అనువాదలహరి

ప్రేమవిహంగము … రోలో బ్రిటెన్, అమెరికను కవి

ప్రేమపూర్వకమైన మాటలు గొంతులో కొట్టుకుంటాయి

ఈ లోపున, కలలలో విహరించే నా మనసులోంచి

మరో అందమైన భావన ఎగసి బయటకొస్తుంది.

గుడిలో ప్రతిష్ఠించలేని నా ప్రేమ విహంగమా!

నిన్నెన్నడూ సరియైన మాటలలో వ్యక్తపరచలేను

అందుకనే అలా ఆలోచనలలోనే ఎగరేస్తుంటాను.

అలా శాశ్వతంగా నిరాకారమైన నువ్వు

ఎన్నడూ పైకి లేవని మంచుతెరలా

గాలిలో తేలుతూనే ఉంటావు. నువ్వుకూడా

నల్లని రెక్కలతో ఎగిరే పక్షుల్లో ఒకతెవై

రాత్రల్లా ఎగురుతూనే ఉంటావు

ఏ రాత్రినీ అర్థం చేసుకోలేక

.

రోలో బ్రిటెన్

అమెరికను కవి

.

Bird of Passion

 .

Leave the lovely words unsaid; 

For another thought is fled       

From my dream-entangled mind.        

Bird of passion, unenshrined,   

I can never phrase thee quite— 

So I speed thee on thy flight,    

Unembodied thus forever,        

Floating in a mist that never      

May be raised. Thou art one     

Of the black-winged birds that run,    

With uncomprehended night,   

Unimpeded down the night.

.

Rollo Britten

American

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/34.html

%d bloggers like this: