అనువాదలహరి

1914 … రూపర్ట్ బ్రూక్, ఇంగ్లీషు కవి

(మొదటి ప్రపంచయుద్ధం నేపధ్యంలో వచ్చిన కవిత ఇది)

ప్రియా! అందరిలోకీ అదృష్టవంతుడూ,

ఈ నిముషంలో అందరికంటే సుఖంగా ఉన్నవాడూ ఎవరంటే,

శాశ్వతమైన ప్రతి వస్తువుతోనూ సఖ్యంగా ఉన్న మనం,

“మన అంత క్షేమంగా ఎవరున్నారు?” అన్న మాట విని

మనం గోప్యంగా ఉంచిన క్షేమ రహస్యాన్ని కనుక్కుని

చీకట్లు ముసురుతున్న ప్రపంచంలో నిశ్చింతగా ఉన్నవాడే.

కాలం శిధిలం చెయ్యలేని ఒక ఇల్లు కట్టుకున్నాం

ఏ బాధా పోగొట్టలేని శాశ్వత ప్రశాంతతని సంపాదించేం

యుద్ధానికి ఎదురునిలవగల శక్తి లేదు. మృత్యువ్యూహాలనుండి

తప్పించుకోగల రహస్య కవచంతో క్షేమంగా వెళ్ళగలను

మనుషులు రాలిపోయే ఏ భద్రతాలేనిచోటకూడా నేను భద్రమే;

ఒకవేళ ఈ అవయవాలు తెగిపోతే, అన్నిటికన్నా భద్రం.

రూపర్ట్ బ్రూక్

3 August 1887 – 23 April 1915

ఇంగ్లీషు కవి

 

Rupert (Chaucer) Brooke

.

Nineteen-Fourteen  

Safety

.

Dear! of all happy in the hour, most blest     

  He who has found our hid security,  

Assured in the dark tides of the world that rest,      

  And heard our word, “Who is so safe as we?”      

We have found safety with all things undying.       

  The winds, and morning, tears of men and mirth, 

The deep night, and birds singing, and clouds flying,       

  And sleep, and freedom, and the autumnal earth. 

We have built a house that is not for Time’s throwing.     

  We have gained a peace unshaken by pain for ever.       

War knows no power. Safe shall be my going,       

  Secretly armed against all death’s endeavor;         

Safe though all safety’s lost; safe where men fall;   

And if these poor limbs die, safest of all.

.

Rupert (Chaucer) Brooke 

3 August 1887 – 23 April 1915

 English Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/37.html

%d bloggers like this: