సానెట్ 1… షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం
ఈ కవితలన్నీ ఒక అజ్ఞాత యువకుణ్ణి (Mr. W H) ఉద్దేశించి వ్రాసినవి
బహుశా పెళ్లి చేసుకుందికి నిరాకరిస్తున్న ఈ యువకుణ్ణి సున్నితంగా పరోక్షంగా మందలిస్తున్నట్టు కనిపిస్తుంది
.
సుందరమైన జీవకోటి పరంపరాభివృద్ధిచెందాలని ఆశిస్తాము
దానివల్ల అందమనే గులాబీ ఎన్నడూ వాడకుండా ఉంటుంది;
శుభలక్షణాలున్న ఒక తరం ముగిసిపోయే వేళకి దాని
లే లేత వారసత్వం వాటిని కొనసాగించడానికి ఆయత్తమౌతుంది;
కానీ, నువ్వు నీ ఉజ్జ్వలమైన కనులకి వాటి వెలుగుతోనే
వాటిని చూసి మురిసిపోయే గుణం అలవరచుకున్నావు
వాటి ప్రతిరూపాలుండవలసినచోట కరువు ఏర్పరుస్తూ.
నీకు నువ్వే శత్రువువై, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నావు;
సృష్టికే సరి కొత్త ఆభరణానివైన నువ్వు,
వన్నెల వసంతానికి ఏకైక వైతాళికుడవైన నువ్వు
మొగ్గలోనే నీ అందాన్ని త్రుంచడానికి ప్రయత్నిస్తున్నావు
ఓ పిచ్చి కన్నా, పిసినారివై నీ సంపద వృధాచేస్తున్నావు.
ప్రకృతిని కరుణించు; లేకుంటే నే చెప్పబోయే తిండిపోతు
ప్రకృతి పాలే కాదు, నీ పాలూ సమాధిపాలు చేస్తుంది.
.
షేక్స్పియర్
.
Sonnet 1
.
From fairest creatures we desire increase,
That thereby beauty’s rose might never die,
But as the riper should by time decease,
His tender heir might bear his memory:
But thou contracted to thine own bright eyes,
Feed’st thy light’s flame with self-substantial fuel,
Making a famine where abundance lies,
Thy self thy foe, to thy sweet self too cruel:
Thou that art now the world’s fresh ornament,
And only herald to the gaudy spring,
Within thine own bud buriest thy content,
And, tender churl, mak’st waste in niggarding:
Pity the world, or else this glutton be,
To eat the world’s due, by the grave and thee.
.
Shakespeare
Poem Courtest:
http://www.shakespeares-sonnets.com/sonnet/1