అనువాదలహరి

సహవాసి… లీ విల్సన్ డాడ్ అమెరికను కవి

నన్ను శత్రువను మిత్రుడను
నాకు లక్ష్యం లేదు
ఎవరు తెగించగలరో
వారి వెంటనే నేనూను

నేనే శక్తినీ
నేనే ప్రేరణనీ
నేనే కోరికకి
మూలాధారాన్ని

నేనే ఆవేశాన్ని
నేనే ప్రోత్సాహం, ఆలంబననూ
నేనే గీతంగా మారే
కెరటాలమీది చంద్రికనీ

నన్ను శత్రువను మిత్రుడను
నాకు లక్ష్యం లేదు
మరణానికి వెరవక
ఆలపించేవారివెంటే నేనూను

నన్ను శత్రువను మిత్రుడను
నేను ఇవ్వడానికే తీసుకుంటాను
బ్రతకడానికి మరణించే
వారి వెంటే నేనూను
.
లీ విల్సన్ డాడ్
అమెరికను కవి
జులై 11, 1879- 1933

.

The Comrade

.

Call me friend or foe,

Little I care!

I go with all who go

Daring to dare.

I am the force,

I am the fire,

I am the secret source

Of desire.

I am the urge,

The spur and thong:

Moon of the tides that surge

Into song!

Call me friend or foe,

Little care I,

I go with all who go

Singing to die.

Call me friend or foe….

Taking to give,

I go with all who go

Dying to live.

.

Lee Wilson Dodd

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/95.html

%d bloggers like this: