అనువాదలహరి

ప్రవాసి… జోసెఫ్ కాంప్ బెల్, ఐరిష్ కవి

వాహనం ఇంటిముందు సిద్ధంగా ఉంది
ఇక వేడుకలకి సమయం మించిపోయింది.
రా, వాద్యకారుడా, నా కోసం రాగం ఆలపించు
ఇక ఈ ఇంటికీ, పంటకీ, చెట్టుచేమలకీ వీడ్కోలు

ఈ రోజు పొలాలు చల్లగా చెమ్మగా ఉన్నాయి
దడులు కంతలుపడ్డాయి, సొమ్ములు ముసిలివి
ఒకప్పటిలా ఇప్పుడు ఏదీ ఉండటం లేదు
ఇక ఈ ఇంటికీ, పంటకీ, చెట్టుచేమలకీ వీడ్కోలు

నాకు మనసులేకపోయినా, పోక తప్పదు
నే నెవరినీ ఎరగని మనుషుల మధ్యకి.
సేవించు, మిత్రమా, నా క్షేమంకోరి మద్యం సేవించు
ఇక ఈ ఇంటికీ, పంటకీ, చెట్టుచేమలకీ వీడ్కోలు

ఐదుగంటల్లో నే పడవ ఎక్కుతాను
గుజారా తీసేసి ఓడ లంగరు ఎత్తుతారు
కడలిలో ఏ కల్లోలమూ రాకుండా దైవమనుగ్రహించుగాక!
ఇక ఈ ఇంటికీ, పంటకీ, చెట్టుచేమలకీ వీడ్కోలు

.

జోసెఫ్ కాంప్ బెల్

July 15, 1879 – June 1944

ఐరిష్ కవి

.

.

The Emigrant

.

The car is yoked before the door,

And time will let us dance no more.

Come, fiddler, now, and play for me

‘Farewell to barn and stack and tree.’

To-day the fields looked wet and cold,

The mearings gapped, the cattle old.

Things are not what they used to be –

‘Farewell to barn and stack and tree.’

I go, without the heart to go,

To kindred that I hardly know.

Drink, neighbour, drink a health with me –

‘Farewell to barn and stack and tree.’

Five hours will see me stowed aboard,

The gang-plank up, the ship unmoored.

Christ grant no tempest shakes the sea –

‘Farewell to barn and stack and tree.’

.

Joseph Campbell

(aka Seosamh Mac Cathmhaoil / Seosamh MacCathmhaoil)

July 15, 1879 – June 1944

Irish Poet

Courtesy: https://www.youtube.com/watch?v=ZcLNMx_-UgY

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: