(… మన అవగాహన పరిధి దాటి సృష్టిలో కనిపించే మంచిదనమే… ఏకకాలంలో అందానికి లక్షణమూ, జన్మస్థానమూ కూడ: ఈ ప్రాధమికమైన సౌందర్యం, ప్రాధమికమైన మంచిదనం రెండూ ఒకచోటే ఉంటాయి… అందుకే మంచిదనాన్ని ఆశ్రయించే అందం ఉంటుంది… ప్లాటినస్)
సూర్యుడు ఏకకాలంలో చాలాచోట్ల ప్రకాశిస్తాడు, సౌందర్యం అంతరాంతరాల్లో దాక్కుంటుంది. ఒక్క వెలుగే ఎన్నో ముఖాలని దీపించి లోపాలు చూపి ఉత్కృష్టసౌందర్యాన్ని నిరూపిస్తుంది ప్రతి పర్వతం, ఆకాశం, నదీ “భగవంతుడు ప్రసాదించే ఏ వరం నాశనంలేనిది?” అని పదే పదే నే నడిగే ప్రశ్నలకి దేముని సమాధానాన్ని చెబుతున్నట్టుంటాయి; అయినా నేను సందేహాలతోనూ, సరిపోలికలతోనూ నా అలౌకికమైన ఆనందాన్ని ధ్వంశం చేసుకుంటాను. భగవంతుడే అవిచ్ఛిన్నమైన సంపద… కాలాతీతమైన సౌందర్యం నా పాలు. .
The Catholic world పత్రికలో ప్రచురితం . ఆర్మెల్ ఒ కానర్
అమెరికను
.
Beauty
(… and The Good, which lies beyond is the Fountain at once and Principle of Beauty: the Primal Good and the Primal Beauty have the one dwelling-place and, thus, always, Beauty’s seat is There.—Plotinus.)