అనువాదలహరి

ఓ ప్రకృతీ! … ఏలిస్ కార్బిన్, అమెరికను కవయిత్రి

చీకటి వెలుగులతో, మృణ్మయ రూపివై
నా కళ్ళెదుటే మార్పుచెందే ఓ ప్రకృతీ!
నీలో ఎన్ని ప్రేమ, వెలుగుల
గుప్త నిక్షేపాలున్నాయో కదా!

ఓ ప్రకృతీ! సమర్థతనుమించిన అధికారం
దొరికినందువలన నాకు ఒరిగేది ఏముంటుంది?
ఉన్నదిమార్చనూ, నూతన సమతౌల్యాన్ని తేనూ
సృష్టించనూ, నశింపజేయనూ గలనా?

ఓ ప్రకృతీ! దానివల్ల ఏమి లాభం?
నాకు సృష్టికర్తకున్నంత ఉత్సాహమున్నా
నిన్ను నా ఊహలకి దరిదాపుగా కూడా
నిన్ను నేను అనువుగా మలుచుకో లేనే!

ఏలిస్ కార్బిన్

(April 16, 1881 – July 18, 1949)

అమెరికను కవయిత్రి

.

Alice Corbin

Image Courtesy:

http://www.poemhunter.com

.

O World

.

O world that changes under my hand,

  O brown world, bitter and bright,     

And full of hidden recesses      

  Of love and light—       

O world, what use would there be to me       

  Of power beyond power         

To change, or establish new balance,  

  To build, or deflower?  

O world, what use would there be?     

  Had I the Creator’s fire,

I could not build you nearer     

  To my heart’s desire!

.

Alice Corbin

(April 16, 1881 – July 18, 1949)

American Poetess, Author and Editor

The New Poetry: An Anthology.  1917.

 Harriet Monroe, ed. (1860–1936).

 

http://www.bartleby.com/265/59.html

 

%d bloggers like this: