అనువాదలహరి

Ha! Ha!!  Ha!!!… HRK, Telugu, Indian

You are neither the plaintiff nor the defendant

You have no business with the litigation here

But, watching the proceedings, you jumped into the abyss

Wagered with your soul and lost your stakes.

What is now left for you is to exit the place

Collecting the spilled spirit in the cup of your hands

The sporting of children with pebbles in the crimson evening sun

Is an evanescent song taking shape with nascent vocab.

A gust of zephyr down the hill caresses you ever so gently

And adieus giving you an identity, place and a nationality

How long can you stay put on the periphery?

You try to judge, slip, and join some bandwagon.

You reduce to a view in a dialectic that has no final say,

And from then on, look for a way out of the maze.

Not now anyway, but perhaps, at the end of the war

all of us come together after the retreat and laugh our hearts out.

.

HRK

Telugu ndian

Photo Courtesy: HRK
Photo Courtesy: HRK

హ్హహ్హ హ్హ

.

నువ్వు వాదివి కాదు, ప్రతి వాదివీ కాదు

ఇక్కడి ఈ పేచీలతో నీకే సంబంధం లేదు

తగాదా చూస్చూసి అగాథంలో పడిపోయావు

పంతానికి ఆత్మను ఒడ్డి పందెం ఓడిపోయావు

ఒలికిపోయిన ఆత్మను దోసిలితో తోడుకుని

తోడ్కొని వెళ్లిపోవడమే ఇక ఇప్పుడు నీ పని

సాయంత్రం నీరెండలో గులక రాళ్లతో పిల్లల ఆట

ఇప్పుడిప్పడే తయారౌతున్న పసరు పదాల పాట

పొద్దున్నే ముద్దు ముద్దుగా తాకుతుందొక కొండ గాలి

నీకో ఊరిచ్చి పేరిచ్చి ఇక్కడి వాన్ని చేసి నవ్వుతుంది

ఎరీనా అంచులలో అలా ఎంత సేపని వుండిపోతావు

ఎదో తీర్పు చెప్పబోతావు జారిపోతావు చేరిపోతావు

ఎవరూ గెలవని వాదంలో నువ్వూ ఒక పద మవుతావు

అది మొదలు, బయటికి దారి దొరక్క దిక్కులు చూస్తావు

ఇప్పుడు కాదు గాని, యుద్ధం అంతా అయిపోయాక,

అందరం బయటికొచ్చేసి, కలిసి గాఠిగా నవ్వుకుంటా మేమో

.

Hanumantha Reddy Konidela (HRK)

%d bloggers like this: