సాగుతూనే ఉంటావు ఉరుములు నిన్ను భయపెట్టలేవు. రెక్కలు లేకుండా కేవలం ఆవేశంతో నువ్వెలా సాగగలుగుతున్నావు? కనులపండుగచేసే సువిశాలమైన ఈ జలనిధి చూపిస్తోంది నువ్వెంత త్వరగా సాగుతున్నావో. ఓ నిష్కల్మష హితుడా అప్పుడే వెళ్లిపోయావా? . పెడ్రాక్ కోలం 8 December 1881 – 11 January 1972 ఐరిష్ కవి . . The Sea Bird to the Wave . On and on, O white…
-
సానెట్ 1… షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం ఈ కవితలన్నీ ఒక అజ్ఞాత యువకుణ్ణి (Mr. W H) ఉద్దేశించి వ్రాసినవి బహుశా పెళ్లి చేసుకుందికి నిరాకరిస్తున్న ఈ యువకుణ్ణి సున్నితంగా పరోక్షంగా మందలిస్తున్నట్టు కనిపిస్తుంది . సుందరమైన జీవకోటి పరంపరాభివృద్ధిచెందాలని ఆశిస్తాము దానివల్ల అందమనే గులాబీ ఎన్నడూ వాడకుండా ఉంటుంది; శుభలక్షణాలున్న ఒక తరం ముగిసిపోయే వేళకి దాని లే లేత వారసత్వం వాటిని కొనసాగించడానికి ఆయత్తమౌతుంది; కానీ, నువ్వు నీ ఉజ్జ్వలమైన కనులకి వాటి…
-
కోతి… నాన్సీ కేంప్ బెల్, ఐరిష్ కవయిత్రి
నువ్వు రాళ్ళమీద వణుకుతూ ఒదుక్కుని కూచోడమూ; చలిగాలి ఎముకలగూడులాంటి నీ ఒంటిని సూదిలాపొడవడమూ చూసేను . చిందరవందరగా ఉన్న నీ ఒంటిమీది బొచ్చు వెచ్చదనాన్నివ్వలేదు పాపం ఒక చిన్న కోతివి, అచ్చం మనుషులను పోలిన నీ కళ్ళు, నీ బాధల వెనక నక్కినట్టు బేలగా లోపలికి పోయాయి… మౌనంగా, నిరాశగా విధికి తలవంచుకుంటూ… నువ్వొక అంతుపట్టని చిత్రానివి. నీ కోతి మనసు అడవుల్లో నీ స్వేచ్ఛా విహారాలూ, స్నేహితులతోగడిపిన ఒకప్పటి మంచిరోజులు గుర్తుతెచ్చుకుని విచారిస్తోందా? అద్భుతమైన ఉషోదయవేళల్లో,…