అనువాదలహరి

కోతి… నాన్సీ కేంప్ బెల్, ఐరిష్ కవయిత్రి

నువ్వు రాళ్ళమీద వణుకుతూ ఒదుక్కుని కూచోడమూ; చలిగాలి

ఎముకలగూడులాంటి నీ ఒంటిని సూదిలాపొడవడమూ చూసేను .

చిందరవందరగా ఉన్న నీ ఒంటిమీది బొచ్చు వెచ్చదనాన్నివ్వలేదు

పాపం ఒక చిన్న కోతివి, అచ్చం మనుషులను పోలిన నీ కళ్ళు,

నీ బాధల వెనక నక్కినట్టు బేలగా లోపలికి పోయాయి…

మౌనంగా, నిరాశగా విధికి తలవంచుకుంటూ…

నువ్వొక అంతుపట్టని చిత్రానివి. నీ కోతి మనసు

అడవుల్లో నీ స్వేచ్ఛా విహారాలూ, స్నేహితులతోగడిపిన

ఒకప్పటి మంచిరోజులు గుర్తుతెచ్చుకుని విచారిస్తోందా?

అద్భుతమైన ఉషోదయవేళల్లో, చక్కని పూలమధ్య

ఒక కొమ్మనుండి మరోకొమ్మకి చురుకుగా ఊగేదానివి

చుక్కల్ని అందుకోడానికి; పొదరిళ్ళపై నేస్తాలతో గంటలకొద్దీ

బారులుతీరి కూర్చుని చంద్రుడితో కబుర్లు చెప్పేదానివి.

నీ బుజ్జి చేతులు ఒక దాని నుండి మరొక దానికి మార్చుకుంటూ

చలిలో దేనికోసమో తెలీకుండా కొమ్మలపై తిరుగుతుండేదానివి.

దీనంగా విచారంతో ముడుతలు పడి యాచించే నీ ముఖం

మరింత కట్టుబాట్లే తెచ్చింది. నీ పక్కనుండే పోయే వాళ్ళకి

అందులో విచారం కనపడలేదు సరిగదా నవ్వడమో,

చురుకుగా చూడ్డమో చేస్తునారు; నిర్లక్ష్యంగా నువ్వు

మురికి కాలవపక్క చేసిన అటువంటి చిలిపి చేష్టలే

నీకు ఈ ఉపద్రవాన్ని తెచ్చిపెట్టాయని గుర్తించకుండా.

.

నాన్సీ కాంప్ బెల్

(1886 – ?)

ఐరిష్ కవయిత్రి

 

 

.

The Monkey

.

I saw you hunched and shivering on the stones,

The bleak wind piercing to your fragile bones,

Your shabby scarlet all inadequate:

A little ape that had such human eyes

They seemed to hide behind their miseries—

Their dumb and hopeless bowing down to fate—

Some puzzled wonder. Was your monkey soul

Sickening with memories of gorgeous days,

Of tropic playfellows and forest ways,

Where, agile, you could swing from bole to bole

In an enchanted twilight with great flowers

For stars; or on a bough the long night hours

Sit out in rows, and chatter at the moon?

Shuffling you went, your tiny chilly hand

Outstretched for what you did not understand;

Your puckered mournful face begging a boon

That but enslaved you more. They who passed by

Saw nothing sorrowful; gave laugh or stare,

Unheeding that the little antic there

Played in the gutter such a tragedy.

.

Nancy Campbell

(1886 – ?)

Irish Poetess

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/49.html

 

%d bloggers like this: