అనువాదలహరి

కెరటానితో నీటిపక్షి… పెడ్రాక్ కోలం , ఐరిష్ కవి

ఓ నిష్కల్మష హితుడా!

నువ్వు అవిశ్రాంతంగా సాగుతూనే ఉంటావు

ఉరుములు నిన్ను భయపెట్టలేవు.

రెక్కలు లేకుండా కేవలం ఆవేశంతో

నువ్వెలా సాగగలుగుతున్నావు?

కనులపండుగచేసే

సువిశాలమైన ఈ జలనిధి చూపిస్తోంది

నువ్వెంత త్వరగా సాగుతున్నావో.

ఓ నిష్కల్మష హితుడా

అప్పుడే వెళ్లిపోయావా?

.

పెడ్రాక్ కోలం

8 December 1881 – 11 January 1972

ఐరిష్ కవి

.


.

The Sea Bird to the Wave

.

On and on,  

O white brother!   

Thunder does not daunt thee!   

How thou movest!

By thine impulse—         

With no wing!      

Fairest thing

The wide sea shows me! 

On and on   

O white brother!   

Art thou gone!

.

Padraic Colum

8 December 1881 – 11 January 1972

Irish Poet and Novelist

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/55.html

 

%d bloggers like this: