కనుమరుగు… విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్, ఇంగ్లీషు కవి

నీడలేని ఎండలో, పిరమిడ్ కి దగ్గరగా,

దాని శిఖరం మిట్టమధ్యాహ్నపు పగటిని చీలుస్తుంటే

కళ్ళు తెరవలేని వెలుగు క్రింద తెల్లని బట్టలు ధరించి

ఎండలో చెమటలు కక్కుకుంటూ బానిసలు పడుకుని నిద్రపోతున్నారు.

వాళ్ళకి నాలుగుచెరగులా,తెరిస్తేచాలు కళ్ళు మండే ఎండ

ఎడారి దారుల పొడుగునా తన తేజస్సుని వెదజల్లుతోంది;

ఊహించడానికి భయమేస్తూ, తీక్షణంగా, మిరుమిట్లు గొలుపుతూ

అంతూ పొంతూ లేని ఒక తెల్లని శూన్యం పరుచుకుని ఉంది.

ఆ పిరమిడ్ చీకటి అంతర్భాగంలో

శతాబ్దాలుగా సూర్యుడు చొరని చరిత్రతో

చీకటి ఒడిలో రాజు కియాప్స్ శాశ్వతనిద్ర పోతున్నాడు.

అయితే నేమి? బయట కళ్ళు పోగొట్టే మధ్యాహ్నపు

ఎండ తీవ్రత సృష్టించే శ్వేతవిస్మృతికి మించిన

విస్మృతి అతని చీకటి గదిలో లేదని తనకి తెలుసు.

.

విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్

2 October 1878 – 26 May 1962

ఇంగ్లీషు కవి

.

.

Oblivion

.

Near the great pyramid, unshadowed, white,

With apex piercing the white noon-day blaze.        

Swathed in white robes beneath the blinding rays   

Lie sleeping Bedouins drenched in white-hot light.

About them, searing to the tingling sight,     

Swims the white dazzle of the desert ways    

Where the sense shudders, witless and adaze,         

In a white void with neither depth nor height.        

Within the black core of the pyramid, 

Beneath the weight of sunless centuries,       

Lapt in dead night King Cheops lies asleep:  

Yet in the darkness of his chamber hid         

He knows no black oblivion more deep        

Than that blind white oblivion of noon skies.

.

Wilfrid Wilson Gibson 

2 October 1878 – 26 May 1962

English Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/132.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: