అనువాదలహరి

సన్యాసిని… మేరీ కెరోలీన్ డేవీస్ అమెరికను కవయిత్రి

.

ఈ రాత్రి ఆ చిన్ని సన్యాసిని మరణించింది
ఆమె చేతులు గుండెలమీద ఉంచారు;
అస్తమించబోతున్న సూర్యుడు
ఆమె ప్రశాంతమైన కురులు ముద్దిడబోయాడు;
కన్నీరొలుకుతూ ప్రవహిస్తున్న సెలయేటి
తీరాన ఆమె సమాధి నిర్మించబడ్డది.

ఆ బాల సన్యాసిని ఆత్మ ఆశ్చర్యపోతూ
నెమ్మదిగా నిష్క్రమించింది
ఆమె సోదరుడు క్రీస్తు నిలుచున్న
కల్పవృక్షపునీడలోనికి.
అతను నిట్టూర్చేడు; అతని ముఖం
చూడగానే ఆమెకు కంట నీరు చిమ్మింది.

ఆమె లేత చేతులు తన చేతులలోకి తీసుకుని
ఆయన బాధ దిగమింగుతూ ఆశీర్వదించేడు;
“గుడ్డి వాళ్ళు, పాపం నిన్ను అలా నిర్బంధించేరు,”
ఓపలేని కన్నీరొలుకుతూ ఇలా అన్నాడు,
“మేరీ తన గుండెలపై బిడ్డని
హత్తుకున్నది చూడలేదో?”

.

మేరీ కెరోలీన్ డేవీస్

1888 -1940?

అమెరికను కవయిత్రి

.

Cloistered

.

To-Night the little girl-nun died.

  Her hands were laid

Across her breast; the last sun tried

  To kiss her quiet braid;

And where the little river cried,

  Her grave was made.

The little girl-nun’s soul, in awe,

  Went silently

To where her brother Christ she saw,

  Under the Living Tree;

He sighed, and his face seemed to draw

  Her tears, to see.

He laid his hands on her hands mild,

  And gravely blessed;

“Blind, they that kept you so,” he smiled,

  With tears unguessed.

“Saw they not Mary held a child

  Upon her breast?”

.

Mary Carolyn Davies

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/88.html

 

%d bloggers like this: