అనువాదలహరి

పంచపాదులు…ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి

1. ఒక నవంబరు రాత్రి

జాగ్రత్తగా విను.
వినీ వినిపించని సడితో
ప్రేతాత్మల అడుగుల చప్పుడులా
మంచుకి బిరుసెక్కిన ఆకులు, చెట్లనుండి వేరై
క్రిందకి రాలుతున్నాయి.

2. ఆ మూడూ

ఆ మూడూ
ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి…
రాలుతున్న మంచూ
వేకువకి ముందరి ఝాము
అప్పుడే మరణించిన వాడి నోరూ…

3. సుసన్నా – పెద్దలూ

“అవునూ, నువ్వు
ఎందుకు ఆమె గురించి చెడు
ప్రచారం చేస్తావు?”
“ఆమె అందంగా సుకుమారంగా ఉంటుంది.
అందుకు.”
.
ఎడిలేడ్ క్రాప్సీ
సెప్టెంబరు 9, 1878 – అక్టోబరు 8, 1914
అమెరికను కవయిత్రి.

.

.

      Cinquains

 1. November Night

Listen.         

With faint dry sound,      

Like steps of passing ghosts,    

The leaves, frost-crisp’d, break from the trees        

And fall.  

   

 2. Triad

These be     

Three silent things:

The falling snow …

The hour before the dawn …

The mouth of one Just dead.  

   

 3. Susanna and the Elders

“Why do     

You thus devise    

Evil against her?” “For that       

She is beautiful, delicate;

Therefore.” 

.

Adelaide Crapsey

September 9, 1878 – October 8, 1914

American Poetess

Poems Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/69.

http://www.bartleby.com/265/70.

http://www.bartleby.com/265/71.

 

%d bloggers like this: