అనువాదలహరి

My Life is a Newborn Baby… Vadrevu Chinaveerabhadrudu

You will be surprised if you look at me now

Wondering why I am circumambulating.

Like a young bride making revolutions

About the Peepul seeking a child…

Hoping for a fruitful life, I make

revolutions about this Peepul Tree.

Time revolves round me. And

I run around the rounding Time

To hold aloft in my palm

Time’s timeless secret.

By the time I complete the revolutions

A sprout shoots through the seed;

Endowing a form to my intentions

The dawn confers it with life.

With the flora as witness

My life becomes a newborn baby

When I put this child in the cradle

I shall send you invitation.

.

Vadrevu Chinaveerabhadrudu

Telugu, Indian

Vadrevu  Chinaveerabhadrudu

Vadrevu Chinaveerabhadrudu

Vadrevu Chinaveerabhadrudu is a versatile poet, translator,  literary critic, and painter apart from being a senior civil servant occupying a key position as Additional Director in Gov. of AP.  He has special interest in Chinese poetry.  He has several publications to his credit  including his poetry collections “కోకిల ప్రవేశించే కాలం” (The Season of Cuckoo) and  నీటిరంగుల చిత్రం (A Water Color on Canvas).

నా జీవితమొక నవశిశువు

ఈ వేళప్పుడు నన్ను చూస్తే ఆశ్చర్యపోతారు

ఎందుకోసమిట్లా ప్రదక్షిణాలు చేస్తున్నావంటారు.

గర్భంతాల్చాలన్న మొక్కుతో నవ వధువులు

రావిచెట్టూ చుట్టూ నూటొక్కమార్లు తిరిగినట్టు

జీవితం ఫలించాలని ఈ అశ్వత్థం చుట్టూ

వెయ్యిన్నొక్కసార్లు తిరుగుతున్నాను.

నా చుట్టూ కాలం పరిభ్రమిస్తోంది

పరిభ్రమిస్తున్న కాలం చుట్టూ

కాలాతీత రహస్యం కరతలామలకం

కావాలని నేనూ పరిభ్రమిస్తున్నాను.

ప్రదక్షిణాలు పూర్తయేసరికి బీజం

అంకురంగా పొటమరిస్తుంది

నా సంకల్పానికి ఒక ఆకృతి సంతరించి

ప్రాతః సూర్యకాంతి ప్రాణం పోస్తుంది.

చెట్లు సాక్షిగా నా జీవితమప్పుడొక

నవశిశువుగా రూపుదాలుస్తుంది.

బిడ్డను ఊయెలతొట్టిలో వేసే రోజున

మీకందరికీ సంతోషంగా కబురంపుతాను.

.

వాడ్రేవు చినవీరభద్రుడు

తెలుగు

%d bloggers like this: