అనువాదలహరి

సౌందర్యం కోసం వగవకు… విటర్ బైనర్, అమెరికను

లే చివురువంటి కేశాలతో మనసుదోచుకునే

దృశ్యాదృశ్యమైన కనుబొమలకోసం శోకించకు;

ఎండలోనూ, మంచుకురిసినపుడూ స్పష్టాస్పష్టంగా

చిరునవ్వులు చిందించే పెదాలకోసమూ వగవకు;

శుష్కించి నిస్త్రాణమై పడున్న అవయవాలు

నీరసించి చలనరహితంగా ఉన్నాయనీ విచారించకు;

అవి ఎగురుతూ ఎగురుతూ ఉన్న పిచ్చుక

ఎన్ని వంకరలుపోగలదో అంతకంటే ఎక్కువగా,

ఎదురులేని ఓడల తెరచాపల సత్తాను పరీక్షించడానికి

ఎంత వేగంగా గాలి వీచగలదో అంతకంటే ఎక్కువ

వేగంగా పరిగెత్తగలమార్గాలు అన్వేషించగలవు.

శోకించకు! నీ కంటికి కనిపించిన దానికంటే

లోతైన ఆ సౌందర్యానికి ఆనందభాష్పాలు విడిచిపెట్టు.

.

విటర్ బైనర్

August 10, 1881 – June 1, 1968

అమెరికను కవి

 

 

Witter Bynner

(aka Emanuel Morgan)

Grieve not for Beauty

.

Grieve not for the invisible, transported brow        

On which like leaves the dark hair grew,      

Nor for the lips of laughter that are now       

Laughing inaudibly in sun and dew,   

Nor for those limbs that, fallen low    

And seeming faint and slow,    

Shall yet pursue    

More ways of swiftness than the swallow dips       

Among … and find more winds than ever blew     

The straining sails of unimpeded ships!        

Mourn not!—yield only happy tears   

To deeper beauty than appears!

.

Witter Bynner (aka Emanuel Morgan)

August 10, 1881 – June 1, 1968

American Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Ed: Harriet Monroe (1860–1936).

http://www.bartleby.com/265/44.html

%d bloggers like this: