నెల: జూలై 2015
-
Memories… Sivasagar, Telugu, Indian
The impression of the tear My sweetheart shed in feigned anger The memory of the funeral pyre Kindled on the deathbed of a banyan tree The flotsam rudder reminiscing Its ship lost on the high seas The heady recollection of his ultimate dream Reflecting in Spartacus’s eyes The resonance of the cock-a-doodle-doo At the break…
-
కనుమరుగు… విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్, ఇంగ్లీషు కవి
నీడలేని ఎండలో, పిరమిడ్ కి దగ్గరగా, దాని శిఖరం మిట్టమధ్యాహ్నపు పగటిని చీలుస్తుంటే కళ్ళు తెరవలేని వెలుగు క్రింద తెల్లని బట్టలు ధరించి ఎండలో చెమటలు కక్కుకుంటూ బానిసలు పడుకుని నిద్రపోతున్నారు. వాళ్ళకి నాలుగుచెరగులా,తెరిస్తేచాలు కళ్ళు మండే ఎండ ఎడారి దారుల పొడుగునా తన తేజస్సుని వెదజల్లుతోంది; ఊహించడానికి భయమేస్తూ, తీక్షణంగా, మిరుమిట్లు గొలుపుతూ అంతూ పొంతూ లేని ఒక తెల్లని శూన్యం పరుచుకుని ఉంది. ఆ పిరమిడ్ చీకటి అంతర్భాగంలో శతాబ్దాలుగా సూర్యుడు చొరని చరిత్రతో…
-
పర్వతాలు ఒంటరివి … హేమ్లిన్ గార్లాండ్, అమెరికను
పర్వతాలు పాపం మూగవి; అవి ఒకదానికొకటి దూరంగా ఒంటరిగా ఉంటాయి. రాత్రిపూట వాటిశిఖరాలను చుంబించే మేఘాలు వాటి మూలుగులుగాని, నిట్టూర్పులుగాని వినలేవు. సైనికుల్లా, వాటిని నిర్దేశించిన చోట ధైర్యంగా, నిటారుగా తలెత్తుకుని నిలబడతాయి వాటి పాదాలచెంత అడవుల్ని పొదువుకుని ఆకాశాన్ని పడిపోకుండా నిలబెడతాయి. . హేమ్లిన్ గార్లాండ్ September 14, 1860 – March 4, 1940 అమెరికను కవి, కథారచయిత . . The Mountains are a Lonely Folk . The mountains…
-
నవంబరు అతిథి… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను
ఆమె నా పక్కన ఉంటే, నా సంగతి ఏమి చెప్పను ఈ చెట్లు ఆకులు రాల్చే చీకటిరోజులే రోజులు ఎలాఉండాలో చాటే గొప్ప రోజులంటుంది; మోడువారి ఎండిపోయిన చెట్లంటే ఆమెకు ఇష్టం; చిత్తడిగాఉండే పచ్చికదారులంట నడుస్తుంది. ఆమె సంతోషం నన్ను నన్నుగా ఉండనీదు ఆమె మాటాడుతూ ఉంటుంది, నేను తృప్తిగా వింటూంటాను; పక్షులెగిరిపోయినందుకు ఆమెకు సంతోషం ఆమె ధరించిన సాదా గోధుమరంగు ఉన్ని వస్త్రము అంటుకున్న మంచుతో వెండిలా మెరుస్తున్నందుకు ఆనందం. ఈ నిర్మానుష్యపు ఒంటరి వృక్షాలూ…
-
కటుత్వానికి అలసిపోయాను… ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను కవి
నేను తెలివిగా, కటువుగా ఉండి ఉండి అలసిపోయాను, చిరకాలం తర్వాత వాటి ఆహార్యాలూ, తెరలూ తొలగిపోయాయి ఏడ ద్వీపాలు ప్రశాంతంగా ఉంటాయో, జలధిలో సూర్యుడుదయిస్తాడో అక్కడికిపోయి సంగీతం ప్రసాదించే వివేకంలో వాటిని లయించుకుంటాను. సంగీతంలో ఋషులకుకూడా తెలియరాని మహిమలున్నాయి రహః తనూరుహాలపై అచ్చపు వింతశక్తులు మనప్రక్కనుండే ఎగురుతాయి; నిస్సందేహంగా స్తబ్ద పూర్వ యుగాల నీరవ నిశ్శబ్దంలోంచి రోదసిని వెలుగుతో నింపి అస్థవ్యస్థ ప్రకృతికి జీవంపోసింది సంగీతమే. మనకి తెలిసినదంతా నిష్ప్రయోజనం; మనం వెంపర్లాడేవీ నిష్ఫలములే పొగడ్తలతో అధిక భారాన్ని…
-
డయొజినెస్… మాక్స్ ఈస్ట్ మన్, అమెరికను
ఒక పాక, ఓ చెట్టూ ఓ కొండ వాలు, పచ్చిక బలిసిన మైదాన ప్రశాంతత నాకు చాలు, మరేం కోరను. దేవుడైనా, మహరాజైనా తన నీడని నామీంచి తప్పించమంటాను. . మాక్స్ ఈస్ట్ మన్ అమెరికను . ఈ కవితని అర్థం చేసుకుందికి చిన్న వివరణ అవసరం. (డయొజినెస్ ఆఫ్ సైనోప్ (క్రీ. పూ. 412/ 404 – 323 ) ఒక గ్రీకు తత్త్వవేత్త. అతను మాటలలో కంటే, ఆచరించడం ద్వారా మాత్రమే విలువలు…
-
O Lord! Forgive the Killer!… Ashok Kumbamu, Telugu, Indian
O Lord! Forgive the killer! He is ignorant. He is arrogant. Except for its skin color He can make out nothing of humanity Poor creature! His devotion to the flag Fans hatred towards other sections of the society. Forgive him! After all, he is your child, Unfortunately, He is addicted to hunting and heap up…
-
నా ఆత్మను నిద్ర ఆవహించింది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
నా ఆత్మని నిద్ర ఆవహించింది నాకిపుడు ఏ లౌకిక బాధలూ లేవు దొర్లిపోతున్న కాలాన్ని ఇపుడామె గుర్తించగల స్థితిలో లేదు . ఆమెలో చలనం లేదు, జీవం లేదు ఆమె చూడనూ లేదు, విననూ లేదు; భూమి మీది రాయి-రప్పా, చెట్టు-చేమతో పాటు ఇక అహరహమూ పరిభ్రమిస్తూనే ఉంటుంది . విలియం వర్డ్స్ వర్త్ 7 April 1770 – 23 April 1850 ఇంగ్లీషు కవి A Slumber Did My Spirit Seal .…
-
చీకటి చిక్కబడుతోంది… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి
పగలల్లా భీకరంగా ఎండ కాసి కాసి సంధ్యవేళకి చీకటి చిక్కబడుతోంది, గాలి ఎగరేస్తున్న కెరటాలకి, రాత్రి భీకరంగా ఉంటుందని అర్థమయింది దూరాన ఎక్కడో ఉరుము ఉరుముతోంది. సముద్రపక్షికూనలు కొండల శిఖరాగ్రాల అంచులపై ఎగురుతున్నాయి అలవాటుగా ఇచ్చవచ్చినట్టు ఎగురుతూ ఆనందంగా రెక్కలల్లార్చుతున్నాయి దిగడానికి రెక్కలతెలుపు నీటితెలుపుతో కరిగిపోతూ కనుచూపుమేరలో ఓడల జాడలేదు సూర్యుడు ఇలా క్రిందకి గ్రుంకేడోలేదో దట్టమైన మేఘాలు కూడబలుక్కున్నట్టు దూరాన ఉదయించబోయే చంద్రుణ్ణి మూసేసేయి. పాపం, వెర్రి ప్రేమికా! నువ్వు ఏకాకివి. . రాబర్ట్ బ్రిడ్జెస్…
-
సహవాసి… లీ విల్సన్ డాడ్ అమెరికను కవి
నన్ను శత్రువను మిత్రుడను నాకు లక్ష్యం లేదు ఎవరు తెగించగలరో వారి వెంటనే నేనూను నేనే శక్తినీ నేనే ప్రేరణనీ నేనే కోరికకి మూలాధారాన్ని నేనే ఆవేశాన్ని నేనే ప్రోత్సాహం, ఆలంబననూ నేనే గీతంగా మారే కెరటాలమీది చంద్రికనీ నన్ను శత్రువను మిత్రుడను నాకు లక్ష్యం లేదు మరణానికి వెరవక ఆలపించేవారివెంటే నేనూను నన్ను శత్రువను మిత్రుడను నేను ఇవ్వడానికే తీసుకుంటాను బ్రతకడానికి మరణించే వారి వెంటే నేనూను . లీ విల్సన్ డాడ్ అమెరికను కవి…